సరికొత్త రూపంలో "బ్లాగిల్లు" : ఇది బ్లాగు చరిత్రలో విప్లవం

"తెలుగు బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్ష"లతో మన తెలుగు ఆగ్రిగేటర్ "బ్లాగిల్లు" పూర్తి క్రొత్త రూపాన్ని సంతరించుకుంది...తెలుగు బ్లాగు చరిత్రలో సరిక్రొత్త విప్లవానికి నాంది పలికింది!





ముఖ్యమైన ఫీచర్లు:
1.WEB 2.0 interface
2.అత్యధిక వేగం
3.వీక్షకులు తమ అకౌంటులు తెరుచుకోవచ్చు. తమకు నచ్చిన న్యూస్ ఫీడ్లను ఎంచుకోవచ్చు.
4.వీక్షకుల క్లిక్ లను బట్టి "ముఖ్య పోస్టులు" ఆటోమేటిక్ గా కూర్చబడుతాయి.
5.అత్యధిక పేజీల్లో ఎక్కువ పోస్టులు వీక్షించే అవకాశం.
6.నచ్చిన పోస్టులను 50 కి పైగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ లతో వేగంగా షేరింగ్ చేయవచ్చు.(social nework sharing).

రాబోతున్న ఫీచర్లు:
1.తెలుగు వార్తా పత్రికలనూ ఇక్కడే చూడొచ్చు.
2.అతి ఎక్కువ బ్లాగు ఫీడులు.
3.ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉండడంతో అన్ని బ్లాగుల వీక్షకులూ పెరుగుతారు.తెలుగు బ్లాగర్ల సంఖ్యా పెరుగుతుంది.(Increase of blog traffic)
4.నచ్చిన పోస్టులకు వోటింగ్ చేసే అవకాశం.
5.అత్యధిక విభాగాలు.
.
ఇంకా మరిన్ని సదుపాయాలు,ఫీచర్లు త్వరలో రాబోతున్నవి...

        ఈ బ్లాగుల దినోత్సవం తెలుగు బ్లాగర్లకు, బ్లాగు ప్రేమికులకు అనేక అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ....

3 comments:

  1. మరొ కొత్త ఆగ్రిగేటర్. బాగున్నది. కాని, ఈ ఆగ్రిగేటర్లో నా బ్లాగు చేర్చమని నేను అడిగిన గుర్తులేదు. కాని నా బ్లాగు మీ ఆగ్రిగేటర్లో కనపడుతున్నది!

    తరువాత, నా బ్లాగు పేరు లేకుండ ప్రచురించటం ఏమిటి? నేను పెట్టిన శీర్షిక మాత్రమే కనపడుతున్నది. ఆ శీర్షిక నొక్కి, అక్కడ ఉన్న రీడ్ మోర్ క్లిక్ చేస్తే తప్ప ఈ వ్యాసం ఎక్కడ నుంచి వచ్చినది తెలియకుండా చేశారు. ఎవరన్నా వచ్చి చూస్తే ఈ వ్యాసాలన్నె ఈ ఆగ్రిగేటర్ వారే ప్రచురించారు అన్న భ్రమ కలిగిస్తున్నది. ఈ పధ్ధతి నాకు నచ్చలేదు.

    మొదటి పని, బ్లాగరు నుండి లాంచన ప్రాయంగా రిక్వెస్ట్ వచ్చినప్పుడు
    మాత్రమే ఆ బ్లాగు ఆగ్రిగేటర్ లో చేర్చటం పధ్ధతి. లేదా మీకు మీరే మీ ఆగ్రిగేటర్ లో ఏదైనా బ్లాగును చేర్చదలుచుకుంటే, ఆ మాట బ్లాగరుకు ముందుగా తెలియచెయ్యాలి, ఆ బ్లాగరు అనుమతి తీసుకోవాలి.

    ఆపైన, బ్లాగులో ప్రచురించబడిన వ్యాసం పక్కనే ఆ బ్లాగు పేరు తప్పనిసరిగా కనపడాలి.

    ఈ రెండు మార్పులూ దయచేసి వెంటనే చెయ్యగలరు. అలా చెయ్యలేని పక్షంలో, నా బ్లాగు మీ ఆగ్రిగేటర్ నుంచి తొలగించగలరు.

    ReplyDelete
  2. manchu sila novel downlaod chesaka open avvadam ledu
    password aduguthundi
    how can i open
    plz help me

    ReplyDelete
  3. what is the document password

    ReplyDelete

hit counter