బ్లాగిల్లు నుండి మరో "ప్రయోగం"

తెలుగు బ్లాగర్లకు,బ్లాగిల్లు వీక్షకులకు నమస్కారం
మీకోసం ఎన్నో ప్రయోగాలు చేపడుతున్న మీ "బ్లాగిల్లు" ఇప్పుడు మరో సరిక్రొత్త విప్లవానికి నాంది పలకబోతోంది.. అదేమిటంటే మీ బ్లాగు పోస్టులు ప్రపంచపటంపై. అంటే  ప్రస్తుతం బ్లాగిల్లులో వస్తున్న తెలుగు బ్లాగు టపాలు సదరు టపా రచయిత నివసిస్తున్న ప్రదేశం ఆధారంగా ప్రపంచపటంపై చూపబడుతాయి... విచిత్రంగా,క్రొత్తగా ఉంది కదూ!! ఈ అనుభూతి కనులారా వీక్షించాలంటే తెలుగు బ్లాగరులు నివశిస్తున్న ప్రదేశం కావాలి. దానికోసం మిమ్మల్ని కోరేది ఒకటే. తమ తమ ప్రదేశాలను   "బ్లాగిల్లు"లో రిజిస్టర్ చేసుకోగలరు. దీనికోసం క్రింద లింక్ ఇస్తున్నాం.
                                                            రిజిస్టర్ చేసుకోడానికి లింక్

గమనిక : మీరే కాక మీకు తెలిసిన బ్లాగర్లను కూడా రిజిస్టర్ చేయవచ్చు.
 
అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఒకసారి  AP News on MAP అనే ఈ పేజి చూడండి

చివరిగా, బ్లాగిల్లు చేసిన చేస్తున్న ఈ నూతన ఒరవడులను ఆదరిస్తున్న మీలాంటి బ్లాగర్లే ఈ ప్రయోగం విజయమంతం చేయగలరు. మీ సహాయం లేకుండా ఇది సక్సెస్ కాలేదు.

No comments:

Post a Comment

hit counter