శ్రీ కంది శంకరయ్యగారి "శంకరాభరణం" బ్లాగు వ్యాఖ్యలకు కు ప్రత్యేక విభాగం

My Photo 


పూజ్యనీయ తెలుగు పండితులు శ్రీ కంది శంకరయ్యగారి "శంకరాభరణం" బ్లాగులోని వ్యాఖ్యలకు ఒక ప్రత్యేక సంకలిని పేజీని కేటాయించామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. 


ఈ సాహితీ బ్లాగుకు ఉన్న ఆదరణ మీకు తెలిసినదే. రోజూ దాదాపు వంద వ్యాఖ్యలు ఈ బ్లాగులో వస్తుంటాయి. ఈ బ్లాగులో వచ్ఛే కామంట్లవల్ల  ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలను చూడడానికి వీలవడం లేదని చాలామంది చెపుతున్నారు. అయితే ఈ బ్లాగుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఒక ప్రత్యేక విభాగం ప్రారంభించడం జరిగింది . ఇకపై ఈ బ్లాగులోని వ్యాఖ్యలు అక్కడ మాత్రమే చూడవచ్చు
ఆ విభాగాన్ని క్రింది లింకు ద్వారా చేరుకోవచ్చు  .

      ఇక్కడి నుండి6 comments:

 1. ఒక మంచి పని చేసారు శ్రీనివాస్ గారు.శంకరాభరణం బ్లాగును ఒక సమస్యగా గుర్తించినందుకు ధన్యవాదములు.ఒక సబ్ డొమైన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.

  ReplyDelete
  Replies
  1. క్షమించండి చౌదరి గారూ! ఆ బ్లాగును సమస్యగా గుర్తించలేదు. దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను అంతే. ఒక తెలుగు భాషాభిమానిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇక డొమైన్ samasya అంటే సమస్యాపూరణం అని అలాపెట్టాను.

   Delete

 2. ఒకే చోట చూడాలంటే ఆ బ్లాగ్ సైట్ కే వెళ్ళొచ్చు అగ్రిగేటర్ కి రావాల్సిన అవసరం ఉండదను కుంటా

  An aggregator is supposed to be a time based log is not it?

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ఒక్క శంకరాభరణం బ్ల్లాగే కాదు. సాహిత్యానికి సంబంధించినవి అన్నీ ఆ విభాగంలో ఉంచొచ్చు.

   Delete
 3. మంచి పని చేశారు. కంది శంకరయ్య గారంటేను, వారి విద్వత్తంటేనూ, ఆ బ్లాగులో సమస్యాపూరణం చేసేవారంటేనూ నాకు గౌరవమే కానీ ఆ వ్యాఖ్యల వెల్లువలో తతిమ్మా వ్యాఖ్యలు కొట్టుకుని పోకుండా మీరు చేసిన ఏర్పాటు పనికొస్తుంది. అలాగే సమస్యాపూరణం వ్యాఖ్యలకి లింక్ మెయిన్ "శోధిని" హోం పేజ్ లో ఇచ్చేస్తే ఉపయోగకరం కదా శ్రీనివాస్ గారు.

  ReplyDelete
  Replies
  1. సర్ నిజానికి కేవలం ఒక్క బ్లాగుకే ఒక ఆగ్రిగేటర్ అవసరం లేదనుకుంటాను. అందుకే ప్రస్తుతానికి హోమ్ పేజిలో లింక్ ఉంచట్లేదు.

   Delete

hit counter