నూతన 'బ్లాగిల్లు' లో మట్టమొదటి విభాగం ప్రారంభం


ముందుగా తెలుగు బ్లాగర్లు , బ్లాగిల్లు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
బ్లాగిల్లు హోస్టింగ్ కాలపరిమితి ముగిసాక ఇక blogillu .com ను బ్లాగర్ లో కొనసాగించాలని నిర్ణయించాను .
ఇంతకూ ముందు ఉండిన బ్లాగిల్లులో సంకలిని (/blogs ) అనే విభాగం చాలా ప్రాచుర్యం పొందిన విభాగం . ఇది వర్డుప్రెస్సు  లో ఉండేది. దీనికి వచ్చే వీక్షకులు 90% గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేవారు . హోస్టింగ్ ముగిసే నాటికి దానిలో దాదాపు 40,000 టపాలు , కామెంట్లు పోస్టులుగా ఉన్నాయి . దాని డేటాబేస్ బ్లాగర్ లోకి మార్చడం చాలా కష్టం ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఉంది . అయితే అదే రూపుతో ఇప్పుడు ఎంపికచేసిన మంచి/ ఎక్కువగా  వీక్షించిన టపాలతో  ఒక విభాగాన్ని ఎంపికచేసిన బ్లాగు టపాలు పేరుతొ మీముందు ఉంచుతున్నాను . 
ఇది నూతన బ్లాగిల్లు తరపున మొట్టమొదటి విభాగం . 
ఇక తదుపరి ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగంతో పాటూ అసలైన ముంగిలి విభాగం మీ ముందుకు వస్తాయి . 
ఇవి కలకాలం జీవించి ఉండాలని ఆశీర్వదించండి . 
మరి  ఎంపికచేసిన బ్లాగు టపాలు విభాగాన్ని చూసి మీ కామంట్లు వ్రాయండి !
                                               ఇక్కడి నుండి వీక్షించండి 

ఉంటానూ ... మళ్ళీ  కలుద్దాం ! 
 

7 comments:

  1. శ్రీనివాస్ గారు,
    నమస్తే.
    మీరు బ్లాగిల్లులో మార్పులేవో చేస్తున్నట్టుగా ఉంది కాని మా లాటి సామాన్యులకు ఏదో గడబిడగానే ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన ఆగ్రిగేటర్ బాగుంది. కొత్తది ఇచ్చారు, అదీ సౌకర్యం గానే ఉంది. ఇప్పుడు మరొకటి ఇస్తున్నామన్నారు. అది మళ్ళీ మొదలుకొచ్చేసింది. బ్లాగులు వరసగా ఒక పేజిలో కనపడటం లేదు. మీ ఇబ్బందేమీటో నాకు తెలియదు కదా! బ్లాగిల్లు బాగుండాలని కోరుకునేవారిలో నేను మొదటివాడిగా ఉండాలనే తపనతో రాసినదే ఇది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి.

    ReplyDelete
  2. సర్ , మీరేమీ కంగారు పడకండి మీరు కోరిన బ్లాగిల్లు వస్తూంది . వేచి ఉండండి
    ఇవన్నీ extra features మాత్రమె

    ReplyDelete
  3. శ్రీనివాస్ గారు ! ఈ విభాగము చూసాను . ఇది ఎందుకో అర్ధం కాలేదు. త్వరలో మార్పులు తెస్తారని ఆసిస్తో

    ReplyDelete
  4. anonymous గార్కి . ఈ విభాగం గూగుల్ సెర్చ్ కొరకు డిజైన్ చేయబడినది . తెలుగులో ఏదైనా పదం గూగుల్ లో సెర్చ్ చేస్తే ఇప్పటికీ మొదటి పది ఫలితాల్లో బ్లాగిల్లు వస్తుంది . అదే కొనసాగించాలంటే ఈ విభాగం ఉండాలని ఈ బ్లాగు ద్వారా మిగతా బ్లాగులకు వీక్షకులు వెళ్ళాలని ఉద్దేశ్యంతో మొదలెట్టినది .

    ReplyDelete
  5. సర్, మంచి ఉపయోగకరమైన సమాచారంతో రూపుదిద్దుకుంటున్న బ్లాగులు, బ్లాగర్లకు సరైన సాంకేతిక పరిగ్నానం లేకపోవడంతో గూగుల్ సెర్చ్లలో వెనుకబడుతున్నాయి. వీలైతే మరో విభాగం ప్రారంభించండి. సమాచారం కోసం వెదికే వారికి ఆయా సమాచారం అందించేలా గూగుల్ సెర్చ్లో ముందు వరుసలో నిలబడడానికి అవసరం అయిన సాంకేతిక పరిగ్నానాన్ని అందించే ప్రయత్నం ఆ విభాగంలో ఉంచాలని ఆశిస్తూ
    మీ
    చైతన్య కుమార్

    ReplyDelete
    Replies
    1. చైతన్య కుమార్ గారూ ! మీ సలహా బాగుంది తప్పకుండా పాటిస్తాను

      Delete

hit counter