దీపావళి అందరూ బాగా చేసుకుంటున్నారని తలుస్తాను.
టపాలో అప్పటికి 2998 బ్లాగులు ఉన్నాయని చెప్పాను. అంటే అప్పటి నుండి 18 క్రొత్త బ్లాగులే కలిపారా అనొచ్చు మీరు. కానీ అప్పటి నుండి జతచేసిన బ్లాగుల సంఖ్య లెక్కేస్తే 145గా తేలింది అంటే దాదాపు 127 బ్లాగులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ కావాలని తొలగించినవి కాదు. ఆయా బ్లాగు నిర్వాహకులే తమ బ్లాగులను తొలగించుకోవడమో, ప్రయివేట్ ఎక్సిస్ చేసుకోవడమో చేశారు.
ఇప్పటికీ తెలుగులో అత్యధిక బ్లాగులు కలిగిన సంకలిని శోధిని అని ఖచ్చితంగా చెప్పగలను.
గత కొద్దిరోజుల నుండి కామెంట్ల విభాగం మూసివేశాక శోధిని వీక్షకులు దాదాపు 10% తగ్గిపోయారు. అంటే ఎక్కువమంది వ్యాఖ్యలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్ధమవుతుంది.
అజ్ఞాతల కామెంట్లలో వేరే బ్లాగర్లను తిడుతుండడంతో కొన్ని కారణాల దృష్ట్యా ఆ విభాగం ఆపవలసి వచ్చింది. ముందుగా అజ్ఞాత కామెంట్లను అనుమతిస్తున్న బ్లాగులను కామెంట్ల విభాగం నుంచి తొలగిందామనుకున్నా ఆయా బ్లాగులలో మంచి కామెంట్లు కూడా వస్తుండడంతో వేరే ఆలోచన చేయడం జరిగింది. కేవలం అజ్ఞాత కామెంట్లను మాత్రం ఆపి మిగతా కామెంట్లతో వ్యాఖ్యల విభాగం రూపొందించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పని దాదాపు పూర్తి అయినా ... డిజైన్ పరంగా కూడా మార్పులు చేసి మాలిక లాగా రెండు కాలమ్స్ లలో తీసుకురావడానికి ప్రయ్నతాలు సాగుతున్నాయి. బహుశా ఈ నెలాఖరుకు అది మీముందు ఉండొచ్చు .
రాబోతున్న కామెంట్ల విభాగంలో చేయాల్సిన మార్పులపై మీరు చెప్పదల్సుకుంది ఏమైనా ఉంటె ఇక్కడ చెప్పొచ్చు. వీలుంటే పరిశీలిస్తాం...
"శోధిని" నుంచి కొన్ని బ్లాగులు తొలగించాలా? అనే టపాకు స్పందించి మంచి కామెంట్లను అందించిన అందరికీ కృతజ్ఞతలు. శోధిని నుంచి ఒక్క బ్లాగుకూడా సరైన కారణం చూపకుండా తొలగించకూడదని నిర్ణయించడం జరిగింది. బ్లాగు పేరు ఎలాగూ కనపడుతుంది.ఇష్టం లేనివారు ఆ బ్లాగుకు వెళ్లకుండా ఉంటె బెటర్. లోనికి తొంగి చూడ్డం ఎందుకు .. బాధ పడడం ఎందుకు ?.. అంతే అంటారా ?!
ప్రస్తుతం శోధినిలో 3016 ఉన్నాయి. "శోధిని" తెలుగు బ్లాగుల సంకలిని