గతం ఎప్పుడూ గొప్పదే అంటుంటాం... అయితే నా జీవితంలో 2017 గొప్ప అనుభూతులను, ఆనందాన్ని పండించింది. ఎన్నో కష్టాలనుంచి ఈ సంవత్సరం నన్ను గట్టున పడేసింది..
ఎన్నో అనుభవాలు నేర్పింది...
అందుకే ఈ సంవత్సరానికి కృతజ్ఞతలు చెప్పకుండా నేను ఉండలేను.
కొందరంటారు తెలుగు సంవత్సరాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది అని. మంచిదే కదా ఇంకో రెండు, మూడు నెలలు మంచిని ఆస్వాదించవచ్చు కదా ! అయితే క్రొత్త క్యాలెండర్ గోడకు తగిలించేది ఈరోజే కనుక, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరంగా గుర్తించారు కనుక, ఈరోజే 2017 కు వీడ్కోలు చెపుతున్నాం కనుక నేడే నా కృతజ్ఞతలను 2017 కి చెప్పదలిచాను
థేంక్ యూ 2017 ... నీకు వీడ్కోలు పలుకుతున్నా... కాస్త నా గురించి 2018 కి చెప్పి నన్ను బాగా చూడమని రికమెండ్ చేయవూ .. :)
dear sir good telugu articles
ReplyDeleteLatest Telugu News