"కష్టే ఫలే" శర్మగారు మా గృహానికి విచ్చేసారు : నా అనుభూతి

   ప్రతీవ్యక్తికీ జీవితంలో మరిచిపోలేని రోజులంటూ కొన్ని ఉంటాయి . రోజులు గడిచేకొద్దీ వాటి సంఖ్య పెరుగుతూ  వస్తుంది . ఎంతపెరిగినా వాటి వేళ్ళతో గుర్తుపెట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. అటువంటి రోజు నా జీవితంలో ఒకటి కలిసింది . 
    "కష్టేఫలే శర్మ" గారి గురించి తెలియనివారు తెలుగు బ్లాగు లోకంలో ఉండరు .. ఆ శర్మగారు నిన్న మా గృహానికి విచ్చేసారు. ఆనందం కాదూ ... శర్మగారి గురించి బ్లాగుల ద్వారా మనకు తెలుస్తున్నది అణువంత అని నాకు ఆయన రాక ద్వారా అర్ధమైంది... ఆయన నేటి తరానికి ఒక సాంస్కృతిక వారధి అని చెప్పవచ్చు . ఎటువంటి వారినైనా , ఎటువంటి విషయాన్నైనా తన జ్ఞానంతో చక్కగా వివరించగల అద్భుత వ్యక్తి ... ఆధ్యాత్మిక , సంస్కృతీ సాంప్రదాయ విషయాలలో ఆయన పరిజ్ఞానం అపారం ...
  అటువంటి శర్మగారు మా గృహాన్ని పావనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను . ఆయన మాతో గడిపింది దాదాపు ఒక గంట మాత్రమె ఆయినా ఆ గంటలోనే ఎన్నో సంగతులు ఆయనద్వారా తెలుకోగలిగాం.
   మనిషి ఆశకు అంతు  ఉండదుకదా అందుకే ఇలా ఆశ  పడుతున్నాను .. " శర్మ గారు మరికొద్ది  కొద్ది గంటలు ఉండి ఉంటే మరిన్ని మంచి విషయాలు మాకు తెల్సుకునే అవకాశం కలిగేది." అని . 
 ఆయన రాకతో మామ్ములను ఆనంద పరచినందుకు శర్మ గారికి బ్లాగుముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. .

3 comments:

  1. చాలా సంతోషం. అభినందనలు వారి సాంగత్యంతొ కొంత కాలం గడపగలిగినందుకు సత్సంగత్వే ,,, అని కదా అర్యోక్తి.
    మీరు దగ్గరగా ఉండి ఉంటారు కాబట్టి మీకు అదృష్టయోగం పట్టిందనుకుంటాను.
    మాబోటివారిని ఎవరైనా పెద్దవారు ఎప్పుడైనా తలచుకుంటే, అదే మాకు పదివేలు.

    ReplyDelete
    Replies
    1. నిజమే సార్ ! ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మిమ్మల్ని కూడా కలవాలని ఉంది .

      Delete
  2. ఈ మద్యనే బ్లాగు మొదలుపెట్టిన నేను ఎప్పటినుండో శర్మగారి బ్లాగులు చదువుతూ వస్తున్నా. అంత పెద్దవారు, అన్ని మంచి విషయాలు ఆద్యాత్మికమైనవి, సాంస్క్రుతికపరమైనవి తెలియచేస్తుంటే అలాంటివారిని కలిస్తే ఇంక ఎన్ని మంచి విషయాలు తెలుస్తాయో కదా అని అనిపిస్తుంది. సమయం కొంచెం ఐనా వారి రాకే అద్రుష్టమనుకోవాలి. మాలాంటి వారికి బ్లాగులో వారి టపాలు చదవటమే భాగ్యం.

    ReplyDelete

hit counter