మనదేశంలో హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలుగు మాట్లాడేవారు తారసపడతారు . తెలుగు మాతృభాషగా లేనివాళ్ళు కూడా తెలుగును నేర్చుకుని మరీ మాట్లాడుతున్నారు . చెన్నై, బెంగళూరు లలో అయితే దాదాపు 40-50% మందికి తెలుగు మాట్లాడ్డం వచ్చు. తెలంగాణా రాష్ట్ర విభజన జరిగినప్పుడు దేశంలో హిందీ తర్వాత తెలుగుకే రెండు రాష్ట్రాలు ఉన్నాయని, ఇక ఈ భాషకు తిరుగులేదని , పోటాపోటీగా రెండు రాష్ట్రాలూ తెలుగు భాషను ప్రోత్సహిస్తాయని అనుకున్న చాలామందిలో నేనూ ఉన్నాను . . అయితే ప్రస్తుతం తెలుగుకు పడుతున్న దుస్థితి చూస్తుంటే భవిష్యత్ లో తెలుగు భాష ఉంటుందా అనే అభిప్రాయం కలుగుతుంది నాకు. ఒకప్పుడు పాథశాల స్థాయిలోనే విద్యార్ధులు కధలు, కవితలు వ్రాసేవారు . వారే కాల క్రమేణా మంచి రచయితలుగా మారే అవకాశం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భవిష్యత్ లో తెలుగు సినీ పరిశ్రమకు కూడా పాటల రచయితలు దొరకక పోవచ్చేమో .
ఈ మధ్య తమిళనాడులో తెలుగు మీడియం పాఠశాలలు మూసివేయాలన్న ఆ ప్రభుత్వ నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా వ్యతిరేకత ఆయా ప్రభుత్వాల నుంచి రాలేదు .కటువుగా చెపుతున్నాననిపించవచ్చు గానీ కనీసం ఇక్కడి ప్రజలలో కూడా తెలుగు భాషపై మమకారం ఉన్నట్లు అనిపించడం లేదు . ఇంగ్లీషు మీడియంలో పిల్లలను చదివించడం తప్పు కాదు . రెండో మాధ్యమంగా సంస్కృతం, హిందీ లాంటి భాషలను ఎంచుకోవడం, ఇంట్లో గానీ స్నేహితులతో గానీ ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడడం , ఇంగ్లీష్, హిందీ చానల్స్ ఎక్కువగా చూడడం ఇవన్నీ తెలుగు పట్ల మనకున్న ఏ అభిప్రాయానికి చిహ్నాలు ?
అయితే ఇక్కడ ప్రజలవైపు నుంచి ఆలోచిస్తే వారు చెప్పే మాట - " తెలుగులో మాట్లాడితే జాబ్స్ రావు, ఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇంగ్లీష్, హిందీ తప్పనిసరి అని " వారు చెప్పేది సరైనదే ! ఈ అలోచన రాకుండా చర్యలు తీసుకోవలసినది ఇక్కడి ప్రభుత్వాలు. తెలుగును తప్పనిసరి చేయడం , తెలుగు భాష ప్రాధాన్యతగా పరీక్షా పత్రాల ముద్రణ ( ప్రస్తుతం ఏ ప్రభుత్వ పరీక్షలలోనైనా తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ప్రశ్నలు ముద్రిస్తున్నారు ) లాంటి చర్యలు తీసుకోవాలి . బాధాకరమైన విషయాలు ఏమిటంటే మన ఎమ్మెల్యేలు చాలమంది కూడా అసెంబ్లీల్లో ఇంగ్లీషులోనే ప్రసంగాలు చేయడం, పాథశాల/కళాశాల ఉత్సవాల్లో డ్యాన్స్ పోటీలకు ఇచ్చిన ప్రాధాన్యతలో పదోవంతు కనీసం తెలుగు కవితల, కధల పోటీలకూ ఇవ్వకపోవడం.
ఇవన్నీ ఏ విధంగానూ మంచి పరిణామాలు కావు. తెలుగుకు రానున్న ముప్పును గుర్తించి ఇప్పటికైనా మేధావులు, విజ్ఞులు తెలుగు భాష ప్రాముఖ్యత పెంచేలా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.

ఆయ్! దెబ్బలాటకూడా తెనుగులో ఉండటం లేదండి బాబూ! మనది కంఠశోషేనేమో
ReplyDeleteఆయ్ శర్మ గారు,
Deleteదెబ్బలాట చేయాలంటే తిట్టు కోవాలండి ! తిట్టి తెలుగుని తక్కువ చేయ లేమండి ! అందుకే 'ఎంగిలి' పీసు లో నే తిట్టు కునేదో ,దెబ్బలాడు కునేదో చేసుకుంటా మండీ ! :) ఆయ్ ! ఎంతైనా తెలుగు తల్లి కదండీ ! ఆ పాటి మర్యాద ఉండాలి మరి !
జిలేబి
ReplyDeleteఆ ఇంగిలి పీసు లేకుంటే ఇట్లా బ్లాగులు గట్రా తెలుగులో వ్రాయ గలిగి ఉండే వాళ్ళమా ?
జిలేబి
ఇది మీ లోకజ్ఞాన లేమిని చెప్తుంది ! కీబోర్డ్ ఇంగ్లీష్ లో ఉంటె తెలుగు టైపు చేయటానికి అదొక్కటే మార్గం అనుకోవటం అమాయకత్వం .చినీయులు, జపనేయులు వారి భాషనూ ఇంగ్లీషులో టైపు చేయరు . అక్కడిదాకా ఎందుకు నేను వాడేది స్విఫ్ట్ కీ , ఏ భాష అయినా తిన్నగా టైపు చేయవచ్చు ఇంగ్లీశుఇ అవసరం లేకుండా , వాడాలన్న కుతూహలమ్ ఉండాలి అంతే .
Deleteఆహా ఏమి పరిజ్ఞానము లోక జ్ఞానము :)
Deleteస్విఫ్ట్ కీ వెనుక ఏ భాష లో సాఫ్టు ఉన్నదో కొండ పైనున్న పెరుమాళ్ళ కే ఎరుక :
జేకే !
చీర్స్
జిలేబి
జిలేబీ గారూ ! ప్రపంచంతో నడవాలంటే ఇంగ్లీష్ అవసరం ఎంతైనా ఉంది అలా అని తెలుగు భాష కనుమరుగు అవ్వాలని కోరుకోకూడదు , కోరుకోము కదా దీనికి కనీస చర్యలు తీసుకోగలిగేవి ప్రభుత్వాలే అని నా ఉద్దేశ్యం .. దానికి మీరేమంటారు
ReplyDelete