బ్లాగిల్లు నుండి మరో ప్రయోగం " లోకల్ "

నేడు "బ్లాగిల్లు" , " లోకల్ (local) " పేరుతో మరో ప్రయోగాత్మక విభాగాన్ని ప్రారంభించింది. మన రాష్ట్రంలోని వివిధ నగరాలలోని మరియు మన పొరుగు రాష్ట్రాలలో  తాజాగా వ్రాస్తున్న తెలుగు బ్లాగర్ల సమాచారం ఈ విభాగంలో కనిపిస్తుంది. ఇది దానికదే నిరంతరం ఆధునీకరించబడే విభాగం. ఇందులోని బ్లాగర్లు ఏ సంకలిని లోనూ రిజిస్టర్ చేసుకుని ఉండవచ్చు/ ఉండకపోవచ్చు.
కాకపోతే సాంకేతిక అసౌకర్యం దృష్ట్యా కేవలం బ్లాగ్ స్పాట్ లోని బ్లాగరులే మీకు కనిపిస్తారు ఇక్కడ. వర్డ్ ప్రెస్ లేదా ఇతర బ్లాగు వేదికలలో ఉన్న సభ్యులు కనిపించరు.
ఈ విభాగంపైన మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించగలరు.
మా ఇతర విభాగాలు, ప్రయోగాల లాగానే దీనినీ " తెలుగు బ్లాగర్లు " ఆదరిస్తారని ఆశిస్తూ, ఆదరించాలని కోరుకుంటున్నాము. ఒకటి నిజం! మీ ఆదరణే మా నూతన ప్రయోగాలకు, ఆలోచనలకు ఇందనం.
కనీసం ప్రతీ తెలుగు బ్లాగరూ తమ బ్రౌసర్ బుక్ మార్క్ (browser bookmarks)లో  బ్లాగిల్లు ని గుర్తించి రోజుకు ఒకసారైనా విచ్చేస్తే  చాలు. మా నూతనత్వం మీకు కనపడుతుంది. అదే మా కోరిక.
                                ఇక్కడినుండి లోకల్ విభాగానికి వెళ్ళవచ్చు.
                                                   ఇక్కడ నొక్కండి 
కృతఙతలు   
మీ బ్లాగిల్లు

No comments:

Post a Comment

hit counter