తెలుగు బ్లాగులకు మళ్ళీ మంచిరొజులొస్తాయా ?

రాన్రానూ తెలుగులో వ్రాసేవాళ్ళు తగ్గిపోతున్నారు. హైస్కూల్ స్థాయిలో కూడా తెలుగును ఓ ప్రధాన సబ్జెక్ట్ గా గుర్తించడం లేదు. కార్పోరేట్ స్కూళ్ళలో ఐతే తెలుగు బదులుగా సంస్కృతం నేర్పుతున్నారు . అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా వేతనంలో వ్యత్యాసం ఉంటుంది . మేథ్స్ , సైన్స్ ఉపాధ్యాయులకు తెలుగు పండిట్ లకు వేతనంలో దాదాపు 50%-100% వ్యత్యాసం ఉంటుంది . ఇక ముందు తరాలవాళ్ళు తెలుగు నేర్చుకుంటారా అంటే అనుమానమే!
మరోవైపు ప్రభుత్వాల వ్యవహార శైలి కూడా అలానే ఉంది . తెలుగును ఓ ప్రధాన అధికారిక భాషగా వ్యవహరింప చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి.
తెలుగు పత్రికలు చదివేవాళ్ళు  లేక  మూతపడి పోయాయి . ఇటీవలే పురాతనమైన నవోదయా పబ్లికేషన్స్ కూడా మూతపడింది. ఇక ఆన్ లైన్ లో అయినా చదువుతున్నారా అంటే అదీ అంతంత మాత్రమే.
తెలుగుకు పూర్వవైభవం రావాలంటే తెలుగు భాష మాట్లాడుతున్న ప్రతీ ఒక్కరూ తమ భాష వ్రాయడంలో, చదవడంలో పట్టు సాధించాలి. తమ ఆలోచనలను కలంతో పేపర్ పైనో , బ్లాగులోనో పెట్టాలి. ఈ దిశగా అడుగులు వేద్దాం.

No comments:

Post a Comment

hit counter