ప్రధాని మోడీ దెబ్బకు పాక్ కి దిమ్మ తిరిగింది - మరి ఏం జరగబోతుంది?

ఇరుదేశాలూ స్వాతంత్ర్య వేడుకలకు రెడీ అవుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై  చేసిన ఘాటైన హెచ్చరిక పాకిస్థాన్ లో ప్రకంపనలే రేపుతొంది. ఇది మరో పాక్ విభజనకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా గుర్తింపును  పొందాయి.
ఇంతకూ ఆయన ఏమన్నారంటే పాక్ ఆక్రమిత కాశ్మిర్ భారత్ లో భాగమే అని గట్టిగా అంతర్జాతీయ సమాజానికి చెప్పారు . అంటే కాదు పాక్ లోని బెలూచిస్థాన్ లో జరుగుతున్న దురాగతాలను ప్రస్తావించారు . ఒక భారత  ప్రధాని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఒక సాహసమే అని చెప్పొచ్చు. అందరూ సాహసనారిగా చెప్పే  ఇందిరాగాంధీ గానీ, వాజపేయి , నెహ్రూ  లాంటి దిగ్గజాలకే రాని ఈ ఆలోచన మోడీకి రావడం సాహసమే అయినా అది అటు పాక్ ప్రజల మద్దతు కూడా పొందడం ఆలోచించాల్సిన విషయమే ! ఇక నుండి పాకిస్థాన్ కాశ్మీర్ విషయం ప్రస్తావించినప్పుడల్లా పీఓకే గురించి, బెలూచిస్థాన్ గురించి ప్రస్తావించే అవకాశం లేకపోలేదు అని చెప్పకనే  చెప్పారు మోడీ ... 
మోడీకి వచ్చిన ఆలోచన ఇంతవరకూ ఏ భారత ప్రధానికీ  ఎందుకు రాలేదో గానీ ఈ సాహసం చేయడం వెనుక మోడీ భారత్ భవిష్యత్ పాలకుల ధోరణిలో మార్పు తీసుకు వచ్చేలా  చేశారనడంలో అతిశయోక్తి లేదు . అయితే ఈ గొడవ ముదిరి మరో యుద్ధానికి దారితీస్తే అది తట్టుకోగల స్థాయిలో భారత్ ఉందా? 
నిజానికి పాకిస్థాన్ ఆగడాలు పీఓకే లో ఈ మధ్య బాగా ముదిరిపోయాయి . ఈమధ్య జారిన ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని అవి చెల్లవని అక్కడి ప్రజలు పాక్ పై విరుచుకు పడుతున్నారు. అక్కడక్కడా భారత్ కు మద్దతు కూడా పలుకుతున్నారు. గతంలో తూర్పు పాకిస్థాన్ లో ఎలా పాక్ సైన్యం ప్రజలను అణచివేసిందో ఇప్పుడు  అలాగే పీఓకే లో చేస్తున్నది. ఇది అంతర్యుద్దానికి దారి తీసే పరిస్థితులు లేకపోలేదు. మోడీ వ్యాఖ్యల  తర్వాత పీఒకే లో "పాక్ ఆర్మీ గో బ్యాక్" ఆందోళనలు మిన్నంటాయి. 
 అలాగే  బెలూచిస్తాన్ గురించి చెప్పుకోవాలంటే స్వాతంత్రానికి పూర్వం అది ఒక ప్రత్యేక దేశం. పాక్ లో దాదాపు సగం ఉండే ఈ ప్రాంతాన్ని  విభజన సమయంలో పాక్ ఆక్రమించుకుని తనలో కలిపేసుకుంది. ప్రస్తుతం బెలూచిస్తాన్  లో పాక్ పై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అక్కడి ప్రజలను పాక్ సైన్యం కిరాతకంగా చంపుతుంది. మోడీ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కడి నాయకులు, ఉద్యమకారులు స్వాగతించారు. తమకు భారత్ అండగా ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఇప్పటివరకూ భారత్ బెలూచిస్తాన్ ప్రజలకు నేరుగా మద్దతు ఇచ్చిన సందర్భం లేదు.  చెప్పాలంటే భారత్ తలచుకుంటే పాకిస్థాన్ పదికిపైగానే ముక్కలవుతుంది. పంజాబ్ , గుజరాత్ లాంటి పాక్ ప్రావిన్స్ లలో వారి సాంప్రదాయాలను, భాషను అణచివేసి ఉర్దూని తమపై రుద్దుతుందనే  ఆందోళనలు ముందునుంచే  ఉన్నాయి. 
భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు భారత్ సరిపోయినట్లు ప్రపంచంలో ఏ దేశం సరితూగదు . ఎన్ని మతాలూ , భాషలు ఉన్నా మనం భారతీయులం అనే నినాదం మన జాతిని ఒక్కతాటిపై నిలిపింది . ఇది ఓ రకంగా పాక్ కి ఈర్ష్యని తెచ్చిపెట్టింది. మతం గురించి ప్రస్తావించకూడదు కానీ ఇక్కడ ప్రస్తావించ వలసి వస్తుంది  ఇండియాలో ముస్లింలకు మిగతా ప్రజలు ఇచ్చే గౌరవం మరే ఇతర  దేశంలోనూ లభించదు. అలాగే అన్ని రకాల ముస్లిం తెగలూ ఇక్కడ కలిసి మెలసి ఉంటాయి. మిగతా ముస్లిం దేశాల్లో వారు తమలో తామే కొట్టుకుంటారు. 
ఇటువంటి పరిస్థితుల్ని అర్ధం చేసుకున్న మోడీ తనదైన శైలిలో పదునైన వ్యాఖ్యల్ని చేయడం పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతుంది . మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్  ని గనుక భారత్ లో కలుపగలిగితే ఇక ఆయన భారత్ ప్రజల దేవుడు అవుతారనడంలో సందేహం లేదు. 
అయితే అటు చైనా కూడా కొంత కాశ్మీర్ ను ఆక్రమించుకుంది . దాని విషయంలో మోడీ వ్యాఖ్యలు చేయకపోవడం ఆలోచించాలి.  మరి యుద్ధంలో చైనా గనుక పాక్ కి మద్దతు ఇస్తే భారత్ గెలుపు కష్టమే ! అలాగే కాశ్మీర్ అట్టడుకుతున్న ప్రస్తుత పరిస్థితిలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఈ వ్యాఖ్య చేసి దృష్టి మరలిస్తున్నారన్న విమర్శలకూ ఆస్కారం లేకపోలేదు. ఇదే జరిగితే మోడీ డిఫెన్స్ లో పడడం ఖాయం.  


1 comment:

hit counter