తెలుగు బ్లాగర్లకు 'బ్లాగిల్లు' వ్రాస్తున్న లేఖ

ఈ మధ్య బ్లాగిల్లు అప్ డేట్ కావడం లేదని చాలామంది లేఖలు వ్రాస్తున్నారు . వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ . .
బ్లాగిల్లు ఆరంభించి ఇప్పటికి దాదాపు రెండున్నర ఏళ్ళు అయింది . తెలుగు బ్లాగర్లకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన బ్లాగిల్లు తెలుగు ఆగ్రిగేటర్ ను ఎంతగానో ఆదరించారు. దానితో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని మెరుగులు, శీర్షికలు ప్రారంభించడం జరిగింది . ప్రారంభించిన 10 నెలల తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఆర్ధిక సమస్యలు ఇంక వెబ్ సైట్ నడపలేని స్థితికి తీసుకు వచ్చాయి . ఆ సమయంలో బ్లాగర్లకు ఓ బహిరంగ లేఖ వ్రాయడం జరిగింది . అది ఓ సారి చూడండి

బ్లాగిల్లును స్వంతం చేసుకోవాలని కొందరు సంప్రదింపులు కూడా జరిపారు . ఆర్ధికంగా కొద్దిగా కోలుకోవడంతో మళ్ళీ బ్లాగిల్లును కొనసాగించాను. దీన్ని మరింత ఆకర్షణీయంగా, ఉన్నతంగా తీర్చిదిద్దాను  .

కానీ, ప్రస్తుతం ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి చేస్తున్న వ్యాపారంలో మరింత శ్రద్ద చూపవలసిన అవసరం వచ్చింది. చేస్తున్న వ్యాపారం తప్పనిసరి అయి బ్లాగిల్లు పై కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను . ఈ కారణంగా గత కొద్ది రోజులుగా సరిగా అప్డేట్ కావడంలేదు .
ఇక బ్లాగిల్లును ప్రస్తుతానికి పూర్తిగా మూసివెయడమో లేక స్వంతం చేసుకోడానికి ఆసక్తి చూపేవారికి పూర్తీ హక్కులు ఇవ్వడమో మాత్రమె నా ముందు నిలిచి ఉన్న ఆప్షన్లు !!
బ్లాగిల్లు యొక్క డొమైన్, సర్వర్ , స్క్రిప్ట్ మొత్తంను  ఆగ్రిగేటర్ నిర్వహణపై ఆసక్తి చూపే వారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను . ఆ తర్వాత బ్లాగులోకం నుండి నిష్క్రమించాలని నా కోరిక .
ఆసక్తి, ఉత్సాహం కలవారు నాకు మెయిల్ చేయగలరు .
srinivasrjy@gmail.com

No comments:

Post a Comment

hit counter