Showing posts with label editors speech. Show all posts
Showing posts with label editors speech. Show all posts

ప్రారంభమైన "శోధిని" వ్యాఖ్యల విభాగం - తీసుకువచ్చిన మార్పులు

పదిరోజుల క్రితం "అనామకుల కామెంట్లలో తిట్లకు బాధ్యులు ఎవరు?" టపా ద్వారా ఓ చర్చ పెట్టడం జరిగింది. అయితే అప్పటికి చాలా కాలం క్రితమే కూడలి బ్లాగులో వచ్చిన అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా? అనే టపాను నేను చదవలేదు. ఆ తర్వాత చదవడం జరిగింది. దానికి లింకుగా బ్లాగరుల ప్రవర్తనా నియమావళి అనే ఒక టపా కూడా ఉంది. రెండు సార్లు ఉత్తమ బ్లాగర్ అవార్డు పొందిన శోధన సుధాకర్ వ్రాసిన ఈ పోస్టు ప్రస్తుత బ్లాగర్లందరూ ఒకసారి చదివితే మంచిదని నా అభిప్రాయం. 
ఆ పోస్టులోని కొన్ని అంశాలు మీకోసం  - 


మనం వాడిన భాషకు, పదాలకు మరియు మనం అనుమతించిన వ్యాఖ్యలకు మనదే పూర్తి భాధ్యత. మనం నాగరికతతో కూడన విషయాన్ని ప్రోత్సహించుతాం . అనాగరిక విషయాలు మన బ్లాగులో చోటు చేసుకుంటే, వ్యాఖ్యలలో వుంటే వాటిని తీసి వెయ్యటం మన భాధ్యత .
అందులో అనాగరిక విషయాలు ఏమిటో కూడా వివరంచారు.

అలాగే క్రింది అంశాలు కూడా అందులో ఉన్నాయి ...

వ్యాఖ్యలను చేసేవారు తప్పని సరిగా తమ ఈ-మెయిల్ చిరునామా, తమ అసలు పేరు గానీ, మారు పేరు గానీ వుపయోగించేలా చూసుకోవాలి.
# వ్యాఖ్యల దాడి చేసే వారిని మనం పట్టించుకోకూడదు.
వ్యాఖ్యల దాడిని పట్టించుకోకూడదు. అవి మరీ అభ్యంతరం, వ్యక్తిగతం అయితే తప్ప. వ్యాఖ్యల ద్వారా దాడి చేసే వారితో ప్రతి వ్యాఖ్యానం మొదలు పెట్టడం పందితో మల్లయుద్ధం చెయ్యటమే అవుతుంది. ఆ యుద్ధంలో ఇద్దరికీ బురద అంటుకుంటుంది. పందికి బురద ఇష్టం, మీకు అయిష్టం. అది గుర్తుపెట్టుకోండి.
తెలుగు బ్లాగర్లు దాదాపు బ్లాగర్ , వర్డుప్రెస్సు ఉపయోగిస్తారు. ఇవి కూడా బ్లాగర్లకు కొన్ని నియమాలను రూపొందించి అందిస్తున్నాయి.

బ్లాగర్ నియమావళి : https://www.blogger.com/content.g
వర్డుప్రెస్సు నియమావళి: https://en.wordpress.com/tos/

వాటిలో కూడా అసభ్య ప్రవర్తనకు పూర్తిగా ఆ బ్లాగరునే బాధ్యులుగా చేశాయి. ఇన్ని ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా మరో నియమావళి అంతగా అవసరం లేదేమో ... !?

శోధిని క్రొత్త వ్యాఖ్యల విభాగంలో తీసుకువచ్చిన మార్పులు. 

  •  అనామక/అజ్ఞాత  కామెంట్లు నిరోధించడం. 
  • అత్యధిక వేగంగా వ్యాఖ్యలను సేకరించడం
  • వ్యాఖ్యల డేటా శోధినిలో స్టోర్ కాకుండా చూడడం. 
  • సరిక్రొత్త రెండు కాలమ్స్ రూపం 
  • మొబైల్ లో కూడా సౌకర్యవంతమైన వీక్షణ

 ఈ విభాగాన్ని ఇక్కడి నుండి చూడొచ్చు



  ఈ క్రొత్త రూపు మీకు నచ్చుతుందని ఆశిస్తూ ...

"శోధిని" వ్యాఖ్యల విభాగంలో మార్పులు - నెలాఖరుకు మీ ముందుకు

దీపావళి అందరూ బాగా చేసుకుంటున్నారని తలుస్తాను.
"శోధిని" నుంచి కొన్ని బ్లాగులు తొలగించాలా? అనే టపాకు స్పందించి మంచి కామెంట్లను అందించిన అందరికీ కృతజ్ఞతలు. శోధిని నుంచి ఒక్క బ్లాగుకూడా సరైన కారణం చూపకుండా తొలగించకూడదని నిర్ణయించడం జరిగింది. బ్లాగు పేరు ఎలాగూ కనపడుతుంది.ఇష్టం లేనివారు ఆ బ్లాగుకు వెళ్లకుండా ఉంటె బెటర్. లోనికి తొంగి చూడ్డం ఎందుకు .. బాధ పడడం ఎందుకు ?.. అంతే  అంటారా ?! 
ప్రస్తుతం శోధినిలో 3016 ఉన్నాయి. 22 May 2016 న పెట్టిన "శోధిని" తెలుగు బ్లాగుల సంకలిని

టపాలో అప్పటికి 2998 బ్లాగులు ఉన్నాయని చెప్పాను. అంటే అప్పటి నుండి 18 క్రొత్త బ్లాగులే కలిపారా అనొచ్చు మీరు. కానీ అప్పటి నుండి జతచేసిన బ్లాగుల సంఖ్య లెక్కేస్తే 145గా తేలింది అంటే దాదాపు 127 బ్లాగులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ కావాలని తొలగించినవి కాదు. ఆయా బ్లాగు నిర్వాహకులే తమ బ్లాగులను తొలగించుకోవడమో, ప్రయివేట్ ఎక్సిస్ చేసుకోవడమో చేశారు.
ఇప్పటికీ తెలుగులో అత్యధిక బ్లాగులు కలిగిన సంకలిని శోధిని అని ఖచ్చితంగా చెప్పగలను.
గత కొద్దిరోజుల నుండి కామెంట్ల విభాగం మూసివేశాక శోధిని వీక్షకులు దాదాపు 10% తగ్గిపోయారు. అంటే ఎక్కువమంది వ్యాఖ్యలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్ధమవుతుంది.
అజ్ఞాతల కామెంట్లలో వేరే బ్లాగర్లను తిడుతుండడంతో కొన్ని కారణాల దృష్ట్యా ఆ విభాగం ఆపవలసి వచ్చింది. ముందుగా అజ్ఞాత కామెంట్లను అనుమతిస్తున్న బ్లాగులను కామెంట్ల విభాగం నుంచి తొలగిందామనుకున్నా ఆయా బ్లాగులలో మంచి కామెంట్లు కూడా వస్తుండడంతో వేరే ఆలోచన చేయడం జరిగింది. కేవలం అజ్ఞాత కామెంట్లను మాత్రం ఆపి మిగతా కామెంట్లతో వ్యాఖ్యల విభాగం రూపొందించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పని దాదాపు పూర్తి అయినా ... డిజైన్ పరంగా కూడా మార్పులు చేసి మాలిక లాగా రెండు కాలమ్స్ లలో తీసుకురావడానికి ప్రయ్నతాలు సాగుతున్నాయి. బహుశా ఈ నెలాఖరుకు అది మీముందు ఉండొచ్చు .
రాబోతున్న కామెంట్ల విభాగంలో చేయాల్సిన మార్పులపై మీరు చెప్పదల్సుకుంది ఏమైనా ఉంటె ఇక్కడ చెప్పొచ్చు. వీలుంటే పరిశీలిస్తాం...



క్రొత్త సర్వర్ లోనికి శోధిని మారింది - త్వరలో ఉగాది బ్లాగుల పోటీ !

నిన్నటి నుండి శోధిని మొరాయించడానికి కారణం సర్వర్ మార్చే ప్రయత్నంలో ఉండడం. శోధిని ని ఇప్పుడు వేగంగా లోడ్ అయ్యే మా స్వంత సర్వర్ లోనికి మార్చడం పూర్తయింది . name server  రికార్డ్స్ కూడా  పూర్తిగా మారినట్లుగా అనిపిస్తుంది . మీరు కూడా గమనించి ఏవైనా లోపాలు ఉంటే తెలియపరచగలరు. ఒకవేళ ఒక్కోసారి పనిచేయకపోయినా మరో 24 గంటల్లో పూర్తిగా పనిచేస్తుంది. 
వచ్ఛే ఉగాదికి బ్లాగిల్లు శోధినిగా మారి సంవత్సరం అవుతుంది. ఇంతకాలం మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఒకవైపు ప్రభుత్వాలు కూడా తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎటువంటి తరుణంలో తెలుగు భాష మనగలాలి అంటే తెలుగు బ్లాగర్ల ద్వారా కూడా సాధ్యమే . ఎన్ని ఇతర భాషా బ్లాగులు ఉన్నా కనీసం ఒక్క తెలుగు బ్లాగునైనా నడుపుతూ ఉండమని నా మనవి .
ఇందుకు "శోధిని" ద్వారా ప్రోత్సాహాన్ని అందించేందుకు నేను రెడీ ! తెలుగులో టైపు చే యడం రాని  వాళ్లు లేదా తెలుగు వచ్చి బ్లాగు ఎలా ప్రారంభించాలో తెలియని వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేను వారికి సహాయం పడగలను . క్రిమ్ద ఉన్న లింకులో మీ సహాయం కోసం అడిగితె నేను మీకు ఉచితంగా ( ఫోన్ బిల్లుతో పాటూ ) ఆన్ లైన్ సహాయం/శిక్షణ ఇచ్చేందుకు  సంసిద్ధం. 

మీ ఫోన్ నంబర్ ఇవ్వడం మర్చిపోకండి.


మరో శుభవార్త ! 

ఈ ఉగాదికి తెలుగు బ్లాగుల పోటీ జరగనుంది .. ఇది వినూత్నంగా ఉండబోతొంది పూర్తి వివరాలు త్వరలో  

త్వరలో "బ్లాగిల్లు" క్రొత్త వర్షన్ రాబోతుంది - మీ సలహాలకు ఆహ్వానం

మరో నెలరోజుల్లో (సెప్టెంబర్ 30) యాహూ పైప్స్ మూతపడబోతున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది . దానితో ఈ స్క్రిప్ట్ పై పనిచేస్తున్న బ్లాగిల్లు  కూడా ఆగిపొనుంది . ఇప్పటికే అది అప్పుడప్పుడూ ఆగిపొతూనే ఉంది. బ్లాగిల్లులో ఇప్పటికే కలుపబడి ఉన్న దాదాపు 3400 బ్లాగులు , అనుమతి కోసం వేచిఉన్న దాదాపు 50 వరకు బ్లాగులు ఇవన్నింటిని కలిపి ఆగ్రిగేటర్ తయారు చేయాలి  . క్రొత్తగా తయారు చేయబోయే సంకలిని దాదాపు 5000 బ్లాగులను నిరంతరాయంగా జల్లించే సామర్ధ్యం కలిగి ఉండాలి . ఇలా చేయాలంటే చాలా శ్రమ మరియు ఖర్చుతో కూడిన పని .అయినప్పటికీ తెలుగు బ్లాగుల అభివృద్ధి కోసం నడుం బిగించిన నేను ఏదో విధంగా ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాను . అయితే ప్రస్తుతం ఉన్న కూడలి , మాలిక సమర్ధవంతంగా తమ ఆగ్రిగేషన్ చేస్తున్నాయి . అందుకే ఒక   క్రొత్త ఆలోచనతో ముందుకు వెళదామని నిర్ణయించుకున్నాను .
చాలామంది ఇండీబ్లాగర్ చూసే ఉంటారు .. అది ఒక ఆగ్రిగేటర్ అని బ్రమపడే వారూ ఉండే ఉంటారు . కానీ ఇండీబ్లాగర్ ఒక బుక్ మార్కింగ్ సైట్ . ఇది ఎలా పనిచేస్తుందంటే దీనిలోని సభ్యులు వారు తమ బ్లాగుల్లో చేసిన టపా యొక్క లింకును  ఇండీబ్లాగర్ కు కలుపుతారు . ఇది తమకు ఇష్టమైన టపాకే చెయ్యవచ్చు . ఇలా సభ్యులచే కలిపిన టపాలు మాత్రమే ఇండీబ్లాగర్ లో చూపబడుతాయి . ఇందులోని బ్లాగులకు ర్యాంకింగ్ కూడా ఉంటుంది. దానిలాగానే బ్లాగిల్లును కూడా ఒక బుక్ మార్కింగ్ సైట్ లా మారుద్దామని ఆలోచన .ఈ ఆలోచనతో క్రొత్త వెబ్సైట్ రూపుదిద్దు కుంటున్నది . బహుశా వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 17 న ఈ నూతన బ్లాగిల్లు మీముందుకు రావచ్చు .
ఇప్పడు ఉన్న మిగతా విభాగాలు కూడా మారే అవకాశం  ఉంది .
సాద్యమైనన్ని  ఎక్కువ ఫీచర్స్ తో సరిక్రొత్త వర్షన్ తీసుకురావాలని తపన. దీనికి మీ సలహాలు కూడా పంపగలరు . వీలుంటే పరిశీలిస్తాను .
  • కామెంట్ల విభాగం ఉండక పోవచ్చు .
  • ర్యాంకింగ్ లో క్రొత్త విధానం



తెలుగుబ్లాగుల లోకానికి ...

         డచిన నాలుగైదు సంవత్సరాలుగా "బ్లాగిల్లు"పై అటు బ్లాగర్లు, వీక్షకులు చూపుతున్న అభిమానం చాలా గొప్పది . బ్లాగిల్లు పుట్టినప్పట్నుంచీ ఆధునీకరణ చేసుకుంటూనే ఉంది . అంతే దు అనేక కష్ట నష్టాలను ఎదుర్కుంటూనే ఉంది . వివిధ కారణాల వల్ల నేను గడచిన నెల రోజులుగా బ్లాగులవైపు చూడడం మానేసాను . ర్యాంకింగ్ విభాగాన్ని ఆధునీకరించలేదు, క్రొత్త బ్లాగులను చేర్చలేదు . అయినప్పటికీ బ్లాగిల్లు వీక్షకుల సంఖ్య తగ్గలేదు ... పైగా కాస్త పెరిగింది కూడా !
       పని వత్తిడులవల్ల మరికొంత కాలం (కొన్ని వారాలు) బ్లాగులవైపు చూడడం తగ్గించవచ్చు. కానీ త్వరలో ఒక టీం ను ఏర్పాటుచెసుకునే ఆలోచన ఉంది . మీ అభిమాన బ్లాగిల్లు మరింత గొప్పగా తయారవడం కోసం ఒక స్క్రిప్టును తయారు చేయవచ్చు . 
     ప్రస్తుతం బ్లాగిల్లు వద్ద విండోస్ , లినక్స్  సర్వర్లు ఉన్నాయి . వాటిపై హోస్టు చేసేందుకు తగిన స్క్రిప్టు తయారు చేసే ఆలోచన ఉంది . సమయం చిక్కినప్పుడు ఆదిశగా ఆలోచించి మెరుగైన సదుపాయాలు మీకు అందించే ఏర్పాటు తప్పక చేస్తాను . మీరు కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక మంచి సంకలిని చూసినట్లయితే నాకు తెలియచేయండి . అటువంటి స్క్రిప్టు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. 
  క్రొత్తగా బ్లాగిల్లులో బ్లాగులను జతచేస్తున్నవారు దయచేసి జరుగుతున్న ఆలస్యానికి క్షమించగలరు . సాధ్యమైనంత తొందరలో మీ బ్లాగులు జతచేయడం జరుగుతుంది . 
వేసవి సెలవుల శుభాకాంక్షలతో ... 

'బ్లాగిల్లు' వేగం కాస్త పెరిగింది

     http://sr.photos3.fotosearch.com/bthumb/CSP/CSP992/k13228485.jpg 



మొబైల్ వినియోగదారులకు బ్లాగిల్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్నమాట మీకు తెలుసుకదా ? అప్లికేషన్ ద్వారా కాకుండా నేరుగా ఆ వెబ్ సైట్ క్రింది లింక్ ద్వారా దర్శించవచ్చు.
                                             m.blogillu.com 

      వివిధ పరీక్షల తర్వాత ఇదే తరహా రంగులను ( బ్లాగు పేరు : శీర్షిక ) మెయిన్ వెబ్ సైట్ లో కూడా వినియోగించదలిచాను .
      ఈ సైట్ లో తాజా టపాలు ప్రస్తుతం ఉన్న సైట్ కంటే  వేగంగానే కనపడుతాయి .
      అయితే వివిధ అంశాలు, శీర్షికలు ఇంకా కలిపి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను .

"ఉత్తమ తెలుగు బ్లాగులు" మరియు "బ్లాగిల్లు" యొక్క డిసెంబర్ అప్డేట్స్

"ఉత్తమ తెలుగు బ్లాగులు" విభాగం  పూర్తిగా వీక్షకులకు సౌకర్యంగా ఉండేలా నవీకరించడం జరిగింది.అలాగే డిసెంబర్ 1 న ర్యాంకుల ఆధునీకరణ జరిగింది . ఈ విభాగం ఎలా ఉందొ తెలుపగలరు . అలాగే ఇంకా ఏమేమి దీనిలో చేర్చాలో సలహా ఇవ్వగలరు .
 ఇప్పటికే సభ్యులైన వారికి ఓ విజ్ఞప్తి ! కొందరు ఇప్పటికీ పాత ర్యాంక్ కోడ్ లనే ఉపయోగిస్తున్నారు . అవి మీ ర్యాంకులతో పాటూ మార్పు చెందవు . కనుక క్రొత్త కోడ్ మార్చుకోగలరు .క్రింది విధంగా మీ బ్లాగులో బొత్తాం కనుక ఉంటె అది పాతది .

దీన్ని తప్పక  మార్చుకోగలరు . మీ వద్ద కోడ్ లేనట్లయితే మెయిల్ పంపండి .

ఇక, 
2015 కు ఆహ్వానం పలుకుతూ మీ కోసం రెండు వార్తలు -
1. త్వరలో బ్లాగిల్లులో మరో విభాగం రాబోతున్నది .
ప్రస్తుతం ఏ బ్లాగర్ టపాలు వ్రాస్తున్నారు ?
ఈరోజు ఏ ఏ బ్లాగుల్లో టపాలు ఎన్ని వచ్చాయి ?
ఏ బ్లాగుల్లో వ్యాఖ్యలు ఎన్ని వచ్చాయి ?
తాజా వార్తలు ...
తాజా సినిమా సమాచారం ...
ఏ ఊళ్ళో బ్లాగర్లు ఎంతమంది , ఎవరెవరు ఉన్నారు ?
ఇంకా ఎన్నో .. ఎన్నెన్నో విశేషాలతో మీకోసం ఓ విభాగం త్వరలో ప్రారంభం అవుతుంది .
2. తెలుగు బ్లాగులకు ఉచితంగా బ్లాగు SEO  విశ్లేషణ , సలహాలు , సూచనలు ఇచ్చే సర్వీస్ -
 కోరిన వారికి ఉచితంగా వారి బ్లాగును SEO  విశ్లేషణ చేసి సూచనలు పంపడం అనే సదుపాయం త్వరలో మీకోసం .



బ్లాగులూ - కామెంట్లూ - ఆగ్రిగేటర్లూ

       దాదాపు రెండు నెలల క్రితం ఇదే బ్లాగులో " కామెంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి " అనే టపా వ్రాయడం జరిగింది. ఇప్పుడు కొన్ని బ్లాగులలో కామెంట్లు ఎక్కువయ్యాయని వాటిని సంకలినులు నిరోధించాలి ( నిషేదించాలి కాదు) అంటూ కొందరు నాకు లేఖలు వ్రాస్తున్నారు, కొందరు తమ బ్లాగుల్లో టపాలు కూడా పెడుతున్నారు . నిజానికి కామెంట్లు అనేవి  ప్రతీ బ్లాగుకూ ఒక ఇందనంలాంటివి అని నా నమ్మకం. ఇప్పుడు ప్రజ బ్లాగులో కానీ , శంకరాభరణం బ్లాగులో కానీ ,  క్రొత్తగా భరతమాత సేవలో బ్లాగులో గానీ టపాలు ఎక్కువగా వ్రాస్తున్నారంటే దానికి కారణం చదివేవాళ్ళు ఎక్కువగా ఆదరించి కామెంట్లు పెడుతూ ఉండడమే ! వ్యాఖ్యాతల ఆదరణే  ఏ బ్లాగరునైనా ఉత్సాహపరుస్తుంది అనడంలో అతిశయిక్తి లేదు . గతంలో ఈరోజు ఎక్కువగా కామెంట్లు వచ్చిన బ్లాగులు , ఎక్కువ కామెంట్లు చేసినవారు అనే ఉప శీర్షికలు బ్లాగిల్లులో ఉంచాను . దీనికి కారణం ఆయా బ్లాగర్లను , వ్యాఖ్యాతలను ఉత్సాహపరచడమే . ఆమధ్య హారం మూతపడినందుకు చాలా మంది బాధ పడింది దానిలోని కామెంట్ల సదుపాయాన్ని చూసే !
       బ్లాగరుకు ఏ విషయంపైన అవగాహన ఉందొ ఆ విషయంపైన ఎలా టపాలు వ్రాస్తారో కామెంట్లు వ్రాసేవారు కూడా తమ తమ అభీష్టాల మేరకు తాము నచ్చిన  అంశంలో మాత్రమే కామెంట్లు పెట్టగలరు . ప్రజ  లో కామెంట్లు చేసేవారు, శంకరాభరణంలో చేయాలని లేదు కదా !సంస్కృతిని కాపాడే శంకరాభరణం ఎలా అభినందనీయమో  నేటి వర్తమాన రాజకీయాలపై వ్రాస్తున్న ప్రజ  అలాగే అభినందనీయం . ఏ విషయంలోనైనా బ్లాగు నిర్వహించాలంటే అది సామాన్య విషయం కాదు . శ్రమ , ధనం, కాలం వెచ్చించి చేస్తున్న పని ఇది . వర్తమాన రాజకీయాలపై చర్చించాలని తద్వారా ఆయా విషయాలపై బ్లాగర్లకు తప్పు-ఒప్పులు తెలుస్తాయని పల్లా కొండలరావు గారు చేస్తున్న ప్రయత్నం హర్షించదగినది . సంస్కృతిని కాపాడేందుకు ఛందస్సుపై అవగాహన పెంచేందుకు శంకరయ్యగారు , దేశనాయకుల గురించి , మన దేశం గొప్పతనాన్ని చాటుతున్న భారతమాత సేవలో సాయినాధ్ రెడ్డి గారు , సాంప్రదాయలను నేటి తరం మర్చిపోకుండా చేస్తున్న కష్టేఫలే శర్మ గారు , శ్యామలీయం గారూ .. ఇంకా ఎందఱో తమ బ్లాగుల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ అభినందనీయులే !
ఇక వ్యాఖ్యలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం  చేయడానికి రాయాలి తప్ప తమ ఆలోచనలతో విభేదిస్తున్నవారిని దూషించడానికి కాదు. తమ వాదనలో బలం ఉన్నప్పుడు ఎదుటివారు పునరాలోచించే అవకాశం  ఉంది. అయితే ఈ వ్యాఖ్యల నియంత్రణ బాధ్యత పూర్తిగా ఆయా బ్లాగు నిర్వాహకులదే . అనామక వ్యాఖ్యలు అనుమతించాలా, మోడరేషన్ పెట్టాలా అన్న సదుపాయాన్ని తమ అవసరాలను తగ్గట్టు వినియోగించుకొనేలా గూగుల్ , వర్డ్ ప్రెస్ మన చేతికే ఇచ్చాయి .
      అయితే సంకలినులకు కొన్ని పరిమితులు ఉంటాయి . అవి వ్యాఖ్యలను , టపాలను నియంత్రించలేవు . అలా చేస్తే అది భావా స్వేచ్చను హరించడం కూడా ! కూడలి ఈ సదుపాయాన్ని కూడా మన చేతికే ఇచ్చింది . ఇక వ్యాఖ్యల కోసం పూర్తిస్థాయి విభాగాలు ఉన్న మాలిక , బ్లాగిల్లు  వ్యాఖ్యాతలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏ ఇతర భాషలోలని  ఆగ్రిగేటర్  లలోనూ  ఇంతవరకూ నేను చూడలేదు. అయితే రెండు కాలమ్  లలో వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చే బ్లాగు ఒకవైపు, రాని  బ్లాగులు పెట్టమనడంపై నాకు ఖచ్చితమైన అభిప్రాయం లేదు . ఈ విషయంలో అందరూ చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది . అయితే ఏ బ్లాగునూ నిరోధించమనకూడదు అనేది నా అభిప్రాయం . 

క్రొత్తగా "ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం"

   మీ అందరి ఆదరణ పొందిన "ఉత్తమ తెలుగు బ్లాగులు"  విభాగం ఆధునీకరణ పూర్తయింది. ఈ విభాగం ఇప్పుడు క్రొత్త లింకుకు మార్పు చేయబడింది. దీన్ని మీరు http://rank.blogillu.com అనే లింకులో చూడొచ్చు . ఇకపై ఇక్కడే ఈ విభాగం , దానిలోని బ్లాగుల విశ్లేషణ , ఈ విభాగానికి సంబంధించిన  క్రొత్త శీర్షికలు , వార్తలు ఉంటాయి .
   ర్యాంకుల మార్పు కూడా నిన్ననే జరిగింది . కానీ కొన్ని సాంకేతిక , ఆధునీకరణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీరు బ్లాగుల్లో జతచేసిన కోడ్ మార్పు చేయబడింది . ప్రస్తుతం ఉన్న కోడ్ స్థానే క్రొత్త కోడ్ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కోడ్ ను మూడుసార్లు మార్పు చేసి మీకు ఇబ్బంది కలిగించాను. ఈ సారికి క్షమించగలరు.
                    ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగాన్ని ఇక్కడి నుండి చేరుకోండి


నూతన 'బ్లాగిల్లు' లో మట్టమొదటి విభాగం ప్రారంభం


ముందుగా తెలుగు బ్లాగర్లు , బ్లాగిల్లు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
బ్లాగిల్లు హోస్టింగ్ కాలపరిమితి ముగిసాక ఇక blogillu .com ను బ్లాగర్ లో కొనసాగించాలని నిర్ణయించాను .
ఇంతకూ ముందు ఉండిన బ్లాగిల్లులో సంకలిని (/blogs ) అనే విభాగం చాలా ప్రాచుర్యం పొందిన విభాగం . ఇది వర్డుప్రెస్సు  లో ఉండేది. దీనికి వచ్చే వీక్షకులు 90% గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేవారు . హోస్టింగ్ ముగిసే నాటికి దానిలో దాదాపు 40,000 టపాలు , కామెంట్లు పోస్టులుగా ఉన్నాయి . దాని డేటాబేస్ బ్లాగర్ లోకి మార్చడం చాలా కష్టం ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఉంది . అయితే అదే రూపుతో ఇప్పుడు ఎంపికచేసిన మంచి/ ఎక్కువగా  వీక్షించిన టపాలతో  ఒక విభాగాన్ని ఎంపికచేసిన బ్లాగు టపాలు పేరుతొ మీముందు ఉంచుతున్నాను . 
ఇది నూతన బ్లాగిల్లు తరపున మొట్టమొదటి విభాగం . 
ఇక తదుపరి ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగంతో పాటూ అసలైన ముంగిలి విభాగం మీ ముందుకు వస్తాయి . 
ఇవి కలకాలం జీవించి ఉండాలని ఆశీర్వదించండి . 
మరి  ఎంపికచేసిన బ్లాగు టపాలు విభాగాన్ని చూసి మీ కామంట్లు వ్రాయండి !
                                               ఇక్కడి నుండి వీక్షించండి 

ఉంటానూ ... మళ్ళీ  కలుద్దాం ! 
 

"బ్లాగిల్లు" హోస్టింగ్ ముగిసింది... ఇక బ్లాగర్ పైనే

గత మూడు సంవత్సరాలనుండి బ్లాగిల్లును ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. బ్లాగిల్లు తరపున ఇప్పటివరకూ మీకోసం ఎన్నో ప్రయోగాలు చేసాను. దాదాపు అన్నీ విజయవంతం అయ్యాయి. "బ్లాగిల్లు అంటే కేవలం తెలుగు బ్లాగుల సంకలిని మాత్రమే  కాదు .. ఇది తెలుగు బ్లాగుల ఇల్లు " అనిపించుకొనే దిశగానే అన్ని ప్రయోగాలూ సాగాయి. బ్లాగిల్లు మొదలుపెట్టేనాటికి తెలుగులో నాలుగు సంకలినులు ఉండేవి . వాటిలో సమూహము కొద్దికాలానికే మూతపడగా , సంకలిని ఆ తర్వాత ఆగిపోయింది . చివరిగా అందరి ఆదరణ పొందిన హారం తెగిపోయింది . ప్రస్తుతం మిగిలి ఉన్న ఆగ్రిగేటర్ లు - కూడలి, మాలిక, జల్లెడ , బ్లాగిల్లు . ఇవికాక కొంతమంది ఔత్సాహికులైన బ్లాగర్లు బ్లాగర్ ద్వారా బ్లాగ్ లిస్టు విడ్జెట్ లో తెలుగు బ్లాగులను కలిపి సంకలినులుగా సేవలు అందిస్తున్నారు. పూదండ , బ్లాగ్ వేదిక , బ్లాగు ప్రపంచం వాటిలో కొన్ని.
బ్లాగిల్లు కొద్ది కాలం క్రితం బ్లాగర్ లోనూ తన సేవలను ప్రారంభించింది . blogillu .com లో ఏవైతే విభాగాలు , శీర్షికలు ఉన్నాయో అవే శీర్షికలు blogillu.blogspot.com లో వచ్చేలా వీలయితే మరిన్ని విభిన్నతలు ఉండేలా చర్యలు తీసుకున్నాను. వీటిలో ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఒకటి . ప్రస్తుతం blogillu.com తో సమానంగా blogillu.blogspot.com వీక్షకులను పొందుతూ ఉంది . అయినప్పటికీ ఏదో వెలితి! blogillu.comను మూసివేయాలా
వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోడానికి ఇబ్బంది. ఈరోజే బ్లాగిల్లు యొక్క హోస్టింగ్ కాలపరిమితి పూర్తయింది.  మళ్ళీ కాలపరిమితిని పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదు . కనుక ఇకపై బ్లాగిల్లు ( blogillu.com )
మాత్రమె నా అందుబాటులో ఉంది . దాని కాలపరిమితి మరో పదిహేను రోజుల్లో ముగియనుంది .
ప్రస్తుతం ఉన్న సందేహం blogillu .com డొమైన్ ను ఉంచాలా వద్దా అనేది. ఏమైనా వీక్షకులకు blogillu .com టైపు చేయడంలోని సౌలభ్యం blogillu .blogspot.com లో ఉంటుందా అనేది ప్రశ్నార్ధకం ?!
అందుకే ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసి బ్లాగిల్లు యొక్క ప్రస్తుత హోస్టింగ్ కు మాత్రం బై బై చెప్పేస్తున్నా ..
ఒకటి మాత్రం నిజం భవిష్యత్ లో బ్లాగర్ పైన ప్రయోగాలు చేసినా అవికూడా మా ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నాను.
మా సలహాలు సూచనలు ఎప్పటిలాగే కావాలి
 


కామెంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి

      కొద్ది రోజుల క్రితం అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014  అనే పేరుతో ఒక టపా వ్రాసాను . ప్రపంచవ్యాప్తంగా బ్లాగులు అంతలా  వృద్ది చెందుతుంటే తెలుగులో బ్లాగులు ఆదరణ కోల్పోతున్నాయా ?
     ఈ విషయం ఈ మధ్య చాలా మంది బ్లాగర్ల మాటల్లో తెలుస్తూ ఉంది . ఆ మధ్య భరద్వాజ్ వెలమకన్నిగారు " I think the Telugu blogs are almost dead now. Jai Facebook :) " అన్నా మరొకరు నేను బ్లాగింగ్ మానేసి గూగుల్ ప్లస్ వాడుతున్నాను అన్నా బ్లాగులపై వారి నిర్లిప్తత అర్ధమవుతూ ఉంది . నిజమే ఒకప్పుడు ఓ వేలుగువేలిగిన బ్లాగులు ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయాయి ?
    శర్మగారైతే తన బ్లాగు చౌర్యానికి గురి అవుతున్నదని బ్లాగింగే మానుకోదలచుకున్నారు .  శ్యామలీయంగారు  బ్లాగర్లను సంఘటితం చేయడానికి ఓ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నారు . ఆయన చొరవకు అభినందనలు తెలపాలి . అయితే దీనికి కామంట్ల రూపంలో అంగీకారం తెలిపింది ఎందరు ? మహా అయితే ముగ్గురు . ఒకరైతే ఆయన్ను విమర్శ  కూడా చేసారు . ఇది మంచి పరిణామమా ?
నాకు తెలిసి శ్యామలీయం గారి టపాను 200 మందికి పైగా చదివి ఉంటారని అనుకుంటున్నాను . మరి ఎందుకు స్పందనలు కరువవుతున్నాయి ?
      ఒక్క ఆ టపానే కాదు తెలుగు బ్లాగు లోకంలోని ఎన్నో టపాలు కనీసం 100 కు తగ్గని వీక్షకులను పొందుతున్నాయి కానీ ఎంతో మంచి .టపాలకు కూడా మహా అయితే ఓ పది వ్యాఖ్యలు మాత్రం వస్తున్నాయి. సాయికుమార్ గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు .
      అందుకే వీక్షకుల్లారా మీరు టపా చదివి కనీసం బాగుంది అని సింపుల్ గా ఓ కామెంట్ పెట్టండి. అదే బ్లాగర్ కు ఇంధనం. ఎందుకంటే మిగతా భాషల్లో ( ముఖ్యంగా ఇంగ్లీష్ బ్లాగులు ) మన బ్లాగులు కాసులు కురిపించవు . గూగుల్ ఏడ్ సెన్స్ ( google adsense ) తెలుగు భాషను అనుమతించదు .
ప్రస్తుతం అత్యధికంగా వ్యాఖ్యాతలు దాదాపు ఓ వంద మంది ఉన్నారు . వారిలో రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు చేసేవారే అధికం .
     ఇక బ్లాగిల్లు సంగతి - వ్యాఖ్యలకు ప్రత్యెక విభాగం ఎప్పుడూ ఉంది . ప్రతీరోజూ అత్యధిక వ్యాఖ్యలు చేసే వారి పేర్లు , అత్యధిక వ్యాఖ్యలు పొందే బ్లాగుల లిస్టు ఎప్పట్నుంచో  ఉంది .
     నిన్న నేను ఓ వ్యాఖ్య వ్రాసి సగంలో ఆపానని శర్మగారు దానిపై ఏంతో మంచి విషయాలతో కూడిన టపా వ్రాసారు .నేను నిన్న వ్యాఖ్య వ్రాస్తూ మధ్యలో అనుకోకుండా ప్రచురించు నొక్కాను . నేను ఎందుకు సగంలో ఆపానో అనుకున్న శర్మగారు విషయాన్ని ఎంతో చక్కగా వర్ణించారు . ఆయన జీవన అనుభవాన్ని మనం కామెంట్ల రూపంలో ఏదోరకంగా టపాలద్వారా బయట పెట్టించవచ్చు అనే విషయం బోధపడింది . ఇదే విషయం జిలేబిగారు చెప్పారు .
      ఆయనే కాదు టపాలు వ్రాసే ప్రతీ బ్లాగర్ కోరుకునేది ప్రశంసలు . వాటిని కామెంట్ల రూపంలో మనం ఇస్తే వారు మరింత ఉత్సాహంతో రచనలు చేస్తారు . మరిన్ని మంచి టపాలు వస్తే తెలుగు బ్లాగులు వృద్ది చెంది ప్రభుత్వం బ్లాగులను అధికార మాధ్యమంగా గుర్తించే  రోజులు వస్తాయి . అప్పుడు బ్లాగుల్లో వ్రాసే టపాలకూ గుర్తింపు , గౌరవం వచ్చి పత్రికలలోని రాతలను మరో పత్రిక ఎలా కాపీ కొట్టలేదో బ్లాగుల్లో కూడా టపాల  దొంగతనాలు ఆగుతాయి .
ఒక్క టపాలు మాత్రమె కాదు అనేక విషయాల్లో వేరే బ్లాగులాగే ఉండాలని కోరుకోవడం ఎందుకు ? మనకంటూ ఓ ప్రత్యేకత ఉండొద్దా ? అది సాధిద్దాం !
     అందుకే వ్యాఖ్యతలారా విరుచుకుపడండి .. మరిన్ని మంచి టపాలు వచ్చేలా రచయితలను ప్రోత్సహించండి
జై తెలుగు బ్లాగులు .. !!

అత్యధిక తెలుగు బ్లాగుల సంకలినిగా "బ్లాగిల్లు"

ఈరోజు బ్లాగిల్లు లోని వివిధ బ్లాగుల ఫీడ్స్ ఆధునీకరించబడ్డాయి . దాదాపు 60-70 బ్లాగులు మూసివేయబడడమో లేక సామాన్యవీక్షకులకు అనుమతి నిరాకరించడమో చేయబడినవి . అవి అన్నీ తొలగించిన పిమ్మట బ్లాగిల్లు లో ఇప్పటివరకూ కలుపబడిన తెలుగు బ్లాగులసంఖ్య 3213 గా లెక్క తేలింది . వీటిని వివిధ విభాగాల్లో నిక్షిప్తం చేయడం జరిగింది .
సరే కదా పనిలో పని అని 'కూడలి'లో వివిధ జాబితాల్లో ఉన్న బ్లాగులను కూడా లెక్కించాను . అవి మొత్తం 33 జాబితాల్లో 3096 గా తేలింది . కాకపొతే వాటిల్లో పనిచేయని బ్లాగులు చాలా ఉన్నట్లు ఖచ్చితంగా గమనించాను.
అలాగే జల్లెడ జాబితా  కూడా చూసాను. అక్కడ 114 లిస్టులలో 2840 బ్లాగులు ఉన్నాయి. వాటిలో కూడా పనిచేయని బ్లాగులు చాలానే  ఉన్నాయి.
మాలికలో ఎలాగూ వీటికంటే తక్కువే ఉంటాయని దానిలో టపాలు చూస్తె తెలుస్తుంది .
దీన్ని బట్టి అర్ధమైంది ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న నాలుగు సంకలినులలొ బ్లాగిల్లు లో అత్యధిక బ్లాగులు ఉన్నాయని. కాకపోతే దానికి ఋజూవు చూపాలికదా ! అందుకే అతి త్వరలో కూడలి, జల్లెడల లాగ లిస్ట్ ప్రచురిస్తాను.



దీపావళి శుభాకాంక్షలతో "బ్లాగిల్లు" త్వరలో అందించబోతున్న శీర్షికలు..



ముందుగా బ్లాగిల్లు శ్రేయోభిలాషులకు, బ్లాగర్లకు దీపావళి శుభాకాంక్షలు.
తెలుగు బ్లాగుల ప్రయోగ వేదిక బ్లాగిల్లు మీకోసం త్వరలో కొన్ని శీర్షికలు, విభాగాలతోపాటూ మరికొన్ని ప్రయోగాలు చేయబోతున్నది.
అవేంటో సూచాయగా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను...
> బ్లాగు సంచిక : ప్రతీనెలా ఉత్తమ బ్లాగుటపాలతో కూడిన ఈ-పత్రిక.
> ఉత్తమ బ్లాగుల పోటీ: తెలుగులోని ఉత్తమ బ్లాగులను ఎంచి ( వివిధ విధానాల ద్వారా) వాటికి బహుమతులివ్వడం. ( బహుమతుల స్పాన్సర్ షిప్ కోసం వాణిజ్య సంస్థలను సంప్రదించే పనిలో ఉంది బ్లాగిల్లు)
> పై పోటీద్వారా ఎన్నిక చేసిన ఉత్తమ 50 బ్లాగులకు ప్రతేక ఆగ్రిగేటర్ విభాగం...
..ఇవి మచ్చుకి కొన్ని ...!!!
మా అశలు, ఆకాంక్షలు, ప్రయత్నాలు సత్పలితాలను ఇవ్వాలని మీరు ఆశీర్వదించాలని కోరుతూ...
సెలవ్

"బ్లాగిల్లు"కు రెండేళ్ళు... మీ ఆశీస్సులు కోరుతూ...

            అక్టోబర్ 24, 2011 న ప్రారంభమైన "బ్లాగిల్లు" రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్బంలో బ్లాగిల్లులోని వివిధ విభాగాలపై మీ అభిప్రాయాలను కోరుతున్నాం.
           గడచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు ఎదుర్కొంది "బ్లాగిల్లు". ఐనా నిబ్బరంతో వాటన్నింటినీ ఎదుర్కొని, ఇంకా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం బ్లాగిల్లులో దాదాపు 4000 బ్లాగులు, వెబ్ సైటులు వివిధ విభాగాల్లో కలుపబడి ఉన్నాయి. తెలుగు బ్లాగర్లకు మిగతా భాషల్లో ఉన్న ఆగ్రిగేటర్లకు తీసిపోని సదుపాయాలు అందించాలన్నదే బ్లాగిల్లు తరపున మా తపన. ఇప్పటికే బ్లాగిల్లులో దాదాపు 10 విభాగాలు ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నవిభాగాలు ప్రతీ బ్లాగర్ కూ, ప్రతీ వీక్షకునికీ ఉపయోగకరంగా ఉండడానికి రూపొందించినవే.
           బ్లాగిల్లు ఒక నిరంతర ప్రయోగశాల! అవును... ప్రపంచంలోని ఎన్నో భాషలలోని బ్లాగు ఆగ్రిగేటర్లు, డైరెక్టర్లను నిరంతరం గమనిస్తూ వాటిలోని విభిన్నత్వాలను మనకు అన్వయించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది మీ బ్లాగిల్లు.
           తెలుగులో ఉన్న ఆగ్రిగేటర్లు అన్నీ బ్లాగర్లకు వివిధ సేవలు అందించేవే ! కూడలి, జల్లెడ, హారం, మాలిక ఇంకా మరికొన్ని తెలుగు బ్లాగర్లకు తాజా బ్లాగుటపాలను, కామెంట్లు  అందించే విషయంలో ఎంతో సేవచేస్తున్నాయి. ఒక ఆగ్రిగేటర్ గా తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నాయి. బ్లాగిల్లు కూడా అలాగే చేస్తూ మరింత విభిన్నంగా ఉండాలని కోరుకుంటుంది. తన అన్ని విభాగాలూ మరింత శక్తివంతంగా ఉండాలని బ్లాగర్లకు ఉపయోగపడాలని ఆశిస్తుంది.
           మిమ్మల్ని ఎల్లప్పుడూ కోరేది ఒక్కటే "బ్లాగిల్లు" ను అభిమానించండి , బ్లాగిల్లు అభివృద్దిని కోరుకోండి... దీనిలోని మంచిని, చెడును ఎత్తి చూపండి. బ్లాగిల్లు పై మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను ఈ పోస్టులో కామెంట్లద్వారా తెలుపండి... 
hit counter