బ్లాగులూ - కామెంట్లూ - ఆగ్రిగేటర్లూ

       దాదాపు రెండు నెలల క్రితం ఇదే బ్లాగులో " కామెంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి " అనే టపా వ్రాయడం జరిగింది. ఇప్పుడు కొన్ని బ్లాగులలో కామెంట్లు ఎక్కువయ్యాయని వాటిని సంకలినులు నిరోధించాలి ( నిషేదించాలి కాదు) అంటూ కొందరు నాకు లేఖలు వ్రాస్తున్నారు, కొందరు తమ బ్లాగుల్లో టపాలు కూడా పెడుతున్నారు . నిజానికి కామెంట్లు అనేవి  ప్రతీ బ్లాగుకూ ఒక ఇందనంలాంటివి అని నా నమ్మకం. ఇప్పుడు ప్రజ బ్లాగులో కానీ , శంకరాభరణం బ్లాగులో కానీ ,  క్రొత్తగా భరతమాత సేవలో బ్లాగులో గానీ టపాలు ఎక్కువగా వ్రాస్తున్నారంటే దానికి కారణం చదివేవాళ్ళు ఎక్కువగా ఆదరించి కామెంట్లు పెడుతూ ఉండడమే ! వ్యాఖ్యాతల ఆదరణే  ఏ బ్లాగరునైనా ఉత్సాహపరుస్తుంది అనడంలో అతిశయిక్తి లేదు . గతంలో ఈరోజు ఎక్కువగా కామెంట్లు వచ్చిన బ్లాగులు , ఎక్కువ కామెంట్లు చేసినవారు అనే ఉప శీర్షికలు బ్లాగిల్లులో ఉంచాను . దీనికి కారణం ఆయా బ్లాగర్లను , వ్యాఖ్యాతలను ఉత్సాహపరచడమే . ఆమధ్య హారం మూతపడినందుకు చాలా మంది బాధ పడింది దానిలోని కామెంట్ల సదుపాయాన్ని చూసే !
       బ్లాగరుకు ఏ విషయంపైన అవగాహన ఉందొ ఆ విషయంపైన ఎలా టపాలు వ్రాస్తారో కామెంట్లు వ్రాసేవారు కూడా తమ తమ అభీష్టాల మేరకు తాము నచ్చిన  అంశంలో మాత్రమే కామెంట్లు పెట్టగలరు . ప్రజ  లో కామెంట్లు చేసేవారు, శంకరాభరణంలో చేయాలని లేదు కదా !సంస్కృతిని కాపాడే శంకరాభరణం ఎలా అభినందనీయమో  నేటి వర్తమాన రాజకీయాలపై వ్రాస్తున్న ప్రజ  అలాగే అభినందనీయం . ఏ విషయంలోనైనా బ్లాగు నిర్వహించాలంటే అది సామాన్య విషయం కాదు . శ్రమ , ధనం, కాలం వెచ్చించి చేస్తున్న పని ఇది . వర్తమాన రాజకీయాలపై చర్చించాలని తద్వారా ఆయా విషయాలపై బ్లాగర్లకు తప్పు-ఒప్పులు తెలుస్తాయని పల్లా కొండలరావు గారు చేస్తున్న ప్రయత్నం హర్షించదగినది . సంస్కృతిని కాపాడేందుకు ఛందస్సుపై అవగాహన పెంచేందుకు శంకరయ్యగారు , దేశనాయకుల గురించి , మన దేశం గొప్పతనాన్ని చాటుతున్న భారతమాత సేవలో సాయినాధ్ రెడ్డి గారు , సాంప్రదాయలను నేటి తరం మర్చిపోకుండా చేస్తున్న కష్టేఫలే శర్మ గారు , శ్యామలీయం గారూ .. ఇంకా ఎందఱో తమ బ్లాగుల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ అభినందనీయులే !
ఇక వ్యాఖ్యలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం  చేయడానికి రాయాలి తప్ప తమ ఆలోచనలతో విభేదిస్తున్నవారిని దూషించడానికి కాదు. తమ వాదనలో బలం ఉన్నప్పుడు ఎదుటివారు పునరాలోచించే అవకాశం  ఉంది. అయితే ఈ వ్యాఖ్యల నియంత్రణ బాధ్యత పూర్తిగా ఆయా బ్లాగు నిర్వాహకులదే . అనామక వ్యాఖ్యలు అనుమతించాలా, మోడరేషన్ పెట్టాలా అన్న సదుపాయాన్ని తమ అవసరాలను తగ్గట్టు వినియోగించుకొనేలా గూగుల్ , వర్డ్ ప్రెస్ మన చేతికే ఇచ్చాయి .
      అయితే సంకలినులకు కొన్ని పరిమితులు ఉంటాయి . అవి వ్యాఖ్యలను , టపాలను నియంత్రించలేవు . అలా చేస్తే అది భావా స్వేచ్చను హరించడం కూడా ! కూడలి ఈ సదుపాయాన్ని కూడా మన చేతికే ఇచ్చింది . ఇక వ్యాఖ్యల కోసం పూర్తిస్థాయి విభాగాలు ఉన్న మాలిక , బ్లాగిల్లు  వ్యాఖ్యాతలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏ ఇతర భాషలోలని  ఆగ్రిగేటర్  లలోనూ  ఇంతవరకూ నేను చూడలేదు. అయితే రెండు కాలమ్  లలో వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చే బ్లాగు ఒకవైపు, రాని  బ్లాగులు పెట్టమనడంపై నాకు ఖచ్చితమైన అభిప్రాయం లేదు . ఈ విషయంలో అందరూ చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది . అయితే ఏ బ్లాగునూ నిరోధించమనకూడదు అనేది నా అభిప్రాయం . 

8 comments:

  1. మీరు చెప్పిన దానితో 100% నేను ఏకీభవిస్తున్నాను శ్రీనివాస్ గారు.బ్లాగర్లకు కామెంట్లే ఊపిరి.అవే లేకపోతే కొన్నాళ్లకు తెలుగు బ్లాగులన్నీ చచ్చిపోతాయి.

    ReplyDelete
  2. ఏమి చేస్తాం, నువ్వు చెప్పింది తప్పు అంటే కాలుతుంది కదా!

    ReplyDelete
  3. మీ అభిప్రాయాలతో 100% ఏకీభవిస్తున్నాను శ్రీనివాస్ గారు. చాలా బాగా వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ కొండలరావు గారూ ! మీ క్రొత్త ప్రోజక్ట్ విజయవంతం అవాలని కోరుకుంటూ

      Delete
  4. ముందుగా బ్లాగిల్లు వేదికను తెలుగు వారికి అంకితం చేసిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
    నిజానికి ప్రజ-తెలుగు వారి చర్చా వేదిక కొండలరావు గారు ఎంతో మంచి చేస్తునట్టే. ఎలా అంటే చాలా బ్లాగులు సినిమాల గురించి అనవసరమైన చెత్తను రాస్తుంటారు. దాని వాళ్ళ వోరింగిందేమి లేదు. కాని మన రాజకీయాల గురించి, మన వ్యవస్థలోని తప్పుల గురించి చర్చించుకోవటం ఒక అవగాహన పెంచుకోవటం, పాలనలో ప్రజలు భాగస్వామ్యులు అవ్వటం ఇదే జరగాల్సింది. మనం చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే వున్నాయ్. ప్రజ బ్లాగు చేసే చర్చలు అద్భుతం.
    కాని అలా ఆ చర్చలలో మీరు చెప్పిన విధంగా దుర్భాష లేకుండా చూసుకోవాలి. చర్చలలో పాల్గొనేది విద్యావంతులే కదా. అది గమనించి దానికి తగ్గటుగా నడుచుకోవాలి.
    జై హింద్....

    ReplyDelete

hit counter