తెలుగు బ్లాగర్లకు శుభవార్త : మీకోసం తెలుగు బ్లాగ్ ర్యాంకింగ్స్

తెలుగు బ్లాగర్లకు శుభవార్త!!

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్ శీర్షికను మీకోసం ప్రారంభించాము. ఇది దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా మన తెలుగులోనే ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది. కేవలం తెలుగు వారి బ్లాగులకు ( వెబ్ సైట్లకు కాదు ) మాత్రమే ఇది పరిమితం.
ఈ శీర్షికను సహ్రుదయులైన మన బ్లాగర్లందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. దానికోసం అర్ధిస్తున్నాము. తెలుగు బ్లాగర్లందరూ తమ తమ బ్లాగులను జతచేర్చి ఈ మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము.
రండి ... మనందరం వర్గ, వర్ణ, కుల, మత, రాజకీయ బేధాలను మరచి కలసికట్టుగా విజయం చేద్దాం.
ఉద్దేశం: తెలుగు బ్లాగులలో మంచివాటిని, పలువురు మెచ్చుతున్న వాటిని ర్యాంకింగ్స్ ఆధారంగా ప్రచారం చేయడం.
ఉపయోగం: 1.క్రొత్తగా బ్లాగర్లయిన వారు ఏది మంచి బ్లాగో, ఏది ఉత్తమమైన బ్లాగో తెలుసు కుంటారు.
2. తెలుగు బ్లాగర్లలో పోటీ తత్వం పెరిగి మరిన్ని మంచి పోస్టులు వస్తాయి.
ప్రస్తుతం ఉన్న ఫీచర్లు : 1. ఆటోమేటిక్ గా ఉత్తమబ్లాగు ఎంచుకోబడుతుంది. ఇది ఆ రోజుకి సంబందించి వీక్షకుల సంఖ్య ఆధారంగా ఎంచుకో బడుతుంది.
2. బ్లాగులకు రేటింగ్స్ ఎవరైనా ఇవ్వవచ్చు. దీనిని కూడా బ్లాగు ర్యాంకుకు ప్రామాణికంగా తీసుకోబడుతుంది.
త్వరలో వచ్చే ఫీచర్లు : 1.  అలెక్షా ర్యాంకు కూడా చూపించడం
2. గూగుల్ పేజ్ ర్యాంక్ చూపడం.
3. ఆనాటి క్రొత్త బ్లాగులు చూపడం
మీరు చేయవలసినది:
మీరు మీయొక్క ఎన్ని బ్లాగులనైనా జతపర్చవచ్చు.
ప్రతీ బ్లాగుకూ ఒక విభిన్న కోడ్ పంపబడుతుంది. దాన్ని మీ బ్లాగులో విడ్జెట్ గా కలుపుకోవలసి వస్తుంది. ఇలా కోడ్ ను కలిపినతర్వాతనే ఆ బ్లాగు ర్యాంకింగ్స్ కోసం తీసుకోబడుతుంది. కోడ్ కలపని బ్లాగు ర్యాంక్ చేయబడదు.
(దీనిని వివరించడానికి మరో బ్లాగు పోస్టు వ్రాయబోతున్నాము. )
మరెందుకాలశ్యం..?
ఇప్పుడే మా బ్లాగును కలిపేందుకు నడుం బిగించండి...

 CLICK HERE 

2 comments:

  1. చాల మంచి ప్రయత్నం చేస్తున్నారు

    ReplyDelete

hit counter