మరో నెలరోజుల్లో (సెప్టెంబర్ 30) యాహూ పైప్స్ మూతపడబోతున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది . దానితో ఈ స్క్రిప్ట్ పై పనిచేస్తున్న బ్లాగిల్లు కూడా ఆగిపొనుంది . ఇప్పటికే అది అప్పుడప్పుడూ ఆగిపొతూనే ఉంది. బ్లాగిల్లులో ఇప్పటికే కలుపబడి ఉన్న దాదాపు 3400 బ్లాగులు , అనుమతి కోసం వేచిఉన్న దాదాపు 50 వరకు బ్లాగులు ఇవన్నింటిని కలిపి ఆగ్రిగేటర్ తయారు చేయాలి . క్రొత్తగా తయారు చేయబోయే సంకలిని దాదాపు 5000 బ్లాగులను నిరంతరాయంగా జల్లించే సామర్ధ్యం కలిగి ఉండాలి . ఇలా చేయాలంటే చాలా శ్రమ మరియు ఖర్చుతో కూడిన పని .అయినప్పటికీ తెలుగు బ్లాగుల అభివృద్ధి కోసం నడుం బిగించిన నేను ఏదో విధంగా ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాను . అయితే ప్రస్తుతం ఉన్న కూడలి , మాలిక సమర్ధవంతంగా తమ ఆగ్రిగేషన్ చేస్తున్నాయి . అందుకే ఒక క్రొత్త ఆలోచనతో ముందుకు వెళదామని నిర్ణయించుకున్నాను .
చాలామంది ఇండీబ్లాగర్ చూసే ఉంటారు .. అది ఒక ఆగ్రిగేటర్ అని బ్రమపడే వారూ ఉండే ఉంటారు . కానీ ఇండీబ్లాగర్ ఒక బుక్ మార్కింగ్ సైట్ . ఇది ఎలా పనిచేస్తుందంటే దీనిలోని సభ్యులు వారు తమ బ్లాగుల్లో చేసిన టపా యొక్క లింకును ఇండీబ్లాగర్ కు కలుపుతారు . ఇది తమకు ఇష్టమైన టపాకే చెయ్యవచ్చు . ఇలా సభ్యులచే కలిపిన టపాలు మాత్రమే ఇండీబ్లాగర్ లో చూపబడుతాయి . ఇందులోని బ్లాగులకు ర్యాంకింగ్ కూడా ఉంటుంది. దానిలాగానే బ్లాగిల్లును కూడా ఒక బుక్ మార్కింగ్ సైట్ లా మారుద్దామని ఆలోచన .ఈ ఆలోచనతో క్రొత్త వెబ్సైట్ రూపుదిద్దు కుంటున్నది . బహుశా వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 17 న ఈ నూతన బ్లాగిల్లు మీముందుకు రావచ్చు .
ఇప్పడు ఉన్న మిగతా విభాగాలు కూడా మారే అవకాశం ఉంది .
సాద్యమైనన్ని ఎక్కువ ఫీచర్స్ తో సరిక్రొత్త వర్షన్ తీసుకురావాలని తపన. దీనికి మీ సలహాలు కూడా పంపగలరు . వీలుంటే పరిశీలిస్తాను .
చాలామంది ఇండీబ్లాగర్ చూసే ఉంటారు .. అది ఒక ఆగ్రిగేటర్ అని బ్రమపడే వారూ ఉండే ఉంటారు . కానీ ఇండీబ్లాగర్ ఒక బుక్ మార్కింగ్ సైట్ . ఇది ఎలా పనిచేస్తుందంటే దీనిలోని సభ్యులు వారు తమ బ్లాగుల్లో చేసిన టపా యొక్క లింకును ఇండీబ్లాగర్ కు కలుపుతారు . ఇది తమకు ఇష్టమైన టపాకే చెయ్యవచ్చు . ఇలా సభ్యులచే కలిపిన టపాలు మాత్రమే ఇండీబ్లాగర్ లో చూపబడుతాయి . ఇందులోని బ్లాగులకు ర్యాంకింగ్ కూడా ఉంటుంది. దానిలాగానే బ్లాగిల్లును కూడా ఒక బుక్ మార్కింగ్ సైట్ లా మారుద్దామని ఆలోచన .ఈ ఆలోచనతో క్రొత్త వెబ్సైట్ రూపుదిద్దు కుంటున్నది . బహుశా వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 17 న ఈ నూతన బ్లాగిల్లు మీముందుకు రావచ్చు .
ఇప్పడు ఉన్న మిగతా విభాగాలు కూడా మారే అవకాశం ఉంది .
సాద్యమైనన్ని ఎక్కువ ఫీచర్స్ తో సరిక్రొత్త వర్షన్ తీసుకురావాలని తపన. దీనికి మీ సలహాలు కూడా పంపగలరు . వీలుంటే పరిశీలిస్తాను .
- కామెంట్ల విభాగం ఉండక పోవచ్చు .
- ర్యాంకింగ్ లో క్రొత్త విధానం
•కామెంట్ల విభాగం ఉండక పోవచ్చు .
ReplyDeleteహన్నా ! ఆ ఒక్కటి మాత్రం చెయ్య మాకండి ! మీరు టపాలు అగ్రిగేటర్ లో చూపించ క పోయినా ఫర్లేదు గాని కామింటులు మాత్రం 'దండి' గా కనబడాలి :)
జిలేబి కి ఎట్లా టైం పాస్ అయ్యేదండీ :)
జిలేబి
జిలేబి గారూ ! మీ సలహా తప్పక పాటించడానికి కృషిచేస్తున్నాను .
Deleteప్రస్తుతం "ప్రచార సాధనాలు" మొత్తం వ్యాపారమయం అయిపోయినా మన తెలుగు సంకలినులు మాత్రం వాటికి అతీతంగా ఉన్నాయి . వాటి "మనుగడ" మీలాంటి వారి అభిమానం పైనే ఆధారపడి ఉంది . వీక్షకుల సంఖ్య లేకపోతె బ్లాగిల్లును ఎప్పుడో మూసేసే వాడ్ని.
నూతనంగా బ్లాగిల్లు క్రొత్త రూపుతో ప్రారంభించబోతున్నందుకు ధన్యవాదములు. మీ బ్లాగిల్లు మునుపటికంటే ఉన్నతస్తానానికి ఎదగాలని, బ్లాగుల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచడంలో బ్లాగిల్లు నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ReplyDeleteనూతన బ్లాగిల్లు ఇలా ఉంటే బావుంటుందని నా అభిప్రాయం
- బ్లాగు యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిశీలించి దాని ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం (మీరూ గతంలో ప్రారంభించిన నిలిపివేసిన బ్లాగిల్లు క్రొత్త ర్యాంకుల విధానం వంటిది) అవసరం. దాని ఆధారంగా మా బ్లాగులను మరింత మెరుగు పరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది.
- బ్లాగులు గూగుల్ ఇతర సాధనాలలో ముందు వరుసలో నిలవడానికి అవసరం అయిన ఎస్‌ఈఓ టెక్నిక్స్‌తో కూడిన వీడియోలు, టెక్స్‌్ట రూపంలో సమాచారం ఉండాలి.
- బ్లాగులన్నింటినీ ఏకమొత్తంగా కాక కనీసం ఒక ఐదు విభాగాలుగా విభజించి ర్యాంకింగ్ ఇస్తే బావుంటుంది.
- పై పాయింట్ల ఆధారిత ర్యాంకింగ్ పదిహేను రోజులకు ఒకసారి అదికూడా పాయింట్లు అతి కొద్ది మార్పులతోనే ఉంటున్నాయి.
- కనుక దానితో పాటుగా నిత్యం మారే విధంగా, ఆ రోజు బ్లాగు విజిటర్స్ సంఖ్య ఆధారంగా మరొక ర్యాంకింగ్ ఉంటే బావుంటుంది. ఇది మేము క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉపయోగకరమైన పోస్టులు మా బ్లాగులో అప్‌డేట్ చేసేలా ప్రేరణ అందిస్తుంది.
- అలాగే ఉదయాన్నే ఈ రోజు మన బ్లాగు ఏ స్థానంలో ఉందో చూసుకోవాలన్న ఆసక్తి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది తప్పక ఉంటే బావుంటుంది.
- అగ్రిగేటర్లో గతంలో మాదిరిగా విభాగాల మాదిరి ఉంటే బావుంటుంది.
- కామెంట్లు విభాగం ఉంటేనే బావుంటుంది అని నా అభిప్రాయం.
- అన్నింటినీ మించి తెలుగు బ్లాగుల నిర్వాహకులు అందరినీ ఒక వేదికపైకి తెచ్చేలా, స్నేహపూర్వక పోటీ పెంచేలా బ్లాగిల్లు ఉంటే బావుంటుంది అని నా అభిప్రాయం
మీ
చైతన్యకుమార్ సత్యవాడ
నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగు,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ 9441687174
చైతన్య కుమార్ గార్కి!
Deleteబ్లాగిల్లుపై మీకుగల అభిమానానికి ప్రత్యెక కృతజ్ఞతలు .
మీరు ఇచ్చిన సలహాలు తప్పకుండా ప్రయత్నిస్తాను
ఒక బ్లాగు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా నిర్ధారిస్తారు ? వీక్షకులను బట్టి అయితే మొన్న ఒకరు వీర్యం,సెక్స్ అన్న పదాలు ఉపయోగించినందుకు 6000 వేల మంది వీక్షించారు. కమెంట్స్ ని బట్టి అయితే నాలాంటి వారు ప్రవీణ్ లాంటి వారు ఇద్దరు ఉంటే చాలు 100 దాటించేస్తాం. కంటెంట్ ని బట్టి అయితే శాస్తవిజ్ఞానం బ్లాగు ఎంత మంది చదువుతారు ? ప్రతి నెల లేదా ప్రతి వారం "ఉత్తమ టపా" ని బ్లాగర్లే ఎంపికచేసే సౌకర్యం ఉంటే అగ్రిగ్రేటర్లకీ బ్లాగర్లకీ మంచిదని నా అభిప్రాయం. ఉత్తమ టపా అంటే పై మూడూ కాకుండా విలువలు తెలియచేసి తెలుగుకి ప్రాధాన్యం ఇచ్చేదిలా ఉంటే బాగుంటుంది. అందుకోసం కొంతమంది బ్లాగర్లను ఎన్నుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బ్లాగర్ల మధ్య రచనల విషయం లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. పోటీ లేనిదే ఏ రంగంలోనూ రాణించడం కష్టం.
ReplyDeleteనీహారిక గారూ! మీ సూచన అద్భుతంగా ఉంది . ప్రతీ బ్లాగర్ నుంచీ వారి బ్లాగులోని ఒక టపాను ఆహ్వానించి వచ్చిన వాటిల్లో ఉత్తమ టపాను విభాగాల వారీ ఎంపిక చేస్తే బాగుంటుందని నా ఆలోచన . ఇది " ఉత్తమ బ్లాగు టపాల పోటీ" గా నిర్వహించాలి .
Deleteసంకలినిలో నమోదు చేసుకున్న అన్ని బ్లాగులను అక్షరక్రమంలో చూడటానికి వీలుగా ఒక విభాగం ఏర్పాటు చెయ్యండి. ప్రతి బ్లాగు పక్కన, ఆ బ్లాగు ఎప్పుడు మొదలుపెట్టారు, ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది, ఆ బ్లాగులో లేటెస్టుగా వ్రాసిన వ్యాసం తేదీ కనపడాలి. తరచూ వ్రాయని బ్లాగులను కూడా మనం చూసే అవకాశం దీనివల్ల ఉన్నది. వ్యాసం వ్రాసినప్పుడు, కనపడటానికి అన్ని సంకలినులులోలాగా ఒక విభాగం ఎలాగో ఉంచుతారు కదా. ఒక్కొక్క వ్యాసం కనీసం ఒకరోజు కనపడేట్టుగా ఏర్పరచగలిగితే బాగుంటుంది. ఒక వ్యాసం వ్రాసి ప్రచురించిన తరువాత, ఒక ఇరవై వ్యాసాలూ ప్రచురణ అయితే, మొదట వ్రాసిన వ్యాసం కిందికి వెళ్ళిపోవటం, అసలు కనపడకుండా పోవటం జరగటం వల్ల, ఎప్పుడన్నా వ్రాసే వాళ్ళ వ్యాసాలూ మిస్ అవుతున్నాము.
ReplyDeleteశివరామ ప్రసాద్ గారూ! మీ ఆలోచనకు దగ్గరగా ఉన్న ర్యాంక్ విభాగాన్ని ( ex: http://rank.blogillu.com/2015/03/blog-post.html ) అతి త్వరలో ఆధునీకరించి బ్లాగుల లిస్టు వచ్చే ఏర్పాటు చేస్తాను. సూచనకు ధన్యవాదాలు
Deleteరాంక్ వల్ల ఉపయోగం లేదు. ఎవరు నిర్ణయిస్తారు ఈ రాంక్! అదొక గోల మళ్ళీ. నా ఉద్దేశ్యం మీ దగ్గర నమోదు ఐన బ్లాగులన్నీ కూడా అక్షర క్రమంలో, కనపడే విభాగం ఏర్పరిస్తే బాగుంటుంది. అక్కడకు వెళ్ళి అసలు ఈ మధ్య వ్యాసాలు వ్రాయని బ్లాగు కూడా చూడవచ్చు. తరచూ వ్రాయనంత మాత్రాన సంకలినిలో కనపడకాపోతే ఎలా! అలా అక్షరక్రమంలో ఏర్పరిచిన బ్లాగుల జాబితాలో, ప్రతి బ్లాకు పేరుకు పక్కన, బ్లాగు మొదలుపెట్టిన తేదీ, చివరిసారిగా వ్రాయబడ్డ వ్యాసం తేదీ, ఎంతమంది ఆ బ్లాగును అనుసరిస్తున్నారు వివరాలు ఇస్తే బాగుంటుంది. చూసే వాళ్లకు ఆయా బ్లాగులను బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. బ్లాగర్ కు కూడా తన బ్లాగు ను సంకలినిలో చూసుకున్నప్పుడు, తాను ఈ మధ్య వ్రాయలేదన్న విషయం అవగతం అవుతుంది.
Delete