ఉందిలే "కష్ట కాలం" ముందు ముందునా...

 ఒకప్పుడు వెలుగులు జిమ్మిన తెలుగు బ్లాగుల ప్రపంచం నేడు అంధకారం వైపు పయనిస్తోంది. ఒక్క తెలుగు బాషలో మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ ప్రస్తుతం ఎవరూ బ్లాగులు వ్రాయడానికి ఇష్టపడడం లేదు. 

తమ భావాలను స్పష్టంగా, చిన్నగా ఒక్క ముక్కలో చెప్పడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. తమ ఆలోచనలను, సృజనాత్మకతను వీడియోల రూపంలో యూట్యూబ్, ఇన్స్టా లలో ఉంచుతున్నారు. ఎక్కువమందికి తమ మాట చేరాలంటే సోషల్ మీడియా మాత్రమే మార్గం. 

అయితే దీనిలో చిక్కు ఏంటంటే అక్కడ మన మాట ఆ క్షణానికే వెలుగుతుంది. తర్వాత మరుగున పడిపోతుంది. అదే బ్లాగుల ద్వారా అయితే గూగుల్ సెర్చ్ ద్వారా శాశ్వతంగా ఉంటుంది. అలా అనుకున్న కొద్దిమందే బ్లాగుల్లో వ్రాస్తున్నారు.  

ఒకప్పుడు రేడియోను టెలివిజన్ ఆక్రమించగా.. ఇప్పుడు ఒటీటీలు టివి స్థానాన్ని బర్తీ చేసేస్తున్నాయి. ఎప్పుడో వచ్చే సీరియల్స్ లైవ్ లో ఎవరూ చూడడం లేదు.  తమకు వీలైన సమయంలో సీరియల్స్ కానీ, సినిమాలు కానీ ఒటీటీలలో చూస్తున్నారు. 


 

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే న్యూస్ పోర్టల్స్ (వార్తా వెబ్సైట్లు) పరిస్థితి మహా దారుణం. ఏఐ (AI) ఊపందుకున్నాక ఈ పోర్టల్స్ నడపడమే కష్టంగా ఉంటోంది. ఆ ఏఐ కి మూల సమాచారం అందించాల్సిన వెబ్సైట్లను అదే మింగేస్తోందనిపిస్తోంది. AIలో మార్పులు జరగకపోతే మాత్రం రాబోయే రెండేళ్ళ కాలం ప్రముఖ న్యూస్ ఏజెన్సీలకి కష్టకాలమే అని చెప్పొచ్చు. 

మరింత లోతైన విశ్లేషణతో త్వరలో మీ ముందుంటాను... బై! 

 

 

 

No comments:

Post a Comment

hit counter