బ్లాగిల్లు వ్యాఖ్యల విభాగంలో మార్పులు

      ఇంతకు  ముందు చెప్పినట్లు 'బ్లాగిల్లు ' యొక్క వ్యాఖ్యల విభాగంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. వ్యాఖ్యలను రెండు కాలమ్ లుగా విభజించడం, ఒక్కో కాలమ్ లో దాదాపు  100 కామెంట్లు వచ్చేలా చేయడం జరిగింది . అంటే ఒకే పేజీలో 200 వరకూ కామెంట్లను వీక్షించవచ్చు . అవి సరిపోతాయి అని అనుకుంటున్నాను . ఇకపోతే -
      సాహిత్య , రాజకీయ చర్చా బ్లాగులకు ప్రత్యెక విభాగాలు మరియు పేజీలను రెండుకు పెంచడం అనేది మీ స్పందనను బట్టి చేయాలని నిర్ణయించుకున్నాను .
      క్రింది లింకు ద్వారా క్రొత్త వ్యాఖ్యా విభాగాన్ని వీక్షించి మీ స్పందన తెలియచేయగలరు .

11 comments:

  1. బాగుంది శ్రీనివాస్ గారు. అక్కడక్కడా ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక చర్చావేదికలు - సాహిత్యం అనే ప్రత్యేక విభాగాలు అంతగా అవసరం లేదనుకుంటాను. వీలయితే చేసినా బాగానే ఉంటుంది.

    ReplyDelete
  2. శ్రీనివాస్ జీ,

    మీరు చేసిన మార్పు చాలా బాగుందని నిన్ననే చెప్పేను. రాజకీయ సాహిత్య కామెంట్ల లో మామూలు బ్లాగరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వీరి కామెంట్లు, మీరెంత జాగ్రత తీసుకున్నా, కామెంట్ల వరదలో మామూలు బ్లాగరు కామెంట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. అందుకు వాటిని వేరు చేస్తే కాని సామాన్య బ్లాగరు బతకలేడు, ఇది నా అభిప్రాయం. మీరు ఎరుపు రంగు ఇచ్చారు అదీ గమనించాను. రాజకీయ, సారస్వత కామెంట్లు ఒక పేజిలో వేరుగా ఇస్తేనే మంచిదని.... ఆ పై మీ ఇష్టం మా భాగ్యం....అడిగేరు కనక ..........చెప్పడం మా ధర్మం.......

    ReplyDelete
  3. శ్రీనివాస్‌ గారు,

    అభినందనలు. వ్యాఖ్యల విషయంలో మీరు చేస్తున్న ప్రయోగాలు ఉపయుక్తంగా వ్యాఖ్యాతలకు ఆకర్షణీయంగా ఉంటాయని ఆశిస్తున్నాను. కొన్ని వ్యాఖ్యలు సుదీర్ఘంగా ఉంటాయి. అందుచేత చూపించే ప్రతి వ్యాఖ్యను ఒక రెండు లైనుల కన్నా మించకుండా అతిక్లుప్తంగా చూపితే‌ మరిన్ని వ్యాఖ్యలకు చోటు చూపి పుణ్యం‌ కట్టుకుంటారు. అలాగే వ్యాఖ్యలలో‌ html tags యథాతధంగా వచ్చేస్తున్నాయి - అది సరి కాదు. ఒక ప్రయోగాత్మకమైన సూచన: ఏ బ్లాగుకు సంబంధించి ఐనా సరే latest పది పదిహేను వ్యాఖ్యలనే‌ చూపేటట్లు నియంత్రిస్తే మరిని వ్యాఖ్యలకు మీ‌ పేజీలో చోటు దొరుకుతుంది; వరదల్లా వ్యాఖ్యలు సంపాదించే బ్లాగులు అప్పుడు మీ పేజీని తినెయ్యలేవు.

    ReplyDelete
  4. శ్యామలీయం గారూ,
    మీ ఆప్యాయతకు కృతజ్ఞతలు. వ్యాఖ్యల నిడివి పూర్తిగా ఉంచితేనే అర్ధవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను . బ్లాగు టపాలకోసం బ్లాగులకు వెళ్ళాలి గానీ వ్యాఖ్య మొత్తం ఒకేచోట ఉండడంలో తప్పులేదని నా భావన. వ్యాఖ్యలలోని html టాగ్స్ కూడా ఉంటేనే బాగుంటుందని అలా చేసాను . వ్యాఖ్య అలంకారం, నిడివి పూర్తిగా ఇక్కడే చూపాలని నా ఆలోచన . నా భావనలోని లోపాన్ని మీ అభిప్రాయంతో తీర్చగలరు.
    మీరన్నట్లు వ్యాఖ్య ఎంతపెద్దది అయినా చూపించే వ్యాఖ్యల సంఖ్యలో తేడా రాదు . కాస్త పేజి లోడ్ సమయం , పేజి సైజు పెరుగుతాయంతే .

    ReplyDelete
  5. శ్రీనివాస్ గారూ,

    వ్యాఖ్యలను పూర్తినిడివితో చూపితే అర్థవంతంగా ఉండే మాట వాస్తవమే ఐనా, పేజీ load అయ్యేందుకు హెచ్చు సమయం పట్టటం ఒక రకమైన deterrent కావచ్చును అని నా అనుమానం. పేజీ నిడివి ఎక్కువైతే మౌస్‌ సహాయంతో ఎక్కువగా scroll చెయవలసిరావటం కూడా ఒక ఇబ్బందే అనిపించవచ్చునేమో ఆలోచించండి. సగటుపాఠకులకు ఈ html tags పానకంలో పుడల్లాగా ఇబ్బందికరంగా ఉండవచ్చును. మీ‌ భావనలో ఏమీ లోపం లేదు. కాని చదువరుల సహనాన్ని గురించి కూడా మనం కొంత గమనికతో ఉండాలేమో‌ అన్నది నా అభిప్రాయం. అంతకంటే మరేమీ లేదు.

    ReplyDelete
  6. శ్రీనివాస్ గారూ మరొక్క మాట. తరచుగా వ్యాఖ్యలు వచ్చే బ్లాగు యొక్క వ్యాఖ్యలను యథాతధంగా ప్రకటించటం వలన ఆ బ్లాగు తాలూకు comment section మొత్తం reproduce చేయటమే కావచ్చు. ఇది అభిలషణీయమో అనివార్యమో అని మీ రనుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు.

    ReplyDelete
  7. వ్యాఖ్య పూర్తిగా చదవడానికి బ్లాగులోకెళ్ళాల్సివస్తే మరో రెండు హిట్లు బ్లాగుకి బోనస్ ఇచ్చినవారవుతారు కదా :)

    ReplyDelete
    Replies
    1. ఇదేదో బ్లాగర్ల తరపు వాదనే :))

      Delete
    2. బ్లాగుల్లోని వ్యాఖ్యలు సంకలినుల్లో ( నాకు తెలిసి మాలికలో కూడా ) పూర్తిగా కనబడకూడదు అనుకుంటే మీ బ్లాగు డాష్ బోర్డు సెట్టింగ్స్ లో ఫీడ్ ను short లేదా బ్రేక్ వరకు గా చేయమని మనవి . ఇది " చర్చావేదిక" ల వాలు పాటిస్తే మంచిది

      Delete
  8. ఎవరూ ఏమీ అనుకోనంటే నా వాదన - వ్యాఖ్యలు బ్లాగు టపాకి advertisement లాంటివి .. అవి పూర్తిగా ఉంటేనే కార్యం సాఫల్యం .. ఏమంటారు ?

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే కావచ్చు

      Delete

hit counter