ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ

ముందుగా తెలుగు బ్లాగర్లకు , బ్లాగుల వీక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.
బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ ఈరోజు జరిగింది . నిజానికి ఇది 25వ తేదీన జరగాల్సి ఉన్నా రేపటి నుండి దాదాపు 5 రోజులపాటు నేను అందుబాటులో ఉండని కారణంగా ఈరోజే ఆ పని పూర్తీ చేయడం జరిగింది .
ఈ ఆధునీకరణలో కొన్ని అంశాలు క్రొత్తగా జత చేయబడ్డాయి మరియు సరిదిద్దబడ్డాయి . అవి -
1. గూగుల్ పేజి ర్యాంకు యొక్క ప్రాధాన్యత తగ్గించి 'మోజో ర్యాంక్ ' మరియు 'డొమైన్ అధారిటీ ' ల ప్రామాణికతను పెంచడం : నిజానికి గత సంవత్సర కాలంలో గూగుల్ తన పేజి ర్యాంకును అప్ డేట్ చెయ్యలేదు .ఇకపై చేస్తుందన్న నమ్మకం లేదు . కనుక దాన్ని ఒక ప్రధాన  ప్రామాణికంగా తీసుకోవడం సబబు కాదు.
2. బ్లాగ్ స్పాట్ యొక్క blogspot .com ( అమెరికా వీక్షకులు) మరియు blogspot.in ( భారత్ వీక్షకులు) అలెక్సా ర్యాంకులలో ఏది తక్కువైతే అదికాక, ఒక ఫార్ములాతో రెంటినీ ఏకంచేసి ( ఈ ఫార్ములా ఇచ్చిన Mr.ROB , USA కి కృతజ్ఞతలు) దాన్ని మిగతా ( wordpress.com మరియు ఇతర డొమైన్ల ) ర్యాంకుకు సమానంగా తీసుకురావడం జరిగింది. 
కోడ్ లో చేయబడిన పై నవీకరణలవలన కొన్ని బ్లాగుల ర్యాంకులలో గణనీయమైన మార్పులు రావడం జరిగింది . ఈ స్థిరీకరణ "తెలుగు బ్లాగు"లకు మంచి చేసేదే అని నమ్ముతున్నాను .
ఈ నెల క్రొత్తగా చేరడానికి దాదాపు 18 బ్లాగుల నుండి అభ్యర్ధన అందినా పరిశీలనలో జాప్యం వల్ల ముందుగా అందిన 11 బ్లాగులను మాత్రమే చేర్చడం జరిగింది.
 ఇప్పటికీ పాత Widget  నే జతపర్చినవారు మార్చుకోమనీ , అసలు Widget  నే జతపర్చుకోనివారు తమ బ్లాగుల్లో కలుపుకోమనీ విజ్ఞప్తి. 
ఈ విభాగాన్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు  తెలుపుతూ సెలవు.

No comments:

Post a Comment

hit counter