తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్ త్వరలో మీ "బ్లాగిల్లు"లో

అతి త్వరలో  మీ "బ్లాగిల్లు"లో తెలుగు బ్లాగుల ర్యాంకింగ్స్ శీర్షికను ప్రారంభించబోతున్నాము. ఈ ర్యాంకింగ్స్ ఆటోమేటిక్ గా ప్రతీదినం update కాబోతున్నాయి.ఈ అప్ డేట్ ప్రధానంగా అయా బ్లాగుల వీక్షకుల సంఖ్యను బట్టి ఉంటుంది. దీనికై అనుభవజ్ఞులైన మన తెలుగు బ్లాగర్ల నుంచి నాకు కొన్ని సలహాలు కావాలి.
నాకు ఉన్న కొన్ని సందేహాలు:
1.బ్లాగు ర్యాంకింగ్స్ ప్రతీదినం అప్ డేట్ అవుతూ ఉండాలా? లేక వారానికి ఓసారి మారేలా ఉండాలా? ( ఎందుకంటే ప్రధానమైన చాలా మంది బ్లాగర్లు కేవలం వారానికి ఒకటి రెండు రోజుల్లో మాత్రమే పోస్టులు వ్రాస్తున్నారు )
2.బ్లాగు ర్యాంకింగ్ ను అయా బ్లాగుల వీక్షకుల సంఖ్య ద్వారానే తీసుకోవాలా? లేక ఆ వారంలో వ్రాసిన పోస్టులు, అలెక్షా ర్యాంక్ (alexa rank) మార్పు లాంటి మిగతా సాంకేతిక అంశాలూ పరిగణించాలా?
3.ఇంకా ఏమైనా మార్పులు,చేర్పులు అవసరమా?
దయచేసి ఈ క్రొత్త శీర్షిక విషయంలో ఆందరూ తమ సలహాలను అందించి, మీ "బ్లాగిల్లు"ను శక్తివంతంగా నిర్మిం చేందుకు తోడ్పడాలని మనవి..



5 comments:

  1. శ్రీనివాస్ గారికి ,

    ఈ ఆలోచన చాలా బాగుంది.అగ్రిగేటర్ అభివృద్ధికి మీ కృషి కూడా బాగుంది. కానీ ఆశించినంత ఫలితం రావడం లేదని అనిపిస్తోంది.

    రాంకులకు సంబంధించి ప్రతిరోజూ ఉంటేనే మంచిది.

    పోస్టులను బట్టి ఉండకూడదు. వీక్షకుల సంఖ్య + అలెక్సా రాంక్ ను బట్టి ఉంటే మంచిది.

    అలెక్షా రాంక్ కంటే వీక్షకుల సంఖ్యే ప్రధానం.

    సాంకేతిక అంశాలను అసలు ప్రధానం చేయకూడదు.

    బ్లాగిల్లులో పోస్టుల విషయంలో కూడా కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది.

    ReplyDelete
  2. కొండల రావుగారూ,
    ముందుగా మీకు క్రుతజ్ఞతలు!! మీరన్నది నిజమే కావచ్చు...మన తెలుగువారిలో స్పందించేవారు, సలహాలు ఇచ్చేవారు తక్కువే. ఈ విషయంలో బ్లాగరులు ఏమీ తీసిపోలేదనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే ఈ పోస్టును చదివిన వాళ్ళ సంఖ్య ఇప్పటికి "236" మంది. కనీసం ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. దీనికి వాళ్ళని తప్పు పట్టలేం. ఏదో ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్థత్వం ... మనకెందుకులే అనుకునే అలోచనలు తెలుగువారికి మామూలేననడానికి నేటి రాజకీయాలూ, వివిధ సమస్యలపై సామాజిక స్పందనలూ కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు...

    ReplyDelete
  3. విషయానికి వస్తే, మరిన్ని స్పందనలను బట్టి నిర్ణయం తీసుకుందాం

    ReplyDelete
  4. శ్రీనివాస్ గారు వీక్షకుల సంఖ్య ను బట్టి బాగోదు అండి,నా బ్లాగ్ లో నేను రాసిన చెత్త రోజుకి ౩౦౦౦ చదువుతున్నారు,అలగని నేను మంచి బ్లాగేర్ ని కాదు,worthful information ఉన్న వాటికీ రాన్కింగ్ ఇవ్వండి ప్లీజ్!

    ReplyDelete
  5. మీ బ్లాగిల్లు సంకలిని ఇదివరలో చూసానేమో గుర్తుకులేదు కానీ ఇప్పుడు చూసాను. బావుంది. ముఖ్యంగా టపా స్నిప్పెట్ ఇవ్వడం నాకయితే సౌకర్యంగా వుంటుంది. ఎన్నో సార్లు టైటిల్ బావుందని వెళ్ళి కవిత్వం బ్లాగుల్లో పడ్డాను. మన బ్లాగర్లలో ఇంతమంది కవులూ, కవయిత్రులూ వున్నారేంటండీ బాబూ. సహజంగానే చాలా చక్కని టైటిల్ పెడతారు కాబట్టి ఆ టపా ఏంటో తెలియకుండా దూకేస్తుంటాను.

    ఎలెక్సా ర్యాంకింగ్ ఎలా ఇస్తారో తెలియదు కాబట్టి దాని గురించి చెప్పలేను. వారం అంటే ఆలస్యం అయిపోతుంది కాబట్టి రోజూ వారి ర్యాంకింగ్ బావుంటుంది. ఆమధ్య అప్పారావ్ సంకలినిలో కూడా ఎక్కువమంది చదివిన టపాలు ఇచ్చినట్లున్నారు కానీ తీసేసినట్టున్నారు.

    ReplyDelete

hit counter