తెలుగు బ్లాగర్లకు బ్లాగిల్లు నుండి మరో బహుమతి - బ్లాగిల్లు డైరెక్టరీ

తెలుగు బ్లాగర్లకు వారి అభిరుచులకు గౌరవం ఇస్తూ ముందుకు సాగే మీ అభిమాన బ్లాగిల్లు మీ కోసం మరో బహుమతిని అందిస్తున్నది. అదే బ్లాగిల్లు డైరెక్టరీ.
బ్లాగిల్లు లో నమోదైన అన్ని బ్లాగులతో కూడిన లిస్టు అక్షర క్రమంతో కూడిన పేజీలతో మీకు అందిస్తున్నాం . బ్లాగు పేరు , రచయిత, చివరిసారిగా వ్రాసిన టపా శీర్షిక (తేదీతో సహా ) ఈ లిస్టులో పొందుపరిచాం. వర్డ్ ప్రెస్సు బ్లాగు ఫీడ్ లోపం వల్ల కొన్ని బ్లాగుల వివరాల్లో లోపాలు ఉండొచ్చు . కాకపొతే వాటిని వీలు వెంబడి సవరిస్తాం .
మీ స్పందనలకు ఆహ్వానం .

                              ఇక్కడి నుండి ఆ విభాగాన్ని  చేరుకోవచ్చు . 


13 comments:

  1. ఈ డైరెక్టరీ అమూల్యం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు! మీ స్పందనకు కృతజ్ఞతలు

      Delete
  2. చాలా బాగుంది. చాలా త్వరగా కార్యరూపం దాల్చింది. Thanks to Kappagantu Sivarama Prasad గారి సలహా.
    ------------------------
    (2). ఆ చేత్తోటే ఒక్కో అక్షరం క్రింద ఉన్న టేబుల్లో మొదటి column లో ఉన్న బ్లాగుల పేర్ల లిస్ట్ ని కూడా alphabetical order లో sort చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం. కొన్ని బ్లాగ్ పేర్ల మొదటి అక్షరం చిన్న అక్షరంగాను, కొన్నిటివి పెద్ద అక్షరం (capital letter) గానూ ఉండడం వల్ల సార్టింగ్ కొంచెం తేడా వస్తుందనుకోండి గానీ మొత్తం మీద బాగుంటుంది.
    (3). wordpress బ్లాగులే కాక blogspot బ్లాగుల్లో కూడా కొన్నింటిలో "రచయిత" గారి పేరు రాలేదు (column 2).
    ------------------------

    మీరు చేస్తున్నది ప్రశంసించదగ్గ ప్రయత్నం. బ్లాగు లోకానికి ఎంతో ఉపయోగకరం. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు, ధన్యవాదాలు !
      మీరన్నట్లుగా కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. వీలు వంబడి వాటిని సవరిస్తాను .
      కప్పగంతువారి సూచనే ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి కారణం. వారికి అభినందనలు

      Delete
    2. సార్టింగ్ గురించి నేను పైన అన్నది ascending order లో అని నా భావం.

      Delete
  3. చాలా బాగుంది.మంచి సౌకర్యం.

    ReplyDelete
  4. తెలుగుబ్లాగుల డైరక్టరీ లింకును ఆసక్తికల బ్లాగర్లు తమతమ బ్లాగుల్లో ప్రదర్శించటం వలన బ్లాగులోకపాఠకులకు సదుపాయం పెరుగుతంది. అలాగే అనేకబ్లాగులకు కొత్తపాఠకులు రావటానికీ ఆస్కారం ఉంది. ఈ విషయంలో కొంచెం ఆలోచించండి. వీలైతే ఒక స్టిక్కర్ ఇవ్వండి అది జతచేసుకోవటం సులభంగా ఉంటుంది కదా.

    ReplyDelete
  5. శ్యామలరావు గారు చెప్పినది మంచి సలహా.

    ReplyDelete
  6. ప్రతి ఒక్కరు బుక్‌మార్క్ చేసుకోవలసిన పేజి అది. నిర్వహణ కూడ బాగుంటే మంచిది.

    ReplyDelete
  7. మీరు ఇచ్చిన డైరెక్టరీ చూస్తున్నాను.
    కొన్ని గమనార్హవిషయాలుః: 'అమ్మ ఒడి' బ్లాగు ఆదిలక్ష్మిగారి కుటుంబవిషాదం తరువాత స్థభ్దమైపోయింది. ఆవిడెలాగున్నారో! ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. 'అలలపై కలలతీగ' బ్లాగు మూగబోయింది జాన్ హైడ్ అకాలనిర్యాణంతో!

    ReplyDelete
  8. తెలుగుబ్లాగుల డైరెక్టరీ బాగుందని మరొకసారి అంటున్నాను. మీరు కొంచెం అలోచించి తెలుగుబ్లాగర్ల డైరెక్టరీని కూడా ఇవ్వగలరు. ఉదాహరణకు నాకు తెలిసిన అమ్మాయి 'ముగ్గిళ్ళ అరుణ' బ్లాగు పేరు మరచిపోయాను. బ్లాగర్ల డైరెక్టరీ ఉంటే అందులో చూసి తెలుసుకోవటం సులువయ్యేది కదా! ఈ సూచనను సానుకూలంగా పరిశీలించండి వీలైతే. కొన్ని ఇబ్బందులున్నాయని తెలుసును - ఉదాహరణకు అనేకులు కలంపేరు తోనే బ్లాగులు వ్రాస్తున్నారు. నా పేరు దాపరికం కాదు కాని మీరు శ్యామలీయం అనే ఇచ్చారు - కారణం గ్రహించటం సులభమే. ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచించగలరు.

    ReplyDelete
  9. శ్యామలరావు గారు సూచించిన "బ్లాగర్ల డైరెక్టరీ" ప్రశస్తమైన ఆలోచన. దీని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది - మీ వీలు చూసుకునేలెండి.

    ReplyDelete
  10. శ్యామలీయం గారికి, విన్నకోట నరసింహా రావు గార్కి ఇంకా ఈ డైరెక్టరీని ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు. మీ సలహాలకు, సూచనలకు ప్రత్యెక అభినందనలు. వాటికి ఈరోజే ఒక టపాలో సమాధానం ఇస్తాను.

    ReplyDelete

hit counter