గూగుల్ కోడ్ ప్రోజెక్ట్ లో అప్డేట్ నిలిపివేసింది. త్వరలో కోడ్ ప్రోజెక్ట్ మూతపడబోతోందట . ఈ నిర్ణయంతో గూగుల్ కోడ్ ప్రోజెక్ట్ లో జావా స్క్రిప్టులు హోస్టింగ్ చేసి ఉన్న అనేక బ్లాగులు ప్రభావితం కాబోతున్నాయి.
అయితే బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగుల బొత్తాలను ( విడ్జెట్స్ ) ఈ కోడ్ ప్రోజెక్ట్ లో హోస్టింగ్ చేయడం జరిగింది. కనుక గూగుల్ తీసుకున్న నిర్ణయం ప్రభావం "బ్లాగిల్లు" పై కూడా పడింది .
ప్రస్తుతం ఆయా బ్లాగుల్లో ఉన్న ఉత్తమ తెలుగు బ్లాగులు బొత్తాల ఆధునీకరణ నిలిచిపోయింది. ఇమేజ్ లను దాయడానికి మరో ఉచిత హోస్ట్ సర్వీసు వెతకవలసిన అవసరం ఏర్పడింది .
అప్పటి వరకూ ఆయా బ్లాగుల ర్యాంకులను కేవలం వెబ్ సైట్ లో మాత్రమే నవీకరించగలం.
No comments:
Post a Comment