ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలో కాలిఫోర్నియాలోని కుపర్టినోలో గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె నివాసంలో ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిసులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు.
తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.
No comments:
Post a Comment