తెలుగు బ్లాగర్లకు ప్రీతిదాయకమైన "బ్లాగిల్లు" తన ముంగిలిని మరింత ముస్తాబుగా తీర్చిదిద్దింది. మరిన్ని క్రొత్త విభాగాలు సృష్టించబడ్డాయి. బ్లాగర్ల చర్చల కోసమై " చర్చా వేదిక " ప్రారంబించబడింది. చర్చా విషయాలు మీరూ మొదలు పెట్టొచ్చు. దానిపై జవాబులు, స్పందనలూ ఆహ్వానించవచ్చు.
"క్రొత్తగా చేరిన బ్లాగర్లు" అనే విభాగాన్ని ప్రారంబించాము. దీన్ని మరింత మెరుగ్గా మార్చి క్రొత్త బ్లాగర్లను విపులంగా పరిచయం చేసేందుకు, వారి బ్లాగు గురించి ఉపోద్ఘాతం అందించేలా ఒక ప్రత్యేక విభాగమూ రాబోతున్నది. ఇది డేటాబేస్ లో ఎప్పుడైనా చదవడానికి వీలుగా ఉంటుంది. దీనిలో సాధ్యమైనంత వరకూ ప్రతీ బ్లాగు/బ్లాగరు గురించి వ్రాయబడుతుంది( దీనిపై క్రొత్త ఆలోచనలు తెలుపగలరు ) .
మీకు ఇదివరకే తెలిసిన " బ్లాగు సమాచారం " శీర్షిక బ్లాగులోకానికే హైలెట్ అని కొందరంటున్నారు . దీనిపై మీ కామెంట్ ?!
మీ బ్లాగులు ప్రచారం చేసుకునేందుకు ఫేస్ బుక్ కామెంట్ విభాగం కూడా ఉంది.
ఇప్పటివరకూ "బ్లాగిల్లు" లో 3945 బ్లాగులు ( వార్తా, సినిమా బ్లాగులు కాక ) ఉన్నాయి. వీటన్నింటితో ఒక డైరెక్టరీ త్వరలో రాబోతుంది.
ఇకపోతే అంతగా విజయం సాధించని ప్రశ్నోత్తరాలు విభాగం తొలగించాము.
ఇంతకుముందు హోం పేజిలో ఉండే పోస్టుల విభాగాన్ని విభాగానికి మార్చాం. ( ఇది ముఖ్యంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు పోస్టులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది).
ఇంకా ఏవైనా మార్పులు మీరుకూడా సూచించండి. వాటిని తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాం.
మీ
బ్లాగిల్లు

No comments:
Post a Comment