గూగుల్ ఇటీవలే తెలుగు బ్లాగులకు వెబ్ సైట్లకు యాడ్ సెన్స్ సదుపాయం కల్పించగానే మళ్ళీ తెలుగు బ్లాగులు ఓ వెలుగు వెలుగుతాయి అని అనిపిస్తుంది.
ఒకవిధంగా చెప్పాలంటే యూట్యూబ్ కంటే బ్లాగులతోనే ఆదాయం ఎక్కువ.
మీ బ్లాగుకు యాడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించాలంటే ఎలా ?
ఇప్పుడు అందరి మదిలో ఇదే ఆలోచన.
దీనికి ముందుగా కావాల్సిన అర్హతలు :
మీ బ్లాగుకు రోజుకు కనీసం వందమంది వరకూ వీక్షకులు వచ్చ్చేలా చేసుకోవడం ..
సొంతంగా రచనలు చేయడం ( గూగుల్ తెలుగుకు యాడ్స్ సదుపాయం కల్పించిన తర్వాత కాపీరైట్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.కనుక ఎక్కడా కాపీ కొట్టకండి.
వ్రాసేది ఏ అంశమైనా కావచ్చు. కాబితాలు, కథలు, వంటలు, వార్తలూ ఇలా ...
సంకలినులలో (మాలిక ,శోధిని ) మీ బ్లాగును తప్పక కలుపుకోండి. ఇలా అయితే వీక్షకులు బాగా వస్తారు.
మీ బ్లాగు క్రొత్తది కాకుండా .. సాధ్యమైనంత పాతది ఎంచుకోండి ..
ప్రతీ దినం ఎదో ఒక పోస్టు వ్రాస్తూ ఉండండి ..
ఇక మీ బ్లాగుకు contact page, Privacy policy page ఉండేలా చూసుకోండి ..
ఒక మాట మీ బ్లాగులు wordpress.com లో కాకుండా blogspot లో ఉండాలి.
మీ డాష్ బోర్డు లో క్రింది విధంగా ఉంటుంది చూసారా ?
మిగతా వివరాలు మళ్ళీ ఒకసారి చెపుతాను .. మీకు ఏవైనా సందేహాలుంటే క్రింద కామెంట్స్ లో అడగండి
మంచి సమాచారం !!!
ReplyDeleteమంచి సమాచారం ఇచ్చారు. కాని ఇటీవలే నేను adsence కి కనెక్ట్ చేద్దామని చూస్తే డొమైన్ ఉండాలని వచ్చింది. దీని గురించి మరికొంత సమాచారం ఇవ్వగలరు.
ReplyDeletewww.vijayamavuru.blogspot.com
అవును.. మీరన్నది కరెక్టే .. ఒక .com, .in లాంటి hosted Domain ఉండాలి. అయితే దాన్ని మీ blog కు కలుపుకోవడం కష్టమేమీ కాదు. Godaddy, bigrock లాంటి వెబ్సైట్లలో డొమైన్ కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు రెండుమూడు బ్లాగులు ఉన్నాయనుకోండి. ఒక బ్లాగుకు డొమైన్ ఉంటె సరిపోతుంది. Adsense అనుమతి వచ్చాక ఆ బ్లాగుల్లో కూడా అడ్స్ పెట్టుకోవచ్చు.
Delete