తెలుగు బ్లాగులకు ఆదరణ తగ్గుతున్నదా ?

బ్లాగు గురువు ...
ఈ పదం అనగానే గుర్తువచ్చే ఒకే ఒక పేరు జ్యోతి గారు .జ్యోతి బ్లాగు ద్వారా అందరికీ చిరపరిచితురాలైన శ్రీమతి జ్యోతి వలబోజు గత రెండురోజుల క్రితంతన బ్లాగులో చెప్పిన మనసులోని మాట " బ్లాగులో రెస్పాన్స్ కూడా చాలా తగ్గడంతో ఇక్కడ తరచూ రాయాలనే ఆసక్తి కూడా తగ్గుతోంది.."  చాలామంది తెలుగువారికి బ్లాగును పరిచయం చేసిన ఆమె ఇలాంటి మాట అనడం మనందరం ఆలోచించవలసిన అవసరాన్ని తెలియచేస్తున్నది .

నిజానికి ఆమె బ్లాగుకే కాదు అన్ని బ్లాగులకూ ఆదరణ తగ్గుతుండడంతో చాలామంది బ్లాగర్లు తమ రచనా వ్యాసంగాన్ని వేరే రంగాలకు మళ్ళించారు. ఇక్కడ మంచి టపాలు వ్రాసినా ఆదరణ కరువైతే ఇక వ్రాయడం వృధా అనే నిర్ణయానికి వచ్చేసారు .
కూడలి .. తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ యొక్క కొన్ని సంవత్సరాల వీక్షణలు పరిశీలించండి .

పై చితంలో చూస్తే కూడలికి వచ్చిన వీక్షకుల సమాఖ్య అర్ధమవుతుంది . 2012 తర్వాత క్రమేణా వీక్షణలు తగ్గుతూనే ఉన్నాయి . ఇదే పంధా మిగతా సంకలినులకూ వర్తిస్తుంది . ప్రస్తుతం తెలుగు బ్లాగు కేవలం వ్యాపార/ వ్యక్తిగత  ప్రచార సాధనంగా చాలామంది యువ బ్లాగర్లు చూస్తున్నారు . ఒక మంచి వ్యాసమో , కథో , కవితో ఒక బ్లాగులో వచ్చినా స్పందన రాక "బాధ పడుతున్న" అనేక మంది ఈ వ్యాసంగాన్ని వదులు కుంటున్నారు .
దీనికి పరిష్కారం లేదా ? పాత తరం బ్లాగర్లు తిరిగి మళ్ళీ తమ తమ బ్లాగుల్లో అడుగుపెట్టాలంటే మళ్ళీ తెలుగు బ్లాగులు మంచి టపాలను అందించాలి . నా విశ్లేషణ  ప్రకారం తెలుగులో 10,000 కు పైగా బ్లాగులు ఉన్నా అడపాదడపా ( సంవత్సరంలో ఓసారైనా ) వ్రాసేవారు దాదాపు 3000. కానీ కనీసం నెలకు ఓసారి వ్రాసేవారు 300 మంది . వారానికి ఒక టపా అయినా వ్రాసేవారు 50 లోపే !
తెలుగు బ్లాగులు మళ్ళీ కళకళ లాడాలంటే ప్రతీ బ్లాగరూ వారానికి ఒక మంచి టపానైనా వ్రాయాలి ఏదో ఒకరోజు కనీసం ఒక గంటో,  అరగంటో కేటాయించి ఒక్క టపా వ్రాయాలి . అలాగే అదే రోజు కనీసం 5 టపాలకు వ్యాఖ్యలు వ్రాయాలి.  వారు ఏ రంగంలో బిజీగా ఉన్నా కనీసం వారానికి ఒక గంట బ్లాగులపై కేటాయించాలి.
ఇది నా విజ్ఞప్తి !
నేను కూడా ఈమధ్య బ్లాగులవైపు సరిగా చూడలేదు అనేది వాస్తవం . ఇకపై వారానికి ఒక గంట సేపైనా బ్లాగులోకంలో విహరంచాలని నిర్ణయించాను.
బ్లాగిల్లును కూడా సరిక్రొత్తగా డిజైన్ చేసి కనీసం నెలరోజుల టపాలు డేటాబేస్ లో ఉండే ఏర్పాటు చేస్తున్నాను . ఏది నెలరోజులకు ఓసారి బ్లాగులను చూసేవారికి ఉపయోగకరంగా ఉండవచ్చు.

14 comments:

  1. పాత నీరు పోతుంది , కొత్త నీరు రావడం లేదు .
    రాసేవాళ్ళకి ప్రోత్సాహం లేదు, ఎక్కడ ప్రోత్సాహం ఉంటె అక్కడకి వెళ్ళిపోతున్నారు , ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్స్ .
    ఫేస్బుక్ లో dislike బటన్ వచ్చిన తరువాత మళ్ళి తిరిగి ఇక్కడకి వస్తారేమో చూద్దాం

    ReplyDelete
  2. చిరు హాస్యముల జల్లు సేద దీర్చెడు చోట



    వికటాట్ట హాసాలు వీను లదిరె



    సంస్కార విలసిత చర్చ లుండెడు చోట



    రఛ్చలు రావిళ్లు వచ్చి చేరె



    పులకించి రచనల ప్రోత్సహించెడు చోట



    తిలకించు వారేరి ? తీరు మారె



    కుల గజ్జి , ప్రాంతీయ కొట్లాటతో నిండి



    తెలుగు సౌహార్దాలు నలిగి పోయె







    వెరసి పిడికెడు గొంతుకల్ వెరపు దక్కి



    తెలుగు బ్లాగుల పూదోట తెంచి పోసి



    మించి తాజెడ్డ కోతి ... సామెత చరించ



    నిన్న మొన్నటి సౌరులు నేడు కనవు .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల గారూ , కామెంటినందుకు ధన్యవాదాలు

      Delete
    2. మీరు చెప్పినట్టు తెలుగు బ్లాగులు చూసేవారు కరువయిపోయారు.
      తెలుగంటే నవయువతకు తేలుకాటు
      ఆంగ్లమన్న వారికి హాయిమాటు
      మెలమెల్లగా తెలుగు మాయమవ్వు
      ఆడంబరముతో ఆంగ్లమధికమవ్వు

      Delete
  3. తెలుగు బ్లాగులు అంతరించిపోతున్న దశలో మీరు తీసుకుంటున్న శ్రమ సత్పలితాలివ్వాలని

    ReplyDelete
    Replies
    1. @Ruttala Satyanarayana గారు , కృతజ్ఞతలు

      Delete
  4. పాత నీరు పోతోంది, కొత్త నీరు రావడం లేదు. చెత్త నీరు వస్తోంది.
    వ్యక్తిగత బ్లాగులని, వాటి వ్యాఖ్యలని మిగతా రొటీన్, మసాలా, గాసిప్, వార్తా బ్లాగులనుండి, వెబ్ పత్రికల నుండి వేరు చేసి ప్రత్యేకంగా సంకలినులు చూపిస్తేనే మంచి బ్లాగులు చదువరుల కంటపడతాయి.

    కూడలి 100ని ఎప్పుడు అప్‌డేట్ చేసారో కాని, ఈ మధ్య అందులో రోజుకో టపా కూడా రావడం లేదు.

    ReplyDelete
  5. బాగా చెప్పారు, బోనగిరిగారూ. మీరు చెప్పిన కారణం వల్లే నా బ్లాగులను కూడలి నుంచి తొలగించాను. రూమర్లు, పార్టీ పంథాలు, సినిమా చెత్త వ్రాసే బ్లాగులు/వెబ్ సైట్ల మధ్య నా బ్లాగు కనపడటం ఇష్టం లేక కూడలి నుంచి వైదోలిగాను. ఇదివరకు కూడలి చూడని రోజు లేదు, రోజుకు రెండు మూడుసార్లు చూసే అలవాటు. ఇప్పుడు చూసే అలవాటు పూర్తిగా పోయింది. కూడలి మొదట్లో చక్కగా ఉండేది. కినిగే వారి చేతిలోకి వచ్చినాక చెడిందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏమున్నది! అన్నీ లింకుల బ్లాగులు అంటే బ్లాగుగా వాళ్ళేమీ వ్రాయరు, వ్రాసిన శీర్షిక చూసి వెడితే అక్కడే మరొక లింకు అక్కడనుంచి ఒక వ్యాపార వెబ్ సైటుకు దారి. బ్లాగులను ఈ విధంగా తమ వెబ్ సైటులకు దారి వెయ్యటానికి వాడుకుంటున్నారు. , లేదంటే సమస్యా పూర్ణాల బ్లాగులు. విసుగెత్తి హాయిగా ఫేసు బుక్కులో వ్రాసుకుంటున్నాను. పాత అలవాటు మానలేక, ఎప్పుడన్నా నా బ్లాగులో వ్రాస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. @bonagiri గారు, @SIVARAMAPRASAD KAPPAGANTU గారు మీ ఆవేదన అర్ధం అయింది. దీనికి నాకు ఓ పరిష్కారం తోస్తున్నది "కూడలి100" లాంటిదే బ్లాగిల్లు టాప్ ఉండేది . దాన్ని పునరుద్దరించాలని ఉంది .దీనికి బ్లాగర్ల నుండే వారికి నచ్చిన కొన్ని బ్లాగులను ఆహ్వానించదలిచాను . అవన్నీ ఆ విభాగంలో కలపాలని నిర్ణయం ! నా ఆలోచన ఎలా ఉంటుందంటారు ?

      Delete
    2. టాప్ 100 వల్ల ఉపయోగం లేదు మాష్టారూ. టాప్ నిర్ణయించటమే కష్టం, పైగా ఆ నిర్ణయమే వివాదాలకు మూలం కావచ్చు. మీ దగ్గర నమోదు చేసుకున్న బ్లాగులు అన్నీ, అక్షర క్రమంలో కనపడే విభాగం ఒకటి ఏర్పరచండి. అందులోకి వెళ్ళి ఒక్కొక్క బ్లాగు చూసుకుంటూ ఆయా బ్లాగర్లు వ్రాసిన వ్యాసాలూ ఎప్పటివైనా సరే, చదువుకోవచ్చు.

      Delete
  6. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చదివిన తరువాత బ్లాగ్ లకి వస్తే ఇక్కడ కూడా అవే వార్తలు కనబడుతున్నాయి .
    ఇక్కడ పెద్ద చదవడానికి ఏమి లేవు . పేపర్ లలో పడిన దాన్ని తీసుకుని బ్లాగుల్లో పేస్టు చేసి ఎందుకు వదులుతున్నారో అర్ధం కావడం లేదు .
    కనీసం ఇంగ్లీష్ పేపర్ లోవి , మనకి తెలియని పేపర్ లు ( వేరే భాష ) లోవి అనువాదం చేసి ఇచ్చినా ఒక అర్ధం ఉంది .
    మక్కి మక్కీ గా కాపీ చేసేస్తున్నారు . పోనీ ఎడిటోరియల్ లాంటివి కాపీ చేసి చర్చ కి వీలు కలిపిస్తే ఒక అర్ధం ఉంటుంది . కొన్ని సైట్స్ లో అయితే వైరస్ అని చూపిస్తుంది క్రోమ్ లో . ఇలాంటివి ఎందుకు బ్లాక్ చేయలేకపోయినా కనీసం వాటికి వేరే సెక్షన్ కేటాయిస్తే , మనకి కావలసినవి చదవడానికి వీలుగా ఉంటుంది .
    సంకలిని లు అన్ని వార్తల సైట్స్ లా కనిపిస్తున్నాయి
    :venkat

    ReplyDelete
  7. chalamaanthiki telugu lo blog rayachanu ani theliyathu.
    telugu lo chakkakaa chadavatam, rayadam thelisunte salu.
    intlo internet connection unde chakkaka rayachunu.
    anni undi rayadam lethu okkaru. karanam emitti?
    society lo blog mitha awareness lethu.
    this is the right time to bring awareness in people.

    i was born in tirupati. by birth i am blind. mother tongue is telugu.
    due to doctor advice i was joined special school in chennai.
    upto +2 i studied in chennai and learn tamil and my instruction language was tamil.
    after return to my home town (tirupati) i did my ug and pg here.
    in between one fine day i started writing tamil blog.
    later i try to find out telugu blogs, i was shocked.
    i think first i visited kudali aggregater. it was filled with copy paste posts there.
    slowly i find good blogs and start follow them.
    but compare to tamil blogs telugu blogs outdated.

    so friends,
    please bring awareness in people.

    ---
    happy to see your post.


    sorry for my language.

    now i am learning how to type in telugu font.
    ---

    mahesh
    tirupati

    ReplyDelete
  8. శ్రీనివాస్ గారూ!
    మీరు చాలా కష్టపడుతున్నారు, అందులో అనుమానం లేదు. కొత్త బ్లాగిల్లు కూడా మీ వీలు కుదిరినంతలలో బాగానే ఉంది. ఇక కోరికలంటారా? గుఱ్ఱాలే :)
    మరింతకంటే కదిలించద్దు. శలవు.

    ReplyDelete

hit counter