బ్లాగిల్లు...విభిన్నత్వం కోసం!

మిగతా బ్లాగు సంకలినుల్లా కాకుండా "బ్లాగిల్లు"లో విభిన్నమైన సదుపాయాలు ఉండాలని నేను కోరుకుంటాను . ఇప్పటికే బ్లాగిల్లులో గల అనేకమైన శీర్షికలు మీ అందరి మెప్పు పొందాయి . కానీ ఈ మధ్యనే ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బ్లాగిల్లును బ్లాగర్ హోస్టింగ్ లోకి మార్చాలనే ఆలోచన వచ్చింది . దీనివల్ల హోస్టింగ్ కు అయ్యే ఖర్చు మిగులుతుంది అని. కానీ ప్రస్తుతం ఉన్న php లో వ్రాసిన కోడ్ కి బ్లాగర్ లో వ్రాయబోయే కోడ్ కి చాలా తేడా ఉంటుంది . ముఖ్యంగా బ్లాగర్ కోడ్ లో దాపరికం ఉండదు. php కోడ్ లో అది ఉంటుంది . php లో ఉపయోగించేది వాడకపుదారునకు కనపడదు . అంతేకాదు . విభిన్న అంశాలు ముద్దుగా, అందంగా  తీసుకురావాలంటే php నే మంచిది . php  లో ఉన్న మరో గొప్పతనం సెర్చ్ ఇంజన్లు మనం వ్రాసే సమాచారాన్ని ప్రత్యేకమయినదిగా గుర్తిస్తాయి . php  కోడ్ ను వాడే విధానం బట్టి దాని ప్రత్యేకత ఉంటుంది . ఇదేమైనా గొప్ప విధ్యా ? ఎవరైనా కష్టపడితే
కనిపెట్టడం ఈజీనే అనొచ్చు . అవొచ్చు .. కానీ అన్నీ కాదు .
ఇక బ్లాగర్ ...  చెప్పానుగా దీని పరిమితులు. ఇక్కడ అంతా ఓపెన్. అంతేకాదు సెర్చ్ ఇంజన్  లకు మనం వ్రాసేదే తప్ప కోడింగ్ రూపంలో పెట్టింది తెలీదు. ఈ స్క్రిప్ట్ ద్వారా వచ్చిన ఫలితం అద్భుతంగా ఉన్నా దాన్ని ఆస్వాదించ  లేము. ఎందుకంటే సెర్చ్ ద్వారా మనం వ్రాసింది దొరకదు. సెర్చ్ లో వెనకబడి పోతాము .
"బ్లాగిల్లు" హోస్టింగ్ ముగియడానికి ఇంకా చాలా సమయముంది. అప్పటికల్లా ఓ అద్భుతం మన తెలుగు బ్లాగర్లకి అందివ్వాలని నా ప్రయత్నం. అది బ్లాగర్లో కావచ్చు . మరో చోట కావచ్చు.
ప్రయత్నం మొదలైంది ... ప్రయోగ ఫలితం త్వరలో మీముందు ఉంటుంది ..

7 comments:

  1. Sir,
    Good News.. tit for tat

    ReplyDelete
  2. కొత్త తనము ... స్వాగతము ...

    ReplyDelete
  3. ధాంక్యూ సార్ ..

    ReplyDelete
  4. Good news chepparu sir.telugu blogula patla meekunna abhimanam Exlent.

    ReplyDelete

hit counter