గత రెండురోజుల క్రితం వెలువడిన "తెలుగు బ్లాగుల డైరెక్టరీ" అనే విభాగం కొన్ని లోపాలు ఉన్నా అందరి ప్రశంసలు పొందింది . కపగంతు శివరామ ప్రసాద్ గారి సూచనతో రూపుదిద్దుకున్న ఈ డైరెక్టరీ ముందు ముందు అనేక క్రొత్త ఫీచర్స్ తో సవరించబడుతుంది . తెలుగు బ్లాగుల వైభవానికి, అభివృద్దికి "బ్లాగిల్లు" తన తోడ్పాటును ఎల్లప్పుడూ అందిస్తుంది. వీక్షకుల, విజ్ఞుల సూచనలకు, సలహాలకు స్పందించడానికి ఎప్పుడూ తయారుగా ఉంటుంది .
ఈ దైరేక్తరీపై గౌ॥ శ్యామలీయం గారు తన ప్రశంసలు అందజేస్తూ కొన్ని సూచనలు అందించారు. ఈ డైరెక్టరీ యొక్క బటన్ అందించమని అది బ్లాగర్లు తమతమ బ్లాగులలో ప్రదర్శించడానికి తద్వారా డైరెక్టరీ అందరి ఆదరణా పొందుతుంది అన్నారు .వారి సూచన పాటిస్తున్నాం. ఇక బ్లాగర్ల డైరెక్టరీ కూడా పరిశీలించండి అన్నారు. ఇది చేయాలంటే బ్లాగర్లు తమ తమ వివరాలు , బ్లాగులు పంపవలసి ఉంటుంది. అందరూ దీనికి సహకరిస్తారా అనేది ప్రశ్న! పాత బ్లాగర్లు, బ్లాగింగ్ వదిలేసిన వారు తమ వివరాలు అందించలేరు. దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాం.
మరో ముఖ్యమైన విషయం - బ్లాగిల్లు ముందు ముందు బ్లాగర్ల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిద్దామని అనుకుంటుంది . వాటికోసం మీవంతు తోడ్పాటు అందిస్తే మరింత నైపుణ్యంగా, వేగంగా నిర్వహించడానికి వీలవుతుంది . ఆర్ధికంగా బ్లాగిల్లుకు సహకరించడానికి ప్రతీ ఒక్కరూ క్రింది విధాలుగా తోడ్పడవచ్చు .
1. బ్లాగిల్లులో ప్రకటనల ద్వారా - ( ప్రకటనల వివరాలకు మెయిల్ చేయగలరు )
2. మనలో చాలామంది ఆన్లైన్ ద్వారా అంటే Flipkart, Amazon, SnapDeal ల ద్వారా ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుంటారు. ఆయా వెబ్సైట్ లో కొనేటప్పుడు బ్లాగిల్లు వబ్సైట్ లో సైడ్ బార్ లో ఉన్న ప్రకటనల ద్వారా వెళ్లి కొంటే మీకు ఏమీ అధికంగా ఖర్చు కాకపోయినా బ్లాగిల్లుకు కొంత ధనం (Affiliate Amount) వస్తుంది. దాన్ని బ్లాగుల అభివృద్దికి కేటాయించవచ్చు.
ఆలోచిస్తారని ఆశిస్తూ
మీ కృషి అభినందనీయం !
ReplyDeleteHi everyone here is the website that provides complete information about Political and Movie news, live videos, images, breaking news..., moreupdates
ReplyDelete