ఇక 'బ్లాగిల్లు' కు బై బై

గత నాలుగేళ్ళుగా తెలుగు బ్లాగు ప్రపంచానికి సేవలందించిన 'బ్లాగిల్లు' ఇక మీకు కనపడదు .
 మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి .
ముఖ్యంగా- మీ మీ బ్లాగుల నుండి బ్లాగిల్లుకు సంబందిచిన బొత్తాలు ( Widgets ) దయచేసి తొలగించుకోగలరు .

 ఇక 'బ్లాగిల్లు' కు బై బై

15 comments:

  1. నమస్తే. బ్లాగిల్లుని తీర్చిదిద్దటం కోసం ఎంతో శ్రమించారు. హఠాత్తుగా బ్లాగిల్లు అదృశ్యం అవుతోందన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషాదకరపరిణామానికి కారణాలు మీరు పేర్కొనలేదు. ఏదో బలమైన కారణం ఉండకపోతే ఇలాంటి హఠాన్నిర్ణయం వెలువడదని మాత్రం అర్థం చేసుకోగలం. ఇంతకాలమూ బ్లాగిల్లు చేసిన సేవలకు కృతజ్ఞతాపూర్వకధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. బ్లాగిల్లు పై మీకు గల అభిమానానికి కృతజ్ఞతలు సార్! కాకపొతే గత కొంతకాలంగా తెలుగు వారికి బ్లాగులపై ఆసక్తి మరీ తగ్గిపోతుందేమో అనిపిస్తున్నది . బ్లాగిల్లులో శ్రమకోర్చి కొన్ని మార్పులు, చేర్పులు తీసుకు వస్తున్నా కొందరు మాత్రమె స్పందిస్తున్నారు . అదీ పాత బ్లాగర్లు మాత్రమె .క్రొత్తగా ఒక్క బ్లాగరూ తెలుగు బ్లాగు లోకంలో సరిగా స్పందించడం లేక పోతున్నారు . ఇది బ్లాగులన్నింటికీ వర్తిస్తుంది. కొంతకాలం క్రితమే నయమేమో ! తిట్టుకున్నా ఎక్కువమంది తమ అభిప్రాయాలు చెప్పేవారు . మళ్ళీ మంచి రోజులు వస్తే అప్పుడు చూద్దాంలే అని ప్రస్తుతానికి బ్లాగిల్లుకు "తాళం" వేసేశాను

      Delete
  2. మీ రన్నది నిజమే అనిపిస్తున్నది. కొందరు బ్లాగర్లు ఇతర మార్గాలు చూసుకున్నారు - టిట్టర్లు, ఫేసుబుక్కులూ వంటివి. కొందరు బ్లాగర్లు చదువరులు స్పందించటం లేదని వ్రాయటం తగ్గించుకున్నారు, కొందరు బ్లాగర్లు అసందర్భపు వ్యాఖ్యలవంటి స్పందనలకు విరక్తి కలిగి వ్రాయటం తగ్గించుకున్నారు. ఇలా రకరకాల కారణాలతో బ్లాగులోకంలో వాసి రాశి రెండూ తగ్గాయి. ఐనా చూడండి, ఎక్కువ వ్యాఖ్యలు దాడులు ప్రతిదాడులుగానో విషయ లేదా సందర్భరహితంగానో లేదా కొందరి నిరంతరరొదల్లాగానో కనిపిస్తున్నాయి, టపాలు రాజకీయాలు సినిమాలు వంటివాటికీ తేలని విషయాలపై గుడిపూడి జంగాల చర్చలకీ కుంచించుకు పోతున్నాయి. నేనైతే ప్రయత్నించి కూడా వ్రాయలేకపోతున్నాను ఈ వాతావరణంలో ఈ మధ్య కాలంలో. మీరు కూడా ఎంత విరక్తి కలిగితే బ్లాగిల్లుకు తాళం వేసారో అనిపించి బాధకలుగుతున్నది.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ ! నమస్కారం .. నాకు తెలిసి ప్రస్తుతం తెలుగులో వాస్తున్న బ్లాగర్లు అతి తక్కువమంది ( కేవలం ఒక చేతి వేళ్ళతో లేక్కపెట్టగలిగినంతమంది) సమాజ శ్రేయస్సు కోసం వ్రాస్తున్నారు . దాదాపు మిగతా అందరూ తమ పేరు కోసమో, తమ కార్యకలాపాల ప్రచారం కోసమో, భవిష్యత్ ప్రయోజనాలు ఆశించో చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆ విధానమే తెలుగు బ్లాగులను దేబ్బతీస్తున్నది .

      Delete
    2. మీ రన్నది నిజమే. ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి. కాలక్షేపం సరుకు తప్పా మరేమి పట్టని వారి సంఖ్యాబలం కారణంగా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయపడే వారి ప్రచారార్భాటాల కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానివ్వండి. కాలో దురతిక్రమణీయః అనుకుని ఊరకుందాం.

      Delete
  3. so much loss to bloggers.wish you come back soon!

    ReplyDelete
  4. sir కొత్త బ్లాగిల్లు కొత్త updates posts చూడడాని అసౌకర్యంగా వుంది కావున ఆదరణ తగ్గివుండచ్చు
    alphabet ప్రకారం మీరు ఇచ్చారు ఈ కలగూర గంప లొ మాకుకావలసినవి ఏరకోవడం కష్టమనిపించింది
    నేను చెప్పిన విషయం ఇబ్బంది కలిగించి వుంటె క్షమించండి

    ReplyDelete
    Replies
    1. సార్ ! జనాల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని అనుకోలేదు .ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంకలినులను స్టడీ చేసి మరిన్ని సదుపాయాలు ఇవ్వాలని అనుకున్నాను . చాలామంది తెలుగు వీక్షకులు కేవలం కూడలి, మాలిక లాంటి " బ్లాగుపేరు : టపా శీర్షిక " మూసకే అలవాటుపడ్డారు అందుకే వాటినే చూడనివ్వండి.

      Delete
  5. శ్రీనివాస్ జీ,

    నిర్ణయం బాధించేదే అయినా సరైనది, మంచి సమయం లో తీసుకున్నందుకు అభినందనలు. తెనుగు బ్లాగులు ఎలా ఉన్నాయన్నది మళ్ళీ చెప్పక్కరలేదు, అసలు బ్లాగు నిర్వచనమే మారిపోయింది... తెనుగు ఎక్కడుంది? ఉన్నదంతా ....

    ReplyDelete
  6. ఎప్పటికి తాళం తీయద్దు, తాళం పారేయండి..

    ReplyDelete
  7. "కొంతకాలం క్రితమే నయమేమో ! తిట్టుకున్నా ఎక్కువమంది తమ అభిప్రాయాలు చెప్పేవారు."
    చాల మంచి మాట చెప్పారు.
    నేనొక మాట చేరుస్తాను ... "ఆత్మీయతను పంచేవారు."

    ReplyDelete
    Replies
    1. డా.ఆచార్య ఫణీంద్ర గారూ ! నమస్కారం .. మంచిమాట సెలవిచ్చారు

      Delete
  8. శర్మ గారికి నమస్కారం,
    పెద్దలు మీరు నన్ను సరిగ్గా అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞుడిని. నేను కూడా ఇది సరైన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయంగా భావిస్తున్నాను . ఇల్లే కూలగోట్టాక ఇక తాళంతో పనే లేదను కుంటున్నాను సార్ :)

    ReplyDelete
    Replies
    1. ఎంతో ఇష్టపడి, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలగొట్టుకోవాసి రావటం ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలనండి. కాని 'అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిఖ' అని వాపోయిన కవిలాగే, అవ్యక్తులగుంపులా తయారవుతున్న ఈ తెలుగు బ్లాగుప్రపంచంలో ఇమడలేక సతమతమై విరమించుకున్న మీ బాధనూ గమనించాను.

      Delete

hit counter