బ్లాగుల సంకలిని "శోధిని" లో మార్పులు

 చాలాకాలం తర్వాత మీ అభిమాన శోధిని లో  వీక్షకుల సౌకర్యార్ధం  కొన్ని మార్పులు చేయబడ్డాయి. అవి - 

ఇకపై రెండు వరుసలలో విడి, విడి బ్లాగుల నుంచి టపాలు కాకుండా అన్ని బ్లాగుల టపాలూ రెండువైపులా విస్తరిస్తాయి. దీనివల్ల మొబైల్ లో వీక్షించే వారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. రెండు వరసలలో చూపడం వల్ల ఒక వరుస క్రింద మరో వరుస వచ్చి క్రింది వరకూ రెండో వరుస టపాలకోసం వెళ్ళవలసి వచ్చేది.. ఇకపై ఆ ఇబ్బంది రాదు ..

 

 ఇక వేగం అంటారా ??? మీరే చూడండి ... దూసుకుపోతుంది

 

ఈ మార్పు మీకు నచ్చిందని ఆశిస్తున్నా....

ఇకపోతే...

వ్యాఖ్యల విభాగం కూడా కొన్ని మార్పులతో ముందుకి త్వరలో రాబోతుంది. 


శోధిని కి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు 




16 comments:

  1. ఈ రోజు ఉదయమే శోధిని చూసాను.
    మొదటగా తెనుగు భాషపట్ల మీ అభిమానానికి అభినందనలు.
    కష్టాలకోర్చి శోధిని నడుపుతున్నందుకు మరొకసారి అభినందన.
    రాజరాజనరేంద్రుని పరంపర కొనసాగిస్తున్నందుకు నమస్కారం.
    శోధిని లో నేను గమనించిన మార్పులు.
    సెల్ లో ఒకటే వరుసలో టపాలు కనపడుతున్నాయి.
    డెస్క్ టాప్ మీద రెండు వరసల్లో కనపడుతున్నాయి, ఇదివరలాగే.
    టపా ప్రచురించిన తారీకు సమయం కనపడుతున్నాయి. ఇక కామెంట్ల లో ఏం మార్పులు చేయబోతారో వేచి చూస్తాను.
    వేగం బాగుంది.
    --/\--

    ReplyDelete
  2. "శోధిని" వ్యాఖ్యల విభాగం కూడా విడుదల అయింది.... శోధిని ఇప్పుడు PHP లోని క్రొత్త వర్శన్లకు అనుగుణంగా ఆధునీకరించబడింది... మరిన్ని క్రొత్త ఫీచర్స్ త్వరలో .... ఓసారి లుక్కేయండి ... వివరాలు బ్లాగు టపా ద్వారా వెల్లడిస్తాను

    ReplyDelete
  3. మా మాలికని కాపీకొట్టేరా ?

    ReplyDelete
    Replies
    1. చాలు! చాలు!! గొప్పచెప్పొచ్చేరు. మాలిక బిగిసి రెండు వారాలు, చెప్పి వారం పై మాట

      Delete
    2. నేను కూడలి, హారం లను ఇప్పటికీ అనుకరించాలని చూస్తాను... అలాగే శోధిని మొబైల్ రేస్పాన్సివ్ వెబ్ సైట్ .. మాలికని మొబైల్ లో సరిగా చూడలేము కదా.

      Delete
    3. ఏమాటకామాటే చెప్పుకోవాలి :)
      మాలికని సెల్లులో ఒక్క సారిగా చూడలేకపోవచ్చుగాని పక్కకు జరుపుకు చూడడం అసౌకర్యం అనిపించలేదు, నాకు.
      నాది రెండు కళ్ళ సిద్ధాంతం కాదుగాని, ఆగ్రిగేటర్ నిర్వహించేవారికి తెలుస్తుంది కష్టం.
      మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువని నానుడి.

      Delete
  4. @Zilebi ఇప్పుడు వేగంలో మాతో పోటీ లేనే లేదిక!!!

    ReplyDelete
    Replies
    1. అబ్బా! ఇంత వేగమా!!! పొరపాటుగా నొక్కేస్తే కూడా ఆగ్రిగేటర్ లో వచ్చేస్తే ఎలా చెప్మా! ప్రచురించేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదా టపా తీసెయ్యాలి! కడవలే!! కణ్ణా!!!

      Delete
    2. మీతో మా చెడ్డ చిక్కొచ్చి పడింది, శర్మ గారూ. వేగంగా ఉంటే స్పీడెక్కువై పోయింది అంటారు, నింపాదిగా ఉంటే పాసెంజర్ బండి అంటారు. ఎలాగండీ? 😐🙂

      (నిజానికి ఈ మాట “శోధిని” శ్రీనివాస్ అనాలి. వకాల్తా పుచ్చుకుని నేనే అనేసాను 🙂).

      Delete
    3. "అత్తపదును అరిసెలపదును తెలుసుకోడం కష్టం" అంటుంది నానుడి.
      లోకులూ అంతేనండి. చేస్తే ఎందుకు చేసేరు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు? అంటారండి ప్రభుత్వాన్ని.
      ఆ వేగానికి అచ్చెరువున మునిగితిని. ఐతే ఇక్కడ శ్రీనివాస్ గారిని వేగాన్ని నియంత్రించమనలా! వేగంగా టపా వెళుతుందిగనక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పుకున్నా :) కాకపోతే టపా తీసెయ్యాలనీ చెప్పేసుకున్నానండి :)
      ఐతే ఇక్కడ కూడా ఆచార్య చాణక్యుని మాట
      సరిపోతుందనుకుంటానండి.
      అత్యాసన్నాః వినాశాయ
      దూరస్థాః న ఫలప్రదాః
      సేవ్యంతాం మధ్య భావేన
      రాజా వహ్ని గురుస్త్రియః

      రాజు,నిప్పు,గురుస్త్రీలు వీరిపట్ల అతి సన్నిహితంగా ఉంటే వినాశనమే, అలాగని దూరంగా ఉండి ఉపయోగం లేదు. అందుచేత మధ్యస్థ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుని మాట.


      Delete
    4. కృతజ్ఞతలు సార్... అయితే శోధిని లో వేగం ఉన్నా బ్లాగులు గూడ్సు బండిలా నడుస్తున్నాయి :( .. క్రొత్తవారు ఇటువైపు చూడడమే లేదు...

      Delete
  5. మాలిక బిగిసి రెండువారాలు...

    పిలిచిన బిగువటరా

    ఔరౌరా లక్కుపేట రౌడీ !

    ఓ మనవడా!

    కల్నల్ జంబులింగం !

    భరద్వాజా!

    రారమ్మ !

    మాలిక బిగువును విడగొట్టుమా :)

    ReplyDelete
    Replies
    1. ఏమైనాడో మనవడు
      ఉలుకూ పలుకూ లే!

      Delete
  6. ఏల మా బ్లాగు శోధిని లో కనబడుటలేదు ?

    ReplyDelete
  7. అయ్యో .. ఎలా పోయిన్దబ్బా !!! సర్లెండి పెట్టాను .. మీ పోస్టు కూడా ఆ 'మాలిక రౌడీ' గారికి కనపడేలా చేసాన్లెండి

    ReplyDelete

hit counter