ప్రారంభమైన "శోధిని" వ్యాఖ్యల విభాగం - తీసుకువచ్చిన మార్పులు

పదిరోజుల క్రితం "అనామకుల కామెంట్లలో తిట్లకు బాధ్యులు ఎవరు?" టపా ద్వారా ఓ చర్చ పెట్టడం జరిగింది. అయితే అప్పటికి చాలా కాలం క్రితమే కూడలి బ్లాగులో వచ్చిన అభిప్రాయ సేకరణ: కూడలిలో కెలుకుడు బ్లాగులని ఉంచాలా? అనే టపాను నేను చదవలేదు. ఆ తర్వాత చదవడం జరిగింది. దానికి లింకుగా బ్లాగరుల ప్రవర్తనా నియమావళి అనే ఒక టపా కూడా ఉంది. రెండు సార్లు ఉత్తమ బ్లాగర్ అవార్డు పొందిన శోధన సుధాకర్ వ్రాసిన ఈ పోస్టు ప్రస్తుత బ్లాగర్లందరూ ఒకసారి చదివితే మంచిదని నా అభిప్రాయం. 
ఆ పోస్టులోని కొన్ని అంశాలు మీకోసం  - 


మనం వాడిన భాషకు, పదాలకు మరియు మనం అనుమతించిన వ్యాఖ్యలకు మనదే పూర్తి భాధ్యత. మనం నాగరికతతో కూడన విషయాన్ని ప్రోత్సహించుతాం . అనాగరిక విషయాలు మన బ్లాగులో చోటు చేసుకుంటే, వ్యాఖ్యలలో వుంటే వాటిని తీసి వెయ్యటం మన భాధ్యత .
అందులో అనాగరిక విషయాలు ఏమిటో కూడా వివరంచారు.

అలాగే క్రింది అంశాలు కూడా అందులో ఉన్నాయి ...

వ్యాఖ్యలను చేసేవారు తప్పని సరిగా తమ ఈ-మెయిల్ చిరునామా, తమ అసలు పేరు గానీ, మారు పేరు గానీ వుపయోగించేలా చూసుకోవాలి.
# వ్యాఖ్యల దాడి చేసే వారిని మనం పట్టించుకోకూడదు.
వ్యాఖ్యల దాడిని పట్టించుకోకూడదు. అవి మరీ అభ్యంతరం, వ్యక్తిగతం అయితే తప్ప. వ్యాఖ్యల ద్వారా దాడి చేసే వారితో ప్రతి వ్యాఖ్యానం మొదలు పెట్టడం పందితో మల్లయుద్ధం చెయ్యటమే అవుతుంది. ఆ యుద్ధంలో ఇద్దరికీ బురద అంటుకుంటుంది. పందికి బురద ఇష్టం, మీకు అయిష్టం. అది గుర్తుపెట్టుకోండి.
తెలుగు బ్లాగర్లు దాదాపు బ్లాగర్ , వర్డుప్రెస్సు ఉపయోగిస్తారు. ఇవి కూడా బ్లాగర్లకు కొన్ని నియమాలను రూపొందించి అందిస్తున్నాయి.

బ్లాగర్ నియమావళి : https://www.blogger.com/content.g
వర్డుప్రెస్సు నియమావళి: https://en.wordpress.com/tos/

వాటిలో కూడా అసభ్య ప్రవర్తనకు పూర్తిగా ఆ బ్లాగరునే బాధ్యులుగా చేశాయి. ఇన్ని ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా మరో నియమావళి అంతగా అవసరం లేదేమో ... !?

శోధిని క్రొత్త వ్యాఖ్యల విభాగంలో తీసుకువచ్చిన మార్పులు. 

  •  అనామక/అజ్ఞాత  కామెంట్లు నిరోధించడం. 
  • అత్యధిక వేగంగా వ్యాఖ్యలను సేకరించడం
  • వ్యాఖ్యల డేటా శోధినిలో స్టోర్ కాకుండా చూడడం. 
  • సరిక్రొత్త రెండు కాలమ్స్ రూపం 
  • మొబైల్ లో కూడా సౌకర్యవంతమైన వీక్షణ

 ఈ విభాగాన్ని ఇక్కడి నుండి చూడొచ్చు



  ఈ క్రొత్త రూపు మీకు నచ్చుతుందని ఆశిస్తూ ...

4 comments:

  1. వ్యాఖ్యల విభాగం చూడడానికి ఇంపుగా ఉంది.
    "శంకరాభరణం" బ్లాగ్ వ్యాఖ్యలకు "ప్రత్యేక హోదా" కల్పించి వేరే పేజ్ కేటాయించినట్లున్నారు అనిపించింది నిన్న. వ్యాఖ్యల విభాగంలో క్రింద కూడా అలాగే వ్రాసారు. కానీ ఈ రోజు ఆ బ్లాగ్ వ్యాఖ్యలు మెయిన్ లోనే కనిపిస్తున్నాయే?

    ReplyDelete


  2. శోధిని ! కమింట్ల పేజీ
    రాధనమై వెలసెనోయి రాజిలు బ్లాగుల్ !
    కాధా జేర్చితి మోయీ
    నాధ మనానిమసులకట నప్పుచు వేయన్ :)

    జిలేబి

    ReplyDelete


  3. లింకుల యోధుడు యూజీ
    లంకెలు ఫేస్బుక్కులోన లభ్యము గానన్
    చెంగున దూకుచు బట్టుకొ
    నంగట చెంగట కుదుర్చు నమ్మ జిలేబీ :)

    జిలేబి

    ReplyDelete
  4. I 'm interested in those 100 proofs though :)

    ReplyDelete

hit counter