ఈమధ్య ఫలానా బ్లాగును శోధిని నుంచి తొలగించండి అని వ్రాసేవారి సంఖ్య పెరిగింది. అందుకే ఈ బ్లాగు పోస్టు -
బ్లాగు అనేది ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఉన్న ఒక మాధ్యమం. తన అభిప్రాయాలలో చెప్పింది నచ్చకపోతే కామెంట్ల రూపంలో అతనితో వాదించవచ్చు . ఆ అవకాశం మీకు ఉంటుంది . లేదా మీ బ్లాగులో మరో టపా పెట్టి ఖండించవచ్చుఁ .
అంతేకానీ ఆ బ్లాగును తొలగించాలనడం వాదించలేని మీ బలహీనతను సూచిస్తుంది.
మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న బ్లాగులను
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న బ్లాగులు
చట్టాలను ధిక్కరిస్తున్న బ్లాగులు
పరమత దూషణా బ్లాగులు
అసభ్య / పోర్న్ బ్లాగులు
ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పదే పదే దూషిస్తున్న బ్లాగులు ***
పూర్తిగా ఆంగ్లం లోనే ఉన్న బ్లాగులు
కనుక అటువంటి బ్లాగులు ఏమైనా శోధినిలో కనపడితే మాత్రం చెప్పండి ..
వ్యక్తిగత కోపాన్ని బ్లాగులపై రుద్దకండి
*** ఈ పాయింట్ కు స్పష్టమైన కారణం దొరకట్లేదు
బ్లాగు అనేది ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఉన్న ఒక మాధ్యమం. తన అభిప్రాయాలలో చెప్పింది నచ్చకపోతే కామెంట్ల రూపంలో అతనితో వాదించవచ్చు . ఆ అవకాశం మీకు ఉంటుంది . లేదా మీ బ్లాగులో మరో టపా పెట్టి ఖండించవచ్చుఁ .
అంతేకానీ ఆ బ్లాగును తొలగించాలనడం వాదించలేని మీ బలహీనతను సూచిస్తుంది.
అయితే ఎటువంటి బ్లాగులను తొలగించాలని కొరవచ్చు?
మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న బ్లాగులను
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న బ్లాగులు
చట్టాలను ధిక్కరిస్తున్న బ్లాగులు
పరమత దూషణా బ్లాగులు
అసభ్య / పోర్న్ బ్లాగులు
పూర్తిగా ఆంగ్లం లోనే ఉన్న బ్లాగులు
కనుక అటువంటి బ్లాగులు ఏమైనా శోధినిలో కనపడితే మాత్రం చెప్పండి ..
వ్యక్తిగత కోపాన్ని బ్లాగులపై రుద్దకండి
ఈ శోధిని మీది ... మనందరిదీ !
*** ఈ పాయింట్ కు స్పష్టమైన కారణం దొరకట్లేదు
ReplyDeleteఒక వ్యక్తికి వ్యతిరేకంగా పదే పదే దూషిస్తున్న బ్లాగులు
ఈ ఒక్క వారం లో ఈ లాంటి రెండు మూడు బ్లాగులు కనబడ్డా యండి
పేరులు చెప్ప మంటా రా :)
జిలేబి
తన టపాల్లో ఇంగ్లీషు బూతు పదాలు తరచుగా వాడుతుండే బ్లాగ్ కూడా ఒకటి ఉంది కదా జిలేబి గారూ. ఆ సంగతి తెలిస్తే ఆ బ్లాగర్ మీద కూడా తిట్లకి లంకించుకునే వారుంటారేమో? (అన్నట్లు ఆ బ్లాగ్ లో టపా పోస్ట్ చేసిన తరవాత ఒకటి రెండు రోజులు మాత్రమే బ్లాగ్ లో కనపిస్తుంది, అదేవిటో ! )
Delete@విన్నకోట,
Deleteమీరు ధైర్యంగా బ్లాగు పేరు చెప్పమనే కదా ఆయన అడిగారు? మీరు బ్లాగు పేరు చెప్పండి దానిని తీసేయాలో ఉంచాలో శ్రీనివాస్ గారు చూసుకుంటారు. అవకాశం ఇచ్చినపుడు వాడుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణ పాలనకు మంచిది...ప్రజలకూ మంచిదే ! ఎంతమంది పాలకులకు(అగ్రిగేటర్ లకు)ప్రజాభిప్రాయం సేకరించే ధైర్యం ఉంటుంది ?
నా "ఖర్మ" కొద్దీ తెలుగులో బూతులు వ్రాయవలసి వచ్చింది...ఇక ఇంగ్లీష్ లో కూడా వ్రాసేవారున్నారా?
@విన్నకోట,
Delete@విన్నకోట,
మిమ్మల్ని చూస్తుంటే అసలు బ్లాగ్ అంటూ ఉండాలా అనిపిస్తుందండీ ! ఎంచక్కా ఎవరో ఒకరు వ్రాసిన దానికి, మనం చిన్నగా కమెంట్ పెడితే చాలు. అగ్గి రేగుతుంది. ఏంటో అంతా విష్ణుమాయ !
@Zilebi
Deleteచెప్పడానికి భయపడేవారు "సంప్రదింపులు" పేజీ ద్వారా చెప్పొచ్చు.
పైన Oct 17న నేను వ్రాసిన వ్యాఖ్యకు వివరణ అవసరమనిపించింది.
Deleteనా వ్యాఖ్యలో focus - ఓ బ్లాగ్ లో ఉదహరించిన సామెత గురించి (by the way సామెత మాత్రమే చెప్పబడింది; ఆ బ్లాగర్ స్వయానా బూతులు మాటాడలేదు) బూతులు...బూతులు అంటూ ఎవరో చెవులు మూసుకుంటే, తన టపాలలో ఆంగ్ల బూతుపదాలు రెగ్యులర్ గా చొప్పించే బ్లాగొకటి కూడా ఉంది అని చెప్పడం వరకే. ఆ బ్లాగ్ ని తొలగించండి అని సూచించాలనుకుంటే ఆ మాట చెప్పడానికి ధైర్యానికేమీ లోటు లేదు.
కలహభోజిని జిలేబీ గారి బ్లాగు లో ఎవరో ఒకరిమీద సెటైర్ లు వేస్తూ ఉంటారు. చాలామంది చాలా సార్లు చెప్పినా ఆవిడ ధోరణి మారలేదు మారదు కూడా...అగ్రహారంలో ఆవిడని నర్తించనివ్వండి చూసేవాళ్ళకు వినోదం ఉండాలి కదా ?
ReplyDeleteశోధిని లో ఆవిడ బ్లాగు ఉండడం వల్ల ఎటువంటి నష్టము లేదు. మీరు కమెంట్స్ ప్రవేశపెడితే తప్ప మీ శోధినికి ఎటువంటి నష్టమూ వాటిల్లదని అనుకుంటున్నాను. భవిష్యత్తులో మీకు ఎపుడైనా ఎవరి బ్లాగునైనా తీసేయాలని అనిపిస్తే శుక్రవారం కాకుండా చూసుకోండి. శుక్రవారం సెంటిమెంట్ కదా ? మెయిల్ పెట్టి చెప్పి మరీ తీయాలి ! ఎందుకంటే మెయిల్ లోనే అడిగి మరీ మీ అగ్రిగేటర్ లోకి వస్తాము కదా ? ఫలానా కారణానికి మిమ్మల్ని తీసేస్తున్నాము అని చెప్పాలి ! ఏదీ చెప్పకుండా (ఆంధ్రావాళ్ళని పొమ్మన్నట్లు) తీసేస్తే ఎందుకు తీసారో ఎలా తెలుస్తుంది? ఎటువంటి కంటెంట్ వ్రాయాలో మీరు మాకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు కదా ?
మీరు ఒకటి గమనించారా? శోధినిలో కామెంట్స్ సెక్షన్ తీసేసాక బ్లాగుల్లో కామెంట్స్ రావడం తగ్గాయో ఏమో .. రెంద్రోజులనుండి మాలికలో కామేట్లు క్రిందికి జరగడమే లేదు
Deleteఅగ్రిగేటర్ లో బ్లాగు ను చేర్చుకున్నాక కూడా, ఏ ప్రాతిపదికన ఆ బ్లాగును చేర్చుకున్నారో, ఆ నిబంధనలకు ఇంకా ఆ బ్లాగు కట్టుబడే ఉన్నదా లేదా అనే దానిని బట్టి, ఇంకా ఆబ్లాగును అగ్రిగేటర్ లో కొనసాగించాలా వద్దా అని అగ్రిగేటర్ నిర్ణయించుకోవచ్చు. ఈ మెయిల్ వార్నింగ్ లాంటిది ఇచ్చి తీసేయచ్చు.ఎందుకంటే మెయిల్ లోనే అడిగి మరీ మీ అగ్రిగేటర్ లోకి వస్తారు కదా బ్లాగర్లు.
ReplyDeleteకానీ అగ్రిగేటర్లు అన్ని బ్లాగులనూ యాక్టివ్ గా చదువుతూ/ఫాలో అవుతూ ఉండడం కుదరదేమో.
అసలు మీరు ఏం అర్ధం చేసుకున్నారండీ...బ్లాగర్లను రోజూ ఫాలో అవడం కుదరకే గదా ఈ పోస్ట్ పెట్టారు ? ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి గానీ తరువాత గోలపెడితే లాభం ఉండదు. జీవితంలో అవకాశం/అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుంది.
Deleteఎనిమిదేళ్ళక్రితం కూడలిలో పెట్టిన ఇటువంటి పోస్టే మాలిక పుట్టడానికి ఒక కారణమైంది. చూద్దాం ఇప్పుడింకొక ఏగ్రిగేటర్ పుట్టుకొస్తుందేమో :)
ReplyDelete"రమ్యంగా కుటీరాన" మాలిక నుండి ఎందుకు తొలగించారో చెప్పగలరా ?
Deleteశ్రీనివాస్ గారు...నా బ్లాగ్ అక్కడికి ఎలా వచ్చిందో అలానే పోయింది...కారణాలు అడక్కండి. నేను సత్ప్రవర్తన అలవరుచుకుని క్షమా భిక్ష మెయిల్ వ్రాస్తే తిరిగి చేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. ఇప్పట్లో నాకు వ్రాసే ఉద్దేశ్యం లేదు. నాకసలు కుదురుగా ఉండడమే సాధ్యం కావడం లేదు. మీరు రాష్ట్రపతి తరహాలో సిఫర్సులూ గట్రా చేయకండి.
Deleteనేను అడిగింది మిమ్మల్ని కాదు .. "మాలిక" ఓనర్ గారిని
Delete"రమ్యంగా కుటీరాన" తొలగించమని నాకూ మెయిల్స్ వచ్చాయి
Deleteశ్రీనివాస్ గారూ,
Deleteరమ్యంగా కుటీరాన బ్లాగ్ తీసివేయమనడానికి కారణం చెప్పారా ? మీరు కారణం చెపితే నన్ను నేను సరిదిద్దుకోవడమో లేక శోధిని ని వీడి వెళ్ళిపోవడమో నిర్ణయించుకోగలను. అసలే రేపట్నుంచీ కార్తీక పురాణం చెపుదామని మీ వ్యాఖ్య చూసాక డిసైడ్ అయ్యాను. మంచిగా చెపితే నేను తప్పక వింటాను. బలవంతంగా అతి చేస్తే నన్ను ఆపడం ఎవరి తరమూ కాదు.
ఎవరు ఏ కారణం చెప్పినా సహేతుకంగా ఉండాలికదా .. మీరు కార్తీక పురాణం చెప్పడానికి రడీ ఐపోండి..
Deleteకంప్లైంట్ ఆధారం గా కాక , నిజ నిర్ధారణ చేసుకుని, బ్లాగరు కి చెప్పి అప్పుడు తీయటం కరెక్టు.
Deleteనాకూ మెయిల్స్ వచ్చాయి
ReplyDelete_____________________
For the same reason. We didn't act upon the complaints for a long time, but we ultimately had to act.
మీరే కదా అన్నారు కూడలి పెట్టిన ఇలాంటి restrictions వల్ల మాలిక పుట్టిందని .. మరి మీరు కూడా అల్లాగే చేస్తే ఎలా?
DeleteRestrictions? What restrictions? Koodali didnt restrict anyone.
Deleteనేనన్నది కూడలి పెట్టిన అభిప్రాయ సేకరణ పోస్ట్ గురించి. They always had their right to take their decisions
And if a new aggregator comes up, I would be the first one to welcome it!
When we take a decision, we take it - period! So far, I dont remember a single instance wherein we went for a survey. When we deleted something, we did it with minimum noise, mostly for informational purposes :)
Deleteఎనిమిదేళ్ళక్రితం కూడలిలో పెట్టిన ఇటువంటి పోస్టే మాలిక పుట్టడానికి ఒక కారణమైంది.
Delete----------------
హరిబాబు గారు అన్నట్లు ఏ విషయం నాకు ఓ పట్టాన అర్ధంకాదు అనుకుంటా :)
శోధినిలో ఏ బ్లాగునూ పైన చెప్పిన కారణాల్లో ఏ కారణం లేకుండా తొలగించలేను అనేది నా అభిప్రాయం. ఒక బ్లాగుపై కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. ఐతే దానిని వారు పై కారణాలతో పోల్చి చూసుకోవాలి అనేది ఈ పోస్టు ఉద్దేశ్యం.
నాకు తెలీక అడుగున్నాను ఏమీ అనుకోపోతేనే సమాధానం చెప్పండి. కూడలి కొందరి బ్లాగుల్ని అకారణంగా తొలగించడం వల్లనే మాలిక పుట్టిందని మీరు అప్పుడు చెప్పినట్లు గుర్తు. సరిగా వివరించగలరు
మొదట్నుంచీ శోధిని చిన్న మార్పు చేయాలన్నా, చేసినా ఈ బ్లాగు ద్వారా అభిప్రాయ సేకరణ జరుపుతూనే ఉంది... గమనించగలరు.. ఎందుకంటే బ్లాగిల్లు/శోధిని నాది అని నేను ఎప్పుడూ అనుకోలేదు.
Deleteకూడలి కొందరి బ్లాగుల్ని అకారణంగా తొలగించడం వల్లనే మాలిక పుట్టిందని
Delete---------------------------------------------------------
No, no. They wanted to remove the blogs, put up a poll and made a big scene out of it. In the end, people said NO and they retained the blogs. However, that hungama made us realize the ground reality and start Maalika.
Had they removed our blogs silently, we might have just moved over to Haaram or Jalleda. But the noise they made really inspired us to start a new aggregator and Sreenu Vattipally developed the first prototype in 2 days!
నా బ్లాగుకి సంబంధించినంతవరకు, కూడలి ఉన్నపుడు అక్కడనుండి కనీసం వందమంది పైగా వచ్చేవారు. మాలిక నుండి అందులో సగం మంది వచ్చేవారు. శోధిని/బ్లాగిల్లు నుండి పది మంది వచ్చేవారు.
ReplyDeleteకూడలి మూతపడిన తరువాత మిగతా వాటి నుండి వచ్చేవాళ్ళ సంఖ్య పెద్దగా పెరగలేదు. అంటే కూడలి నుండి వచ్చేవాళ్ళు ఏమయిపోయారో తెలియదు. మొత్తం మీద కూడలి తరువాత బ్లాగు వీక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది.
పాతవాళ్ళకి బ్లాగులమీద అసక్తి తగ్గిపోయింది. కొత్త నీరు కూడ రావటంలేదు. ఫేస్‌బుక్, వాట్సప్ కారణం అయ్యుండవచ్చు.
అసలు బ్లాగు ప్రపంచం ఒకటుందనే విషయం నాకు కూడలి వల్లనే తెలిసింది. అలా బ్లాగులు చదువుతుండగానే నాకూ రాయాలనిపించి, నేను బ్లాగు రాయడానిక్కూడా పరోక్షం గా కూడలే కారణం.
DeleteMany of the bloggers moved over to Google Buzz/Plus and then to Facebook.
DeleteTo All,
ReplyDeleteMay the Divine Light of Diwali
Spread into your Life Peace,
Prosperity, Happiness and Good Health.
Happy Diwali !