అజ్ఞాత వ్యాఖ్యలు (anonymous comments) బ్లాగుల్లో అవసరమా ?

  


మూడు రోజుల క్రితం వ్రాసిన  'కామంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి ' అనే టపాకు మంచి స్పందనలు వచ్చాయి . అక్కడ కొన్ని anonymous కామెంట్లు కూడా వచ్చాయి . అవి కూడా చాలా నిర్మాణాత్మకంగా వ్రాసారు . అయితే చివరిగా రాధాకృష్ణ  గారు వ్యాఖ్యానిస్తూ  ".. Anonymous వ్యాఖ్యాతల వల్లనే ఈ డేమేజ్ జరుగుతోంది...అందువల్ల వ్యాఖ్యాలలో Anonymous ఆప్షన్ ని తొలగిస్తే ఈ ఇబ్బంది ఉండదు....."  అని వ్రాసారు .
దీనిపై చర్చను నడపడం సమంజసం అని భావిస్తూ ఈ టపా వ్రాస్తున్నాను .
నిజానికి anonymous లేదా అజ్ఞాత వ్యాఖ్యలను బ్లాగు రచయిత అనుమతించాలా అనే అంశంపై స్పందనలు తెలుపగలరు .
నా అభిప్రాయం :
ఒక బ్లాగు రచయిత తాను ఎప్పుడు anomymous  కామెంట్లను రద్దు చేస్తాడు అని ఆలోచిస్తే
1. బ్లాగు వ్రాసేముందే తను వ్రాస్తున్నడి పలువురికి కోపం తెప్పిస్తుందని తలచినప్పుడు .
2. బ్లాగు వ్రాయడం మొదలెట్టాక కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చినప్పుడు .
3. కొన్ని టపాలు ఇతరుల మనోభావాలను గాయపరుస్తాయని తెలిసి దీనిపై ఎ కామెంట్లు వస్తాయోనని భయపడి .
5. తాను గుర్తింపుతో కూడిన వ్యక్తుల స్పందనలు మాత్రమె కోరుకున్నప్పుడు .
6. అనుకోకుండానే ఈ ఆప్షన్ ఎన్నికోవడం
7. అజ్ఞాత వ్యాఖ్యలవల్ల నిజమైన అభిప్రాయాలు వస్తాయి అనుకున్నప్పుడు.
అని నాకు అనిపిస్తున్నది .
anonymous గా ఓ వ్యాఖ్యాత ఎప్పుడు వ్రాస్తాడు అని ఆలోచిస్తే -
1. ప్రస్తుతం గూగుల్ అకౌంట్ లేనప్పుడు .
2. త్వరగా కామెంట్ వ్రాయాలి . లాగిన్ ఆయె సమయం లేదు అనుకున్నప్పుడు .
3. తన గుర్తింపు అనవసరం అని భావించినప్పుడు .
4. తాను తన గుర్తింపుకు తగ్గ భావనతో కాక మరో భావనతో కామెంట్  చేయడలిచినప్పుడు .
5. రచయిత వ్రాసింది తనను గాయపరిస్తే తాను  కూడా రచయిత మనసును బాధించాలి అనుకున్నప్పుడు
6. ఆ రచయితే తనకు నచ్చలేదు కనుక ఎలాగోలా ఇరుకున పెట్టాలి అనుకున్నప్పుడు .
 అని నాకు తోస్తున్నది .
దీనిపై మీరేమెంటారు . ? అలాగే బ్లాగు రచయితలు అజ్నాతల వ్యాఖ్యలకు అనుమతి ఇవ్వాలా ? లేదా ?
స్పందనలు తెలియచేయగలరు
PS : ఈ బ్లాగులో ప్రసుత్తం అజ్ఞాత వ్యాఖ్యలు అనుమతించ బడుతున్నాయి .
పైన ఇమేజ్ గురించి గూగుల్ లో వెతుకుతున్నప్పుడు నాకు కనిపించిన ఈ టపా ఓసారి మీరూ చదవండి . 
http://dh.sunygeneseoenglish.org/2014/03/07/anonymous-comments-under-attack/

6 comments:

  1. కామెంట్ ఎమిటి అనేది ముఖ్యంగాని అజ్ఞాత గా చేస్తే నష్టమేమి లేదు అని నా అభిప్రాయం. లాగిన్ అవడం ఇబ్బందే. కాని అజ్ఞాత గా చేస్తే నోటికిష్టమొచ్చినట్టు చేసే అవకాశం ఉంది. అదే ID ద్వారా చేస్తే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తారు.

    ReplyDelete
  2. వ్యాఖ్య ఎవరు చేసేరన్నదానికన్నా ఎలా చేసేరన్నది ముఖ్యం. రాసిన విషయం మీద చర్చ చేసి అభిప్రాయం చెప్పడం తప్పుకాదు, అది భిన్నాభిప్రాయమే కావచ్చు. రచయితని కించ పరచేలా చేసే వ్యాఖ్య ఎలా చేసినా తప్పే. తప్పుని తప్పని చెప్పడం తప్పుకాదు, కాని వ్యక్తికి ఆపాదించడం, నచ్చనిదాన్ని, అందునా స్త్రీలని పచ్చిగా, అసభ్యంగా రాసేవారు అజ్ఞాతగానే రాస్తారు, వీరిని అవసరమైతే పట్టుకోడం పెద్ద పని కాదు కాని అలా చేయలేం. అదీ బలహీనత. కొన్ని కొన్ని అజ్ఞాత కామెంట్లే నిష్పక్షపాతంగానూ ఉంటాయి. నా ఉద్దేశం జ్ఞాత ఉంచడమా తీసేయడమా అన్నది వారి వారి ప్రజ్ఞని బట్టి ఉంటుంది.

    ReplyDelete
  3. ఒక అనుభవం చెబుతా. బ్లాగులో రోజూ పది పధేను కామెంట్లు వచ్చేరోజులు, నేనూ అలాగే కామెంట్లు చేసేవాడిని. ఒక అమ్మాయి బ్లాగ్ వరసగా చదువుతున్నా, ఒక వ్యక్తి అదే పనిగా అజ్ఞాత కామెంట్లు మొదలెట్టేడు. ఆవిడ చాలా కాలం ఓపికగానూ సమాధానం చెప్పేరు.నేను దీని చూస్తూవచ్చాను. ఒక సందర్భంలో అజ్ఞాత శృతి మించిపోయాడు, ఆవిడకేమో కళ్ళనీళ్ళ పర్యంతం ఉంది. ఎలా చెప్పాలి ఆమెకు నాకదో సమస్యైపోయింది, ఆవిడ కామెంట్లు మోడరేషనూ పెట్టలేదు, వ్యాఖ్యలకి జడిసి మోడరేషన్ పెట్టిందీవిడ అనుకుంటారనుకుంది. సలహా ఇవ్వాలి, ఆమెకు నచ్చాలి, అప్పుడు అజ్ఞాతగానే అజ్ఞాత తీసెయ్యితల్లీ అని వేడుకున్నా. ఆ మాట మీద ఆవిడ తీసెయ్యటం కథ సుఖాంతమయింది. అబ్బో ఇలా రాస్తూ పోతే నా అనుభవాలు చాలా ఉన్నాయి. ఇదే పెద్ద టపా అయినట్టుంది :)

    ReplyDelete
  4. అజ్ఞాత కామెంట్స్ మీద నా అభిప్రాయం అజ్ఞాతంగానే ..
    1. అజ్ఞాత option ఉంచి moderation పెట్టుకుంటే, ఫిల్టర్ చేయోచ్చు .
    2. మొత్తంగా అజ్ఞాత option తొలగించొచ్చు .

    రాసింది నచ్చనప్పుడు కొంతమంది రచయత ని విమర్శించడానికి ఈ అజ్ఞాత ఆప్షన్ వాడుకుంటారు . మాములుగా విమర్శించినప్పుడు పరవాలేదు , కాని శ్రుతి మించితే మాత్రం తట్టుకోవడం కష్టం . రచయతనే కాకుండా అక్కడ రాసే వాళ్ళని కూడా తిడితే ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం .
    మొన్న రమణ గారిని ఇలానే ఎవరో విమర్శిస్తే ఆయన నొచ్చుకుని ఆయన కామెంట్ పీకి పడేసారు .

    మన భండారు వారు చేస్తున్నట్టు ఫిల్టర్ చేసుకుని, పబ్లిష్ చేయడం బాగుంటుంది .

    ReplyDelete
  5. ఇప్పుదిదే వ్యాఖ్యని సుబ్బారవు పేరుతోనో, అప్పారావు పేరున్న gmail ప్రొఫైల్‌తోనో చేశాననుకోండి, అంతమాత్రాన అది అజ్ఞాత వ్యాఖ్య కాకుండా పోతుందా? బ్లాగుల్లో పోస్టులు రాస్తున్నవాళ్ళ పేర్లు, ఇంటిపేర్లు, అడ్రసులు, ఫోన్ నంబర్లు ఎంతమందికి తెలుసు? తెలుసుకున్నంతమాత్రాన ఏమి ఉపయోగం? వ్యాఖ్యనించిన విధానం నచ్చకపోతే తొలగించడమేతప్ప అజ్ఞాతా? కాదా? అన్న చర్చ అనవసరం?

    అసలే వ్యాఖ్యలులేక చచ్చిపోతున్న (అనగా బ్రతికించవలసిన) స్థితిలో బ్లాగ్‌లోకం ఉందని మీరే అన్నారు. వ్యాఖలులేకపోతేనే రాసేందుకు ఉత్సాహం ఉంటుందని మరికొందరన్నారు. ఓపక్క కామెంట్లకోసం దేబిరిస్తూ, ఇంకోపక్క దానికో process ఉండాలనడమేమిటి? Beggers can't be choosers. Continuing with the analogy of the begging, commenting anonymously is equal to గుప్తదానం :-).

    "కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన" అన్నది బ్లాగు రాతలకు పనికిరాదా? ఫలం (వ్యాఖ్యలు) ఉంటుందని తెలిస్తేనే కర్మ (బ్లాగు టపాలు రాయడం) చేయడం మనక్కుదరదా?

    ReplyDelete
  6. ఓపక్క కామెంట్లకోసం దేబిరిస్తూ, ఇంకోపక్క దానికో process ఉండాలనడమేమిటి? Beggers can't be choosers. Continuing with the analogy of the begging, commenting anonymously is equal to గుప్తదానం :-).

    "కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన" అన్నది బ్లాగు రాతలకు పనికిరాదా? ఫలం (వ్యాఖ్యలు) ఉంటుందని తెలిస్తేనే కర్మ (బ్లాగు టపాలు రాయడం) చేయడం మనక్కుదరదా?


    ................. very well said ..............

    ReplyDelete

hit counter