తెలుగు వెబ్ సైట్లకూ గూగుల్ యాడ్ సెన్స్ - Google Adsense for Telugu Websites

"గూగుల్ యాడ్ సెన్స్" అనగానే వెబ్సైట్ నడిపేపారికి  ఓ ఉత్సాహం పుట్టుకొస్తుంది. ప్రపంచంలో లక్షలాది  వెబ్సైట్లు కేవలం గూగుల్ యాడ్స్ ద్వారా వచ్ఛే ఆదాయంతోనే నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటివరకూ ఈ సదుపాయాన్ని గూగుల్ కొన్ని బాషలకే పరిమితం చేసింది. మనదేశానికి సంబంధించి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలోనే గూగుల్ యాడ్స్ అందిస్తుంది.

కాగా ప్రాంతీయ భాషల్లో ఇంటెర్నెట్ వినియోగాన్ని గుర్తించిన గూగుల్ ప్రస్తుతం యాడ్ సెన్స్ సర్వీసును బెంగాలీ, మరాఠీ,తెలుగు,తమిళ్ భాషలకూ విస్తరించింది. అంటే ఇకపై తెలుగు బ్లాగర్లూ, వెబ్ సైట్ల అధినేతలూ గూగుల్ యాడ్స్ ను తమ వెబ్ సైట్లలో ఉంచుకోవచ్చు. దీనిపై అవగాహనకు గూగుల్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో అవగాహనా సదస్సులు కూడా నిర్వహంచే ఏర్పాట్లు చేస్తుంది. 

గూగుల్ యాడ్ సెన్స్ అంటే ఏమిటి? 

ఆడ్ సెన్స్ (Google Adsense) అనేది ఒక గూగుల్ ద్యారా నడుస్తున్న ఒక ప్రకటనా సర్వీసు. చాలా బడా కంపెనీలు, సంస్థలు తమ ప్రకటనలు ఇవ్వడానికి గూగుల్ ఈ సదుపాయాన్ని కల్పించింది. వివిధ వెబ్సైట్లలో గూగుల్  ఇచ్చే ఒక కోడ్ పెట్టుకోవడం ద్వారా తమ వెబ్సైట్లలో ప్రకటనలను ఆహ్వానిస్తారు వెబ్సైట్ల నిర్వాహకులు. ప్రకటనదారులు కొంత రుసుము చెల్లించి గూగుల్ లో ఇచ్ఛే ప్రకటనలు ఈ వెబ్సైట్లలో కనిపిస్తాయి. దానిపై వచ్చే ఆదాయంలో కొంత వెబ్ సైట్ల నిర్వాహకులకు గూగుల్ చెల్లిస్తుంది. 
ఇలా తమ వెబ్సైట్లలో వచ్చే ప్రకటనల ద్వారా నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. 

గూగుల్ తెలుగులో యాడ్ సెన్స్ ను అనుమతించిన దరిమిలా తెలుగు వెబ్సైట్లకు, బ్లాగులకు చాలా మేలు జరుగుతుంది. అనేకానేక క్రొత్త వెబ్ సైట్లు పుట్టుకొస్తాయి . తద్వారా తెలుగు భాషకు కూడా తప్పక మేలు జరుగుతుంది అనేది ఖాయం.




2 comments:



  1. ఆడు సెన్సులదిగదిగో నయ్య గూగు
    లోడి చలువ గావచ్చు హలో హలో య
    నుచు జిలేబులూరంగ తెనుంగు వారి
    కెల్ల,! వచ్చునోదస్కము కెంపులీన‌ :)

    జిలేబి

    ReplyDelete

hit counter