సరిక్రొత్త విభాగం - బ్లాగిల్లు30

బ్లాగిల్లు30- ప్రతీనెలా బ్లాగిల్లుచే 30 తెలుగు బ్లాగులు ఎంపికచేసి ఈ విభాగంలో జతచేయబడుతాయి. ఈ బ్లాగులలో ఉన్న ప్రత్యేకతలు -
 1.తరచూ వ్రాయబడడం
2. నాణ్యమైన టపాలు అందించడం
3.కేవలం తెలుగులోనే వ్రాయబడడం
ఈ లిస్ట్ ప్రతీనెలా మొదటివారంలో నవీకరించబడుతుంది.
సాంకేతిక కారణలవల్ల ఈ లిస్ట్ ను ప్రస్తుతానికి 30 కి పరిమితంచేసాం. వచ్చేనెలనుండి 50 బ్లాగులు ఎంపికచేయబడుతాయి.
బ్లాగిల్లు ఎంపికచేయనంతమాత్రాన మిగతావి గొప్పవి కావని కాదు- మాకు అందుబాటులో ఉన్న, బ్లాగిల్లు డైరెక్టరీలో ఉన్న బ్లాగుల్లోంచి ఎంపిక చేసిన "మంచి ముత్యాలు" ఇవి.
ఈ లిస్ట్ లోని బ్లాగుల్లో మీ బ్లాగు లేదని కోపం వద్దు... మీ బ్లాగు మాకు పంపండి . అందరికీ నచ్చుతుందని భావిస్తే లిస్ట్ లో చేర్చే అవకాశం ఉంది.
ఎంపికచేసే విధానం: బ్లాగిల్లు కు అందుబాటులో ఉన్న 3621 బ్లాగులు కంప్యూటర్ లోని ఫీడ్ రీడర్ ద్వారా అప్ డేట్ చేయబదుతూ ఉంటాయి. వాటి లో ఆ నెలలో ఎక్కువగా వ్రాసిన 100-200 బ్లాగులు తీసుకుని అందులోనుంచి నణ్యమైన టపాలు వచ్చిన బ్లాగుల గుత్తి ఈ లిస్ట్.
link: http://blogillu.com/top

No comments:

Post a Comment

hit counter