2015 తెలుగు బ్లాగు లోకానికి నింపిన విషాదం - కూడలి మూసివేత

నా అభిమాన కూడలి మూతపడడం నన్ను ఎంతగానో కలచి వేస్తున్నది . ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న కూడలి మూతపడడం తెలుగు బ్లాగు లోకం బాధ పడే  విషయం .
దీనికి కారణాలు ఏమిటి ? బ్లాగులలో ప్రోత్సాహం కరువవడం అని నా అభిప్రాయం !
దీనికి పరిష్కారం ఏమిటి ? మీ కామంట్లు వ్రాయండి ..
త్వరలో రాబోయే  మరో ఆగ్రిగేటర్  విఫలం అవకుండా చూడండి ...

27 comments:

  1. ఆంగ్ల నూతన సంవత్సరాది శుభకామనలు.

    నేను చాలా సార్లే చెప్పాను, తెనుగు ఆగ్రిగేటర్ ల గురించి. ఒకప్పుడు, సంకలిని,హారం మూతబడ్డాయి. ఇప్పుడు కూడలి వంతు. జరిగినదాని గురించి విచారం . ఇప్పటివరకు వారు చేసిన సేవలకి ధన్యవాదాలు తెలపడం కనీస ధర్మం, ఆసందర్భం గా ఒక సారి బాధ పడటమూ న్యాయమే.

    ఇక ఇలా ఆగ్రిగేటర్ లు ఎందుకు మూతబడుతున్నాయి? దీనికి కారణాలు అనేకం. ఆర్ధికం... ఏదీ ఊరకేరాదు... ఈ సేవను వినియోగించుకుంటున్నవారు ఎందుకు డబ్బు చెల్లించరు? నెలకు పది రూపాయలు బ్లాగువారి చెల్లించాలంటే ఎన్ని బ్లాగులుంటాయి? ఎంతమంది ముందుకొస్తారు. మరి అలా తమిల్నాడులో జరగటం లేదా? వారికి మనకంటే భాషాభిమానం మెండే. అది అమలు చేయాలి. బ్లాగుల ద్వారా ప్రచారం చేస్తున్న మత, రాజకీయ, వస్తువుల అడ్వర్టైజ్మెంట్ల, రాజకీయ బ్లాగుల్ని ఆగ్రిగేటర్ నుంచి తొలగించాలి. వీటికి వేరుగా ఆగ్రిగేటర్ పెట్టుకోవచ్చు, దానికి డబ్బు కట్టుకుని సేవ పొందచ్చు, అదెందుకు చెయ్యరు?

    బ్లాగుల్లో కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలని, ఇతరులని నిందించడం వగైరాలని కూడా ఆగ్రిగేటర్ లు చర్యలు తీసుకునేలా ఉండాలి. దానికొక కమిటీ వగైరాలుంటే మంచిది. అందరు హక్కుల గురించేగాని బాధ్యతల గురించి మాటాడరు.

    మీ ఆగ్రిగేటర్ మూతబడి తెరుచుకుంది, కారణాలు మీకంటే మాకు బాగా తెలియవు కదా? ఉన్నది ఉన్నట్టు చెప్పెయ్యండి :) మూతబడడానికి కారణాలని కొన్ని కట్టు కథలు ప్రచారం లో కూడా కొంతమంది ప్రారంభించారు.

    మరో ఆగ్రిగేటర్ మరో రోజు మూతబడుతూనే ఉంటాయి


    ReplyDelete
    Replies
    1. మీ సూచనలు బాగున్నాయి.

      Delete
    2. హేపీ న్యూ ఇయర్ శర్మ గారు&శ్యామలీయం గారూ .. ముందుగా కామెంటిన మీకు ధన్యవాదాలు. మీ సూచనలు బాగున్నాయి . నిజంగా తెలుగు బ్లాగర్లకు ఆగ్రిగేటర్లు అవసరమా అంటే తప్పక అవసరం. బ్లాగుల కంటే ఆగ్రిగేటర్లే ఎక్కువ అవసరం . ఇవి తమ టపాలకు ఉచితంగా ప్రచారం అందించే సాధనాలు .. అయినా ఆదుకోకపోతే పోయారు తరచూ వాటిని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు కొందరు. అయినా వాటిలో వచ్చే టపాల నియంత్రణ ఆయా సంకలినుల చేతుల్లో లేదు కదా. ముందే చెప్పినట్లుగా బ్లాగిల్లు మూతవేయడానికి కారణం ఆర్ధిక కారణం కానే కాదు . ఎన్ని ఆర్ధిక సమస్యలు ఉన్నా దాన్ని వ్యయ ప్రయాసలకోర్చి నడుపుతూనే వచ్చాను. చివరిలో ప్రోత్సాహం కరువై ఆపేసాను .
      కూడలి లాంటి స్క్రిప్ట్ రెడీగానే ఉంది. కానీ ఆల్రెడీ "కూడలి" ఉండగా ఇక ఎందుకు అని ఆపేసా. ఇప్పుడు ఎక్కువమంది బ్లాగర్లు కోరుకుంటే మరో పేరుతొ ప్రారంబిద్దామని అనుకుంటున్నాను. అది ఎక్కువమంది కోరుకుంటేనే...

      Delete
    3. కోరు కుంటున్నా

      జిలేబి

      Delete
    4. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు. తప్పనిసరిగా మీరు అగ్రిగేటర్ ప్రారంభించండి. నేను కోరుకుంటున్నా సర్. అన్నట్టు నా బ్లాగ్ వేదికను కూడా ముందుకు తీసుకొచ్చాను.
      http://blogvedika.blogspot.in/

      Delete
  2. బ్లాగు రిజిష్ట్రేన్ కు పది రూపాయలు, సంవత్సర చందా వంద రూపాయలనండి ఎంత మంది ముందుకొస్తారో చూసి చెప్పండి

    ReplyDelete
    Replies
    1. పదేమిటండీ. ప్లేటు ఇడ్లీ కూడా రాదు! ఒకప్రక్కన ఎడాపెడా ఇత్తడిసిబ్బె అంత పిజ్జాకు నాలుగైదు వందలు ఇస్తున్నాం కదా సంవత్సర చందా కూడా ఒక వందా!! ఒక సంగతి చెబుతానండీ. హోమియోపతీ డాక్టరుగారు చిన్నగదిలో చెక్కకుర్చీలో కూర్చుని, ఫీజు రూపాయీ రెండురూపాయలూ తీసుకుంటూంటే, ఎవరూ వచ్చేవారు కాదు - ఇప్పుడు ఏసీ గ్లాసు కాబిన్లలో కూర్చుని కన్సల్టేషన్ ఐదువందలంటే జనం క్యూలే క్యూలు ఆ లోపలి డాక్టరు రిపర్టరీ చూసి మందులిచ్చే యావరే కాండేట్ ఐనా సరే. తగిన ఫీజు ఉండాల్సిందే నండీ. తప్పదు.

      Delete
    2. దీనికి సిద్ధపడేవాళ్ళెంతమంది?

      Delete
    3. సరేనండీ, ముందుగా నా పేరు వ్రాసుకోవలసింది.

      Delete
  3. శ్రీనివాస్ గారు డబ్బులు లేకుండా మీరు కొత్త ఆగ్రిగేటర్ ప్రారంభించడానికి నాకు సమ్మతి కాదు, ఆపై మీ ఇష్టం

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, శర్మ గారు ! చందాలేసుకుని సంకలినులను నడుపుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి తెలుగు బ్లాగులు రాకూడదనేది నా ప్రగాఢ విశ్వాసం.

      Delete
    2. అది దౌర్భాగ్యం అనుకుంటే వీరిలో మార్పు ఎండమావే, ఇది నిష్ఠుర సత్యం

      Delete
    3. మీ అభిప్రాయం కూడా ఆలోచించవలసినదే . ఇంకో అనుమానం - కామంట్ల విభాగాలవల్ల ఈ ప్రోబ్లమ్స్ అంటారా ?

      Delete
    4. కామెంట్ల విభాగం అవసరమే! చాలా చాలా! మీరు రుసుముకు సిద్ధపడితే రూల్స్ తయారు చేసేయచ్చు,వాటిని ఆమోదానికీ పెట్టచ్చు, వాటిని అమలూ చేయచ్చు, అప్పుడు అందరికి హక్కులూ జ్ఞాపకం వస్తాయి,బాధ్యతలూ నెత్తికెక్కుతాయి.

      Delete
    5. చందాలేసుకుని సంకలినులను నడుపుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి అనుకోకండి శ్రీనివాస్ గారూ, ఇంగ్లీష్ బ్లాగుల్లో కూడా పెయిడ్ సర్వీస్ అగ్రిగేటర్లు బాగానే ఉన్నాయి. అలా అనుకుంటే మనం ISP వాళ్ళకు చందా ఇస్తున్నామా ఫీజా?

      Delete
  4. శ్రీనివాస్ గారు, ఈ తోవలో మీ ప్రయత్నముకు నా ప్రోత్సాహము తప్పకుండా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ప్రసాదరావుగారూ నమస్కారం! మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందనేది నాకు తెలుసు

      Delete
  5. An aggregator fettered(by whatsoever means) fetters the blogging world;

    zilebi

    ReplyDelete

  6. Wishing a Happy New Year 2016!

    cheers
    zilebi

    ReplyDelete
    Replies
    1. Wish you Happy & prosperous New Year 2016

      Delete
  7. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. @Lasya P మీకు కూడా ఆంగ్ల నూతనసంవత్సర శుభాకాంక్షలు

      Delete
  8. తెలుగులో క్రొత్త ఆగ్రిగేటర్ కావాలని కోరుకున్నవారు ఇప్పటివరకూ ఆరుగురు ( కామెంట్లని బట్టి ) ... ఈ ఆరుగురికోసం అంత శ్రమ అవసరమా !
    జైహింద్

    ReplyDelete
  9. భూమి గుండ్రముగానున్నది. అందుచేత ఉన్నచోటనే ఉన్నట్లే ఉండుటుత్తమము :)

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు శర్మాజీ !

      Delete
  10. శ్రీనివాస్ గారు, మీరు మరో అగ్రిగేటర్ ప్రారంభిస్తే అందుకు నా పూర్తి మద్దతు ఉంటుంది.

    బ్లాగులు, అగ్రిగేటర్ లలో ఎక్కువ తక్కువలు చూడడం సముచితం కాదని నా అభిప్రాయం. అవి రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీగానే ఉంటాయి తప్ప పోటీగా ఉండవు.

    బ్లాగ్ లు కంటెంట్ ని సృజిస్తే వాటిని పాఠకులకు సమీపంగా తెచ్చేవి అగ్రిగేటర్ లు. సృజన ఎంత అవసరమో అది చదువరులకు చేరడమూ అంతే అవసరం. బ్లాగులను, పాఠకులను ఒక చోటికి చేర్చే సాధనాలైన అగ్రిగేటర్లు ఎన్ని ఉన్నా నష్టం లేదు, బ్లాగావరణాన్ని కలుషితం చేయానంతవరకూ!

    బ్లాగుల్లో ఏ అంశాలు రాయాలి అన్న విషయాన్ని బ్లాగర్లకే వదిలిపెట్టడం ఉత్తమం. అదే ప్రజాస్వామికం కూడా. ఫలానా అంశాల మీద వ్రాస్తేనే అగ్రిగేటర్ లో చేర్చుతాం అని షరతు విధించడం 'భావాలకు సంకెళ్లు విధించడం'తో సమానం.

    మానవ జీవితంలో ఎన్ని పోకడలు ఉన్నాయో అవన్నీ సృజనశీలమైనవే. పుల్ల, పిల్ల, బిళ్ళ ఏవీ కవితకు అనర్హం కానట్లే బ్లాగ్-సృజనకు ఏవీ అనర్హం కావని నా అభిప్రాయం. సృజనాత్మక ఉపయోగం ఉన్నదా లేదా అన్నదే బ్లాగ్ ఉనికికి కొలబద్దగా ఉండాలి.

    అంతే తప్ప ఇష్టం ఉన్న, లేని అంశాలుగా చూసే పరిమితి దృష్టితో బ్లాగుల ఉనికిని ఆహ్వానించడం లేదా నిరాకరించడం చేస్తే అది బ్లాగ్ ల సంఖ్య పెరగడానికి బదులు తగ్గిపోవడానికే దోహదం చేస్తుంది.

    డబ్బు వసూలు చేయవచ్చా అన్న ప్రశ్నకు నా సమాధానం: బిగ్ నో! డబ్బు వసూలు అంతిమంగా కొద్దిమందికి ఎక్కువ ధరతో ప్రీమియం సేవలు అందించే పరిస్ధితికి దారి తీస్తుంది. 'నెట్ న్యూట్రాలిటీ' అనే ఉదాత్తమైన ప్రజాస్వామిక లక్ష్యానికి తూట్లు పొడుస్తుంది.

    ఒక్క ముక్కలో చెప్పాలంటే మార్క్ జుకర్ బర్గ్ తలపెట్టిన 'ఫ్రీ బేసిక్స్' తరహాలో బ్లాగుల పరిస్ధితి తయారవుతుంది. ఇది తెలుగు బ్లాగులకు ప్రోత్సాహకరం కావడానికి బదులు మరింత నిరుత్సాహకరం అవుతుంది.

    చివరిగా..., పరిశీలనకు, అధ్యయనానికి సులువుగా ఉంటుందన్న దృష్టితో విజ్ఞానాన్ని వివిధ సబ్జెక్టులుగా విభజించుకున్నాం. ఈ విభజన అర్ధం ఈ సబ్జెక్టులు అన్నీ విడివిడిగా భౌతికంగా ఉనికిలో ఉంటాయని అర్ధం కాదు.

    వాస్తవంలో సమస్త అంశాలు ఒకదానిలో ఒకటి మిళితమై, ఒకదానితో ఒకటి పెనవేసుకుని మనిషి జీవితంలో ఇమిడి ఉంటాయి. అలాంటి జీవితంలో ప్రతి అంశమూ -సమాజం, కళలు, సంస్కృతి, రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, రచన, చరిత్ర...- విస్మరించరానిది. ముందే చెప్పినట్లు అది సృజనశీలంగా ఉన్నదా అన్నదే ఉనికికి కొలబద్ద.

    స్ధల, కాలాలను బట్టి పరిస్ధితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కూడలి మూతబడడం నిస్సందేహంగా బాధాకరం. కానీ 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది' అని కవిగారు చెప్పినట్లుగా 'మరో అగ్రిగేటర్ పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చేసింది కదా. అది ఒక ప్రారంభం.

    'ఎంతో పరిశోధించి అగ్రిగేటర్ లో ఆధునిక మార్పులు తెస్తే పాఠకులు స్పందించలేదు' అన్న బాధ మీకు వద్దని నా సూచన. పాఠకులు, బ్లాగర్ల వసతికి అనుగుణంగా ఉంటేనే ఆదరణ ఉండగలదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. దేశాల మధ్య, ప్రాంతాల మధ్యా తేడాలు ఉన్నట్లే అక్కడి బ్లాగర్లు, పాఠకుల స్ధాయిల్లోనూ తేడాలు ఉన్నాయి. ఆయా స్ధల, కాలాలను బట్టి రాత, చదువులు ఉంటాయి.

    గుర్రాన్ని వాగు వరకూ తీసుకెళ్లగళం. కానీ దాని చేత బలవంతంగా నీళ్ళు తాగించలేం. గుర్రానికి దాహం వేస్తేనే నీళ్ళు తాగుతుంది. లేదంటే తాగదు. కానీ గుర్రానికి దాహం వేసినప్పుడు వాగు వద్ద లేకపోతే దాని దాహం తీరదు. అప్పుడు తప్పనిసరిగా రౌతు సాయం గుర్రానికి కావాల్సిందే.

    కాబట్టి బ్లాగులు ఉండాలి. అగ్రిగేటర్లు ఉండాలి. బ్లాగుల్లో సృజనశీలత ఉండాలి. ఇవి మూడూ ఉన్నప్పుడు తెలుగు బ్లాగులు వర్ధిల్లుతాయి. ఈ మూడూ అన్నీ వేళలా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. లేనప్పుడు నిరాశవద్దు, ఉన్నప్పుడు అతిశయమూ వద్దు.

    మళ్ళీ... కొత్త అగ్రిగేటర్ ఆరంభిస్తే మొదటి మద్దతుదారు నేనే అవుతాను.

    ముందస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలతో...
    విశేఖర్

    ReplyDelete

hit counter