ప్రతీరోజూ బ్లాగిల్లు , ఇతర సంకలినులలో వస్తున్న వేలాది టపాలలో కొన్ని ఆణిముత్యాలను అప్పుడప్పుడూ మీరు మిస్ అవుతూ ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఏదో పనిలోపడి ఒకవేళ ఒక రోజు లేదా ఒక పూట ఆగ్రిగేటర్లు చూడకపోతే కొన్ని మంచి టపాలు మీ కంట పడకపోవచ్చు కదా ? ఈ అవకాశాన్ని మీరు కోల్పోకుండా మీ అభిమాన బ్లాగిల్లు మరో క్రొత్త ప్రయోగంతో ముందుకు వచ్చింది .రోజుకు మూడుసార్లు ఆ పూటలో వచ్చిన మంచి టపాలతో ఓ గుత్తిని అందిస్తున్నది. ఇవి ఉషోదయ ముత్యాలు, లంచ్ బాక్స్ , వెన్నెల వెలుగులు పేర్లతో టపాలుగా బ్లాగిల్లు లో వస్తాయి. ఒక్కో గుత్తిలో 7-8 బ్లాగు టపాలు కలిగి ఉంటాయి. బ్లాగుల నుంచి సంగ్రహించిన మొత్తం టపా ఇందులో ఉండదు . కేవలం మీ బ్లాగుకు లింక్ మాత్రమె ఉంటుంది . దీనివల్ల టపా చూడ్డానికి మీ బ్లాగుకు వీక్షకులు రావాల్సిందే .
ఈ టపాల ఎంపిక ఎలా జరుగుతుందంటే - మధ్యాహ్నం వరకూ వచ్చిన తెలుగు బ్లాగుల టపాలలోంచి 7-8 టపాలు ఎంపిక చేయబడుతాయి. ఎక్కువ కామెంట్లు వచ్చినవి, ఎక్కువ మంది చదివినవి ( ప్రస్తుతానికి ఈ సదుపాయం ఉంది) మరియు మీకు నచ్చుతాయి అనుకున్నవి ఇందులో ఉంటాయి. ఎక్కువ కామంట్లు వచ్చినా రాజకీయ, వార్తా టపాలు ( అతి ముఖ్యం అనుకుంటే తప్ప) ఇందులో ఉండవు . ఈ క్రొత్త ప్రయోగంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించగలరు.
ఈ టపాలను క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు .
ఎంపిక చేసిన టపాలు
good experiment
ReplyDeletechadivaanu chaalaa baagunaayi .. manchi selection
ReplyDeletekeep it up
ReplyDelete