బ్లాగిల్లు యొక్క 'ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం' ఈ రోజు ఆధునీకరించబడింది. ఈరోజుకి 206 బ్లాగులు ఈ విభాగంలో జోడించగా మరో 14 బ్లాగులు అనుమతికై వేచి ఉన్నాయి . చెప్పాలంటే రమారమీ రోజుకో బ్లాగు ఈ విభాగంలో అనుమతి కోరుతోంది. ర్యాంకుల ఎంపికలో పారదర్శకంగా ఉండేందుకు అనేక నూతన విధానాలను ఎప్పటికప్పుడు మారుస్తోనే ఉంది బ్లాగిల్లు . ఈ మధ్యనే ప్రవేశపెట్టబడిన క్రొత్త విధానం ప్రకారం ర్యాంకుల కోడింగ్ మొత్తాన్ని గూగుల్ డ్రైవ్ లో హోస్ట్ చేయడం జరిగింది. దీనికి అనేక స్క్రిప్తుల నుంచి లింక్ చేయడం ద్వారా ర్యాంకుల ఆధునీకరణ ఎప్పటికప్పుడు లైవ్ లొనే మారుతూ ఉంటుంది . ఈ మారే స్కోర్ ను బ్లాగిల్లు వెబ్ సైట్ లో చూపడం కష్టం కాదు కానీ విడ్జెట్ లపై ఆధునీకరణ రోజు రోజుకీ కష్టసాధ్యంగా మారుతూ ఉంది . ప్రస్తుతం ఉన్న విడ్జెట్ లు గూగుల్ కోడ్ లో ఇమేజ్ ల రూపంలో హోస్ట్ చేయబడి ఉన్నాయి . ర్యాంకు మార్పుచేయాలనుకున్న ప్రతీసారీ ఆయా ర్యాంక్ బొత్తాలపై మార్పుచేసి తిరిగి అప్లోడ్ చేయాల్సి వస్తున్నది. 200 బొత్తాలకు మార్పులు చేయడం అంటే మాటలా ! అందుకే దీనిలో మార్పులు చేయాలనుకుంటున్నాను.
నేను తీసుకోవాలనుకుంటున్న కొన్ని నిర్ణయాలు :
1. 100 ర్యాంకులకు మాత్రం ఆధునీరరణ చేసి మిగతా వాటిపై " సభ్యుడు " అనే బొత్తాం మాత్రం ఉంచడం .
2. ప్రతీ ఆదివారం బ్లాగిల్లు లో మాత్రం ర్యాంకుల ఆధునీకరణ చేసి , బొత్తాలపై నెలకు ఓ సారి చేయడం .
3. బొత్తాలపై స్కోర్ చూపాలా ర్యాంకులు చూపాలా అనే విషయం ఆలోచిస్తున్నాను .
పై ఆలోచనలపై మీ సలహాలు తెలుపగలరు .
No comments:
Post a Comment