"బ్లాగిల్లు" హోస్టింగ్ ముగిసింది... ఇక బ్లాగర్ పైనే

గత మూడు సంవత్సరాలనుండి బ్లాగిల్లును ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. బ్లాగిల్లు తరపున ఇప్పటివరకూ మీకోసం ఎన్నో ప్రయోగాలు చేసాను. దాదాపు అన్నీ విజయవంతం అయ్యాయి. "బ్లాగిల్లు అంటే కేవలం తెలుగు బ్లాగుల సంకలిని మాత్రమే  కాదు .. ఇది తెలుగు బ్లాగుల ఇల్లు " అనిపించుకొనే దిశగానే అన్ని ప్రయోగాలూ సాగాయి. బ్లాగిల్లు మొదలుపెట్టేనాటికి తెలుగులో నాలుగు సంకలినులు ఉండేవి . వాటిలో సమూహము కొద్దికాలానికే మూతపడగా , సంకలిని ఆ తర్వాత ఆగిపోయింది . చివరిగా అందరి ఆదరణ పొందిన హారం తెగిపోయింది . ప్రస్తుతం మిగిలి ఉన్న ఆగ్రిగేటర్ లు - కూడలి, మాలిక, జల్లెడ , బ్లాగిల్లు . ఇవికాక కొంతమంది ఔత్సాహికులైన బ్లాగర్లు బ్లాగర్ ద్వారా బ్లాగ్ లిస్టు విడ్జెట్ లో తెలుగు బ్లాగులను కలిపి సంకలినులుగా సేవలు అందిస్తున్నారు. పూదండ , బ్లాగ్ వేదిక , బ్లాగు ప్రపంచం వాటిలో కొన్ని.
బ్లాగిల్లు కొద్ది కాలం క్రితం బ్లాగర్ లోనూ తన సేవలను ప్రారంభించింది . blogillu .com లో ఏవైతే విభాగాలు , శీర్షికలు ఉన్నాయో అవే శీర్షికలు blogillu.blogspot.com లో వచ్చేలా వీలయితే మరిన్ని విభిన్నతలు ఉండేలా చర్యలు తీసుకున్నాను. వీటిలో ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఒకటి . ప్రస్తుతం blogillu.com తో సమానంగా blogillu.blogspot.com వీక్షకులను పొందుతూ ఉంది . అయినప్పటికీ ఏదో వెలితి! blogillu.comను మూసివేయాలా
వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోడానికి ఇబ్బంది. ఈరోజే బ్లాగిల్లు యొక్క హోస్టింగ్ కాలపరిమితి పూర్తయింది.  మళ్ళీ కాలపరిమితిని పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదు . కనుక ఇకపై బ్లాగిల్లు ( blogillu.com )
మాత్రమె నా అందుబాటులో ఉంది . దాని కాలపరిమితి మరో పదిహేను రోజుల్లో ముగియనుంది .
ప్రస్తుతం ఉన్న సందేహం blogillu .com డొమైన్ ను ఉంచాలా వద్దా అనేది. ఏమైనా వీక్షకులకు blogillu .com టైపు చేయడంలోని సౌలభ్యం blogillu .blogspot.com లో ఉంటుందా అనేది ప్రశ్నార్ధకం ?!
అందుకే ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసి బ్లాగిల్లు యొక్క ప్రస్తుత హోస్టింగ్ కు మాత్రం బై బై చెప్పేస్తున్నా ..
ఒకటి మాత్రం నిజం భవిష్యత్ లో బ్లాగర్ పైన ప్రయోగాలు చేసినా అవికూడా మా ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నాను.
మా సలహాలు సూచనలు ఎప్పటిలాగే కావాలి
 


5 comments:

  1. blogillu.com panicheyadam ledu .

    ReplyDelete
  2. you can transfer the domain to the present blog

    ReplyDelete
    Replies
    1. Of course, Mr. Chandra. If I decide to keep blogillu.com, I will definitely do that.

      Delete
  3. nakendhuko old blogillu look, ranking system nachaayi
    kotha system anthagaa nachatledhu. yemanukokandi yilaa coment chesthunnandhuku,
    just vidhaanam maaruthunnaa sandhi kaalamlo ee bhaavana sahjamemo gaani naaku old look lone nachindhi sir,
    ur
    chaitanya
    www.menavachaitanyam.blogspot.com

    ReplyDelete
    Replies
    1. చైతన్య గారూ ! పాత ర్యాంకింగ్ సిస్టం మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు . కానీ అది రన్ చేయాలంటే హోస్టింగ్ ఎకౌంటు ఉండాలి . కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదు .
      అది కేవలం బ్లాగు వీక్షకుల ఆధారంగా చేయబడే ర్యాంక్ ! ఇప్పుడు వచ్చింది బ్లాగు వీక్షకులే కాదు టపాలు , వ్యాఖ్యలు , ఇతర ర్యాంకుల ఆధారంగా చేయబడుతున్నది . ఇది లెక్కించడానికి చాలా కసరత్తు చేస్తున్నాను . మీకు దీనిలో ఏమైనా లోపం గమనిస్తే దయచేసి తెలుపగలరు . సవరించే ప్రయత్నం చేస్తాను . ఇక లుక్ అంటారా అది పాత దానిలా చేయడం కష్టమేమీ కాదు . రిప్లై చెయ్యగలరు

      Delete

hit counter