ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం ఆధునీకరణ గురించి ...




'బ్లాగిల్లు' లో ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం ఏంతో  ఆదరణ పొందిన ఒక విభాగం .ఈ  విభాగం ఆధునీకరణ గురించి ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లూ దాదాపు పూర్తయ్యాయి.  అతి త్వరలో మీ ముందుకు రాబోయే ఈ విభాగం ఎలా పనిచేస్తుందో క్రింద తెలియచేస్తున్నాను .
1. బ్లాగర్ ఇక్కడి నుండి తన, తన బ్లాగు వివరాలు తెలియచేస్తూ ఈ విభాగంలో చేరడానికి తన సంసిద్దతను తెలియచేస్తారు .
2. అలా బ్లాగర్ పంపిన బ్లాగు ఈ విభాగంలో చేరుటకు సరియైనదో కాదో చూసి అన్ని అర్హతలూ ఉంటె ( వీటి గురించి ఇక్కడ చూడండి) తిరిగి ఒక కోడ్ తో రిప్లై ఇవ్వబడుతుంది .
3. మాయొక్క ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ద్వారా తయారుచేయబడిన కోడింగ్* లిస్టు లో ఈ బ్లాగు జతచేయబడుతుంది .
* ఈ కోడ్ కొన్ని యాహూ పైప్స్, కొన్ని జావా స్క్రిప్టులు, కొన్ని యాహూ dappers మాత్రమె కాక ప్రపంచవ్యాప్తంగా  సేకరించబడిన కొన్ని websites ద్వారా సమాచారం ఉపయోగించి తయారు చెయబడింది. ఇది తనకు జతపరచబడిన బ్లాగుల చరిత్రను తెలియచేసేది . చరిత్ర అంటే బ్లాగు పుట్టుక, టపాల, వ్యాఖ్యల నెలవారీ ప్రవాహం , సెర్చ్ ఇంజన్లు బ్లాగును గుర్తిస్తున్న విధానం,అలెక్షా, moz , గూగుల్ PR , ఇంకా backlinks , బ్లాగులో ప్రచురించ బడుతున్న సమాచార నాణ్యత ( Unique Content ) , బ్లాగర్ తో వీక్షకుల interaction లాంటి ముఖ్యమైనవే కాక బ్లాగులోని ప్రకటనల శాతం, సోషల్ మీడియాలో దాని విస్తృతి , బ్లాగు రూపు లాంటి మొత్తం 25 రకాలయిన జల్లెడలతో ప్రతీబ్లాగునూ అడిగినప్పుడు జల్లిస్తుంది . ప్రతీ అంశానికీ దాని ప్రాధాన్యతనును బట్టి ఒక ప్రత్యేకమైన స్కోరింగ్ ఇస్తుంది . ఒక్కోదానికి 10 వరకూ , ఒక్కోదానికి 5 వరకూ , ఒక్కోదానికి 1 లేదా 0 ఆలా ఇస్తుంది .
4. ఇక నాపని. అలా వచ్చిన స్కోరింగ్ను శాతంలోకి  మార్చి మొత్తం 100 మార్కులకు కుదించడం.
5. అలా వచ్చిన శాతాలను ఆయా బ్లాగుల యొక్క బొత్తాలపై లిఖించడం, డైరెక్టరీలో ఆధునీకరించడం కూడా నాపనే.
6. నాపని సులువవ్వాలంతే నెలకో, పదిహేను రోజులకో మాత్రమె ఈ ఆధునీకరణ జరగాలని నిర్ణయించాను .
7. ఆధునీకరణ జరిగిన తేదీ ముందు తెలియచేయబడక  పోవచ్చు. కానీ ఇలా చేసిన తర్వాత బ్లాగు ద్వారా తెలియపర్చబడుతుంది .
8. పారదర్శకతకోసం భవిష్యత్తులో ఈ విధానంలో గానీ, కోడ్ లోగానీ మార్పులు జరుగ వచ్చు.
9. ఇక సభ్యులకు పంపిన html  code ను ఖచ్చితంగా బ్లాగులో జతపర్చాలన్న నిబంధన లేకపోయినా అందరూ తమతమ కోడ్ లను జతచేసుకొని మాకు మద్దతు పలుకగలరు .

ముఖ్యంగా - ఇప్పటికే వారి బ్లాగుల్లో జతచేసుకున్న ఉత్తమ బ్లాగుల కోడ్ కు ఈ కోడ్ కు ఏ విధమైన సంబంధమూ లెదు. కనుక అది ఇప్పటికిప్పుడు తొలగించనవసరం లేదు . అది తొలగించుటకు ముందు మీకు తెలియచేయడం జరుగుతుంది.
ప్రస్తుతం మావద్ద ఈ విభాగంలో 83 బ్లాగులు రిజిస్టర్ కాబడ్డాయి.
ఈ విధానం ఎవరికైనా నచ్చని పక్షంలో ఒక మెయిల్ చేస్తే తమ బ్లాగును  ఈ విభాగం నుంచి తొలగించే ఏర్పాటు
 జరుగుతుంది.
ఇది బ్లాగిల్లు చేపడుతున్న ప్రాజెక్టులలో మొదటిది. మరిన్ని ప్రాజెక్టులు భవిష్యత్తులో తీసుకు వచ్చే ప్రయోగాలు నిరంతరం  సాగుతూనే ఉంటాయి .

1 comment:

  1. చాలా మంచి ప్రయత్నం... తెలుగు బ్లాగుల నాణ్యత ఖచ్చితంగా మెరుగు పడుతుంది... ఎక్కడ లోపాలున్నాయో సరిచేసుకునే అవకాశం తప్పక అర్ధమవుతుంది... ధన్యవాదములు!!

    ReplyDelete

hit counter