'సెంచరీ' దాటిన ఉత్తమ బ్లాగులు విభాగం

గత నెల 27వ తేదీన 83 బ్లాగులతో ప్రారంభమైన ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగంలో ప్రస్తుతం వందకు పైగా బ్లాగులు నమోదై ఉన్నాయి . మొదటినుంచీ బ్లాగిల్లులో అత్యంత ఆదరణ పొందిన విభాగం ఇదే!   ఆగస్టు 17న ర్యాంకుల తదుపరి ఆధునీకరణ జరుగుతుంది.
ఈ విభాగంలో వీక్షకులకోసం త్వరలో అనేక మార్పులు రారోతున్నాయి . వాటిలో కొన్ని - బ్లాగు వర్గం ఆధారంగా బ్లాగులను ఎంచుకోవడం, బ్లాగర్ పేరు ఆధారంగా, నివాసప్రదేశం ఆధారంగా బ్లాగులు చూపడం . ప్రదేశం ఆధారంగా బ్లాగులు చూపడంవల్ల ఒక ప్రాంతంలోని బ్లాగర్లమధ్య సత్సంబంధాలు ఏర్పరచవచ్చు అని నా నమ్మకం.
ఈ విభాగంలో భవిష్యత్ లో దాదాపు తెలుగులోని అన్ని బ్లాగులూ నమోదు కావాలని ఆశ . దీనికి ఆయా బ్లాగుల రచయితలు సహకరించి తమ బ్లాగులను ఇక్కడి నుండి నమోదు చేసుకోవచ్చు .
బ్లాగిల్లులో నూతనంగా ... 
తెలుగు బ్లాగుల గురించి \, బ్లాగిల్లు గురించి ఇతర చర్చల కోసం ఒక చర్చావేదిక విభాగం మొదలైనది. దాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆవిభాగాన్ని ఇక్కడి నుండి చేరుకోవచ్చు

No comments:

Post a Comment

hit counter