గడచిన నాలుగైదు సంవత్సరాలుగా "బ్లాగిల్లు"పై అటు బ్లాగర్లు, వీక్షకులు చూపుతున్న అభిమానం చాలా గొప్పది . బ్లాగిల్లు పుట్టినప్పట్నుంచీ ఆధునీకరణ చేసుకుంటూనే ఉంది . అంతే దు అనేక కష్ట నష్టాలను ఎదుర్కుంటూనే ఉంది . వివిధ కారణాల వల్ల నేను గడచిన నెల రోజులుగా బ్లాగులవైపు చూడడం మానేసాను . ర్యాంకింగ్ విభాగాన్ని ఆధునీకరించలేదు, క్రొత్త బ్లాగులను చేర్చలేదు . అయినప్పటికీ బ్లాగిల్లు వీక్షకుల సంఖ్య తగ్గలేదు ... పైగా కాస్త పెరిగింది కూడా !
పని వత్తిడులవల్ల మరికొంత కాలం (కొన్ని వారాలు) బ్లాగులవైపు చూడడం తగ్గించవచ్చు. కానీ త్వరలో ఒక టీం ను ఏర్పాటుచెసుకునే ఆలోచన ఉంది . మీ అభిమాన బ్లాగిల్లు మరింత గొప్పగా తయారవడం కోసం ఒక స్క్రిప్టును తయారు చేయవచ్చు .
ప్రస్తుతం బ్లాగిల్లు వద్ద విండోస్ , లినక్స్ సర్వర్లు ఉన్నాయి . వాటిపై హోస్టు చేసేందుకు తగిన స్క్రిప్టు తయారు చేసే ఆలోచన ఉంది . సమయం చిక్కినప్పుడు ఆదిశగా ఆలోచించి మెరుగైన సదుపాయాలు మీకు అందించే ఏర్పాటు తప్పక చేస్తాను . మీరు కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక మంచి సంకలిని చూసినట్లయితే నాకు తెలియచేయండి . అటువంటి స్క్రిప్టు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను.
క్రొత్తగా బ్లాగిల్లులో బ్లాగులను జతచేస్తున్నవారు దయచేసి జరుగుతున్న ఆలస్యానికి క్షమించగలరు . సాధ్యమైనంత తొందరలో మీ బ్లాగులు జతచేయడం జరుగుతుంది .
వేసవి సెలవుల శుభాకాంక్షలతో ...
No comments:
Post a Comment