సరిక్రొత్త "శోధిని" మీకు ఆహ్వానం పలుకుతోంది ....

 బ్లాగులు రాసేవారూ , చూసేవారూ గణనీయంగా తగ్గిపోయారు ... దీనికి చాలా కారణాలున్నా ముఖ్యమైనవి ఏంటంటే - 

1. బిజీ లైఫ్ 

2. తెలుగు ప్రాధాన్యత తగ్గడం. యువకులు రాకపోడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం రాస్తున్నది, చూస్తున్నది పాతతరం వారే.

3. సోషల్ మీడియా 


ఇక ఆగ్గ్రిగేటర్ లు చూసేవారు వేలలోంచి వందలోపుకి పడిపోయారు . అయితే ఇలాంటి పరిస్థితిలో 'శోధిని' క్రొత్త వర్షన్ అవసరమా?  అని మీరు అడగొచ్చు . 

చాలా కాలంనుండి అదే స్క్రిప్ట్ వాడడం , సర్వర్లు  క్రొత్త స్క్రిప్ట్ లతో అప్డేట్ అవ్వడంతో ఒక్కోసారి కొన్ని ఎర్రర్ లు వస్తున్నాయి . అలాగే ఆ స్క్రిప్ట్ నూతన ఫీచర్లకు అనుగుణంగా లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. 

ఇప్పుడు లాభం ఏమిటి? 

మీరు టపా కానీ వ్యాఖ్య కానీ రాసిన క్షణాల్లోనే శోధిని లో ప్రత్యక్షం. 

మొబైల్ లో ఒకే వరుసలో టపాలు - దీనివల్ల మొబైల్ ద్వారా వీక్షించేవారికి చాలా సౌలభ్యం

కొత్త ఫీచర్స్ ఎన్నో తీసుకు రావొచ్చు. 


రాబోయే మార్పులు, చేర్పులు ఏంటి 

  • తెలుగు వార్తా పత్రికల సంకలిని - ఈనాడు, సాక్షి లాంటి ప్రధాన పత్రికలతో 
  • యూట్యూబ్ సంకలిని - తెలుగు చానల్ లతో 

బ్లాగుల విభాగంలో రాబోతున్నచేర్పులు 

  • రచయిత, బ్లాగు ఆధారంగా టపాలు
  • ఎక్కువగా రాసినవారి పేర్ల లిస్టు

ఇంకా ఎన్నో ... 




1 comment:

  1. తెనుగు బ్లాగులో రాసేవారూ, చూసేవారూ వేళ్ళమీద లెక్కించచ్చేమో. కారణాలనేకం. శోధినిలో మార్పులు తీసుకొస్తున్నందుకు సంతసం. కామెంట్లు చూసాను. సెల్ లో టపాల్లాగానే వరసగా వస్తున్నాయి. వేగం చెప్పలేను. కామెంట్ రాసి బ్లాగులో వేసి శోధినిలో కొచ్చేటప్పటికి ప్రత్యక్షం. బాగుంది. మార్పులు చేయండి. ”తినబోతూ రుచి, దిగబోతూ లోతూ అడగడమెందుకు” నానుడి :)

    ReplyDelete

hit counter