"శోధిని" వ్యాఖ్యల విభాగంలో మార్పులు - నెలాఖరుకు మీ ముందుకు

దీపావళి అందరూ బాగా చేసుకుంటున్నారని తలుస్తాను.
"శోధిని" నుంచి కొన్ని బ్లాగులు తొలగించాలా? అనే టపాకు స్పందించి మంచి కామెంట్లను అందించిన అందరికీ కృతజ్ఞతలు. శోధిని నుంచి ఒక్క బ్లాగుకూడా సరైన కారణం చూపకుండా తొలగించకూడదని నిర్ణయించడం జరిగింది. బ్లాగు పేరు ఎలాగూ కనపడుతుంది.ఇష్టం లేనివారు ఆ బ్లాగుకు వెళ్లకుండా ఉంటె బెటర్. లోనికి తొంగి చూడ్డం ఎందుకు .. బాధ పడడం ఎందుకు ?.. అంతే  అంటారా ?! 
ప్రస్తుతం శోధినిలో 3016 ఉన్నాయి. 22 May 2016 న పెట్టిన "శోధిని" తెలుగు బ్లాగుల సంకలిని

టపాలో అప్పటికి 2998 బ్లాగులు ఉన్నాయని చెప్పాను. అంటే అప్పటి నుండి 18 క్రొత్త బ్లాగులే కలిపారా అనొచ్చు మీరు. కానీ అప్పటి నుండి జతచేసిన బ్లాగుల సంఖ్య లెక్కేస్తే 145గా తేలింది అంటే దాదాపు 127 బ్లాగులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ కావాలని తొలగించినవి కాదు. ఆయా బ్లాగు నిర్వాహకులే తమ బ్లాగులను తొలగించుకోవడమో, ప్రయివేట్ ఎక్సిస్ చేసుకోవడమో చేశారు.
ఇప్పటికీ తెలుగులో అత్యధిక బ్లాగులు కలిగిన సంకలిని శోధిని అని ఖచ్చితంగా చెప్పగలను.
గత కొద్దిరోజుల నుండి కామెంట్ల విభాగం మూసివేశాక శోధిని వీక్షకులు దాదాపు 10% తగ్గిపోయారు. అంటే ఎక్కువమంది వ్యాఖ్యలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్ధమవుతుంది.
అజ్ఞాతల కామెంట్లలో వేరే బ్లాగర్లను తిడుతుండడంతో కొన్ని కారణాల దృష్ట్యా ఆ విభాగం ఆపవలసి వచ్చింది. ముందుగా అజ్ఞాత కామెంట్లను అనుమతిస్తున్న బ్లాగులను కామెంట్ల విభాగం నుంచి తొలగిందామనుకున్నా ఆయా బ్లాగులలో మంచి కామెంట్లు కూడా వస్తుండడంతో వేరే ఆలోచన చేయడం జరిగింది. కేవలం అజ్ఞాత కామెంట్లను మాత్రం ఆపి మిగతా కామెంట్లతో వ్యాఖ్యల విభాగం రూపొందించాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పని దాదాపు పూర్తి అయినా ... డిజైన్ పరంగా కూడా మార్పులు చేసి మాలిక లాగా రెండు కాలమ్స్ లలో తీసుకురావడానికి ప్రయ్నతాలు సాగుతున్నాయి. బహుశా ఈ నెలాఖరుకు అది మీముందు ఉండొచ్చు .
రాబోతున్న కామెంట్ల విభాగంలో చేయాల్సిన మార్పులపై మీరు చెప్పదల్సుకుంది ఏమైనా ఉంటె ఇక్కడ చెప్పొచ్చు. వీలుంటే పరిశీలిస్తాం...20 comments:

 1. మంచి‌ ఆలోచన

  వ్యాఖ్యల పైన క్లిక్ చేసిసపుడు ఓపెన్ అయ్యే బ్లాగు టెంప్లేటు కిరువైపులా మీ టెంప్లేటు‌ ఒకటి‌ డైనమిక్ గా బెట్టి ఆ సైడు బార్స్ లో యాడ్ స్పేసింగ్ ఇవ్వండి.
  ఆదాయం రావచ్చు శోధినికి (మాడల్ కి ఆంధ్రజ్యోతి వీక్లీ చూడండి)

  జిలేబి

  ReplyDelete

 2. ఓ శ్రీనివాస ! మీ పలు
  కౌ శ్రావ్యమహో ! జిలేబి‌ కైమోడ్పులహో !
  శ్రీశ్రీ యనాని మస్సుల
  కై శ్రీయుతమైన డంబు కాదనగలమే :)


  జిలేబి

  ReplyDelete
 3. వ్యాఖ్యల విభాగం, బ్లాగుల విభాగం రెండింటిలోనూ ప్రతి పేజ్ క్రిందా ప్రస్తుతం కనిపిస్తున్న

  Skip to page : 1 2 3 ...
  బదులు
  << మొదటి పేజ్ : < ముందు పేజ్ : తరవాత పేజ్ > : >> ఆఖరి పేజ్

  అని పెడితే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుందనిపిస్తోంది. ఆలోచించండి.

  ReplyDelete
 4. నా మూడు వర్డ్ ప్రెస్ బ్లాగుల కామెంట్లు మీ శోధినిలో చాలా కాలంగానే ప్రచురింపబడటం లేదు,మీ దృష్టికి తీసుకొచ్చినా!
  మిమ్మల్నేం అడగలేదు,అడగను,అడగబోను కూడా, మన పరిచయం పురస్కరించుకుని :)

  నా బ్లాగుల్ని మీరెప్పుడైనా మీ శోధిని నుంచి తొలగించౌకోవచ్చును,నాకు చెప్పక్కరలేదు. మీ శోధిని మీ ఇష్టం :)

  ReplyDelete
  Replies
  1. శర్మాజీ కోపం వచ్చిందా ?
   సరిక్రొత్త వ్యాఖ్యల విభాగం ప్రారంభం ఐంది .. మీ కామెంట్లు ఇక్కడ తప్పక కనిపిస్తాయి అని ఆశిస్తున్నాను. ఒకసారి పరిశీలిస్తాను.
   మీ బ్లాగును తొలగించవలసిన అవసరం రానే రాదు

   Delete


  2. శర్మా జీ కోపంబే ?
   కార్ముడు వాసుడు బిరబిర కామింట్లకనన్
   గర్మా గరమ్ము సెక్షను
   చార్మింగుగ జేసెనోయి చక్కగ గనుమా !

   జిలేబి

   Delete
  3. నాకెందుకు సార్ కోపం, అందునా మీ మీద :)

   ఉన్నమాటన్నానండి. ఆలోచన మీది, సొమ్ము మీది,కష్టం మీది. శోధిని మాదెలా అవుతుందీ అన్నా. ఇది కూలికొచ్చి పాలికి మాటాడినట్టు (సామెత) కాదా అంటున్నా. ఊరికే పెట్టే అమ్మని నీ మొగుడుతో సమానంగా పెట్టూ (సామెత) అనడమవుతుందా? అంచేత శోధిని మీదే, మాది కూడా అని మీరనడం మీ సౌజన్యం మాత్రమే :)

   వీలు కుదిరితేనే ప్రచురించండి :) బలవంతం ఉండదు :)

   బ్లాగుల్ని తొలగించవలసిన అవసరం రాదనే మీ నమ్మకానికి జోహారు :) ఏదైనా స్వానుభవం ఐతేగాని తత్త్వం ఒంటబట్టదు కదండీ :)

   నమస్కారం
   సెలవు

   Delete


  4. మళ్ళీ సా మేత ల తో వచ్చారే :)
   హన్నా ! ఎంత ధైర్యమో !

   జిలేబి

   Delete

 5. వాహ్ ! క్యా బాత్ హై !

  సూపర్ వ్యాఖ్యల పేజీ ! అద్బుతః !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete
 6. నా వైపు నుంచి నేను సాక్ష్యం దగ్గిర తప్ప ఇంకెక్కడా ఎవరినీ తిట్టలేదు -అక్కడ కూడా స్త్రీలని ఇబ్బంది పెట్టే మాటల్ని అస్సలు వాడ్లేదు.ఇప్పుడిక KSC గురించిన నిజం తెలిసింది గాబట్టి ఆ కాస్త ఉద్రేకం కూడా ఉండదు నాకు.

  ఎలాగూ బ్లాగు సెట్టింగ్స్ లోనే మోడరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ యాగ్రిగేటర్లు కలగజేసుకుని అసలు కామెంట్లనే యెత్తెయ్యడం ఓవర్ యాక్షన్ అవుతుందేమో!బ్లాగర్ల విచక్షణాధికారం ప్రకారం నడవాల్సిన విషయాల్లో యాగ్రిగేటర్లు అతిగా కల్పించుకోవడం సాంకేతికంగా న్యాయం కాదు.మాలిక వారు నీహారిక బ్లాగును తొలగించడం కూడా మర్యాద కాదు.తను నాకు ప్రశ్నలు వేసినప్పుడు జవాబులకి కండిషన్ పెట్టడం వల్ల నేను జవాబులు చెప్పడానికి తిరస్కరించాను.ఇప్పుడు తన వాదనలో న్యాయం ఉందనే అనిపిస్తున్నది - తనని బ్లాగుల నుంచి తొలగించడం అన్యాయమే!సనాతన ధర్మం దృష్టిభేదాల్ని(perspective differences) సమర్ధిస్తుంది."విశ్వసృష్టి రహస్యం మేడెజీ - ఫ్రం వేదవ్యాస టు హరిబాబు!" పోష్టులో చాలా చెప్పాను,మళ్ళీ అవన్నీ చెప్పే ఓపిక లేదు గానీ అక్కడ చెప్పని విషయం ఒకటి చెబుతున్నాను.దైవాసుర సంపద్విభాగ యోగం నిరంతరం నడవాలంటే అమరశక్తులకి ప్రాతినిధ్యం వహించే హరిబాబుతో పాటు అసురశక్తులకి ప్రాతినిధ్యం వహించే నీహారిక కూడా ఉండాల్సిందే - మన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికీ మన రహస్యాల్ని దాచుకోవటానికీ,మన అధికారాన్ని చూపించుకోవటానికీ ఎదటివాళ్ళని మాట్లాడనివ్వకుండా చేస్తే చాలుననుకుంటే ఒకనాటికి మనకి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి దాపరిస్తుంది!అబద్ధాలు చెప్పాడని సత్యనారాయణ చౌదరిని తిడుతున్నప్పుడు నిజాలు మాట్లాడుతున్న నీహారికని నిషేధించడం కూడా తప్పే అవుతుంది.

  ReplyDelete
  Replies
  1. ‘అమరశక్తులకి ప్రాతినిధ్యం వహించే హరిబాబుతో’ - హరిబాబు గారు మీకు మీరే decide చేసుకున్నారా లేక ఏ దేవతలైనా చెప్పారా?సరే, ఎలాగూ డిసైడ్ అయ్యారు కాబట్టి ఒక మాట అడుగుతాను. మీరే చెప్పండి!!ఒక బ్లాగరు నీతి మాటలు, వ్రాతలే తోటి బ్లాగరుకి చిరాకు కలిగిస్తే, ఆ బ్లాగు చూడటం మానేయాలి. ఆ బ్లాగు వైపు రాకూడదు. అవునా?? అగ్రిగేటర్ అంటే ముఖపుస్తకం కాదుగా !! ఎవరు like కొట్టినా మనం తప్పనిసరిగా చూడాల్సిన అవసరం లేదు కదా !! అగ్రిగేటర్ లో మనకి ఏ బ్లాగు కావాలో అదే చూస్తాం. అలా కాకుండా, ఒక బ్లాగరు వ్రాసేది ఇష్టం లేకపోతే చదవటం దేనికి ? పోనీ చదివితే చదవచ్చు!! ఆ బ్లాగరు అంటే చిరాకు కాబట్టి వాడు నమ్మినది, తెలుసున్నది ఏది చెప్పినా ఖండించడం, దూషించడం దేనికి ??వాడు తన బ్లాగుకి కామెంట్ మోడరేషన్ పెట్టి వ్యాఖ్య ప్రచురించకపోతే, ప్రచురించలేదు అన్న కక్షకట్టి వాడిమీదనే టపా కట్టడం తిట్టడం దేనికి ? ఇలా దూషిస్తే అప్పుడు ఆ బ్లాగరు ఏమి వ్రాస్తాడు ?ఈ విధంగా దూషిస్తున్న పరిస్థుతులలో ఆ బ్లాగరు బ్లాగటం అన్నా ఆపేయాలి. లేదా అగ్రిగేటర్ నుంచీ తప్పించుకోవాలి. ఈ విధంగా ప్రవర్తించడం ఒక బ్లాగరు స్వేచ్చని తోటి బ్లాగరు హరిస్తున్నట్లు కాదా ? బ్లాగు అనేది ఒక పరిమితిలో ( పరిమితిని మించితే అగ్రిగేటర్ కాదు ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి!!) ఎవరి ఇష్టం వచ్చింది వారు వ్రాసుకోవచ్చు. ఒకరికి రాహుల్ గాంధీ ఇష్టం ఉండచ్చు ఇంకొకరికి బ్రహ్మానందం కామెడీ ఇష్టం ఉండచ్చు. ఇంకొకరు కంచె ఐలయ్యకి ఫాన్ అవ్వచ్చు. ఎవరి అభిప్రాయం వారిది. బ్లాగు వారిష్టం వచ్చింది వ్రాస్తారు కానీ మనకి ఇష్టం ఉన్నది వ్రాయరు కదా!! ఇలా శృతి మించి రాగాన పడుతుంటే అగ్రిగేటర్ లు, తోటి బ్లాగర్లు ఏం చేయాలో చెప్పండీ - - దేవతల ప్రతినిధి గారు హరిబాబుగారు !!

   Delete
  2. @Chandrika Chandrika
   "అగ్రిగేటర్ లో మనకి ఏ బ్లాగు కావాలో అదే చూస్తాం. అలా కాకుండా, ఒక బ్లాగరు వ్రాసేది ఇష్టం లేకపోతే చదవటం దేనికి ?"

   hari.S.babu
   ఈ ప్రశ్నలలోనే జవాబు ఉన్నప్పుడు నేను మళీ చెప్పాల్సింది ఏముంది?

   "ఎవరి ఇష్టం వచ్చింది వారు వ్రాసుకోవచ్చు. ఒకరికి రాహుల్ గాంధీ ఇష్టం ఉండచ్చు ఇంకొకరికి బ్రహ్మానందం కామెడీ ఇష్టం ఉండచ్చు. ఇంకొకరు కంచె ఐలయ్యకి ఫాన్ అవ్వచ్చు. ఎవరి అభిప్రాయం వారిది. బ్లాగు వారిష్టం వచ్చింది వ్రాస్తారు కానీ మనకి ఇష్టం ఉన్నది వ్రాయరు కదా!!" - అంటున్నదీ మీరే!

   వాడు తన బ్లాగుకి కామెంట్ మోడరేషన్ పెట్టి వ్యాఖ్య ప్రచురించకపోతే, ప్రచురించలేదు అన్న కక్షకట్టి వాడిమీదనే టపా కట్టడం తిట్టడం దేనికి ? సాక్ష్యం విషయంలో ఇది నేనూ చేశాను.నన్ను కూడా తీసెయ్యాల్సి ఉంటుంది!నాకో న్యాయం,మీకో న్యాయం అనే రకం మనిషిని కాదు నేను - నా బ్లాగులోనే నేను అనామ
   కంగా కామెంట్లు వేస్తున్నాననీ వాళ్ళతో వీళ్ళతో తిట్టిస్తున్నాననీ అన్నారు - ఒక లక్ష్యం కోసం నిలబడినప్పుడు ఆ వ్యక్తిని అందరూ సమర్ధిస్తారనే గ్యారంటీ లేదు కదా!మిజోరాం అధికారిక వెబ్ పేజిలో religion:Christianity అని ఉంటుంది,మీరు చెయగలిగినది ఏముంది?కేంద్రప్రభుత్వం ఏమి చేస్తున్నది?మీకు నీహారికని నిషేధించగలిగిన వీలు ఉంది గాబట్టి ఉపయోర్గించుకుంటున్నారు,ఆదె పని కేంద్రప్రభుత్వం ఎందుకు చెయ్యటం లేదు?హిందూ అనుకూల పార్టీ అనే కదా హిందువులు వోటు వేసింది?కొందరు హిందూ మేధావులు ఇదివరకు అవార్డుల్ని వాపసు చేసినవాళని వెక్కిరించడానికి వాడుకుంటున్నారు,"ఇప్పుడు ర్వరూఅవార్డులు వాపసు చెయ్యడం లేదేమిటి?" అనే రాం వాదనతో!అలా ఉంది హిందువుల మేధస్సు - ఇప్పుడు అవార్డుల్ని వాపసు చెయ్యాల్సిందీ గొడవ చెయ్యాల్సిందీ వాళ్ళు కాదు - వీళ్ళే!అవతలివాళు తమకు నచ్చనిదాని విషయంలో ఎంత గట్టిగా ఉంటున్నారో హిందువులు కూడా తమకు నచ్చనిదాని విషయంలో గట్టిగా ఉండవచ్చును కదా,ఎందుకు ఉండలేకపోతున్నారు?బలహీనత మరణం అని వివేకానందుడు చెప్పాడు అని ఇతర్లకి చెప్పడం కాదు మనకి ఎంత వంటబట్టింది అని ఆలోచించుకోవాలా అక్కర్లేదా?

   TO BE CONTINUED

   Delete
  3. CONTINUEING FROM ABOVE

   నీహారికని తొలగించినందుకు నీహారిక ఏమైనా విచారపడుతున్నదా?మళ్ళీ నన్ను యాగ్రిగేటరులో కలపమని అడిగిందా?లేదే!మరి నేనెందుకు కల్పించుకుంటున్నాను?నీహారిక నన్ను తీర్పు తీర్చమని అడిగింది,మొదట తను అడిగినప్పుడు ఒప్పుకోలేదు,ఇప్పుడు మనసు మార్చుకుని నా తీర్పు చెబుతున్నాను.పాటించాలని ఒత్తిడి నేను కూడా పెట్టను.ఇదివరకౌ బ్లాగుల్లో హైందవేతరులు ఎక్కువ ఉన్నప్పుడు మన అభిప్రాయాలకి విలువ లేదు అని అలమటించినవాళ్ళు ఇప్పుడు సంఖ్యలో ఎక్కువ ఉండటాన్ని అవకాశం చెసుకుని అదే అన్యాయం ఇతర్లకి చెయ్యాలా వద్దా అనేది వారి వారి ధర్మాధర్మవిచక్షణజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది!ఒక విషయం మనకి నచ్చడం నచ్చకపోవడం చెయ్యగలగడం చెయ్యలేకపోవడం అనే లెక్కలు వేసుకుని స్పందించే మనిషిని కాదు నేను!నేను ఎలా మాట్లాడితే జనం చప్పట్లు కొడతారనే పేరాశతో కూడా మాట్లాడను - నాకు ధర్మం అనిపించినదాన్ని మొత్తం ప్రపంచం వ్యతిరేకించినా చేసి తీరతాను!నాకు అధర్మం అనిపించినదాన్ని వ్యతిరేకించడంలో కూడా నాది అదే లెక్క - నాకు నేను అమర సంపత్ ప్రభూతుణ్ణి అని చెప్పుకోవడానికి ఉండాల్సిన అర్హతలలో యేది లేదని మీరు అనుకుంటున్నారు?అలా మీరెందుకు చెప్పుకోకూడదు,ఏం?అలా ధర్మానికి కట్టుబడాలని లేదా!మొదట సాక్ష్యం మ్యాగజైను విషయంలో యాగ్రిగేటరు నుంచి తీసేస్తే బాగుంటుందని శ్రీనివాసు గారికి సలహా ఇచ్చి కూడా మళ్ళీ పూర్వాపరాలు ఆలోచించి సాంకేతికంగా అది మంచిది కాదు అని తెలుసు గనకనే హిందువులకి అటువైపుకి వెళ్ళకండని చెప్పి వదిలేశాను.అదే ఇక్కడ కూడా చెబుతున్నాను - అక్కడా ఇక్కడా ఒక్క మాటనే చెప్పాను కాబట్టి నా దృష్టిలొ అదే ధర్మం!

   వ్యక్తిగతమైన రాగద్వేషాలతో నేనెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడను,ఒక్క నిర్ణయం కూడా తీసుకోను.KSC విషయంలో కూడా అతను నా మతాన్ని అవమానిస్తున్నాడు గనక ప్రతిస్పందించానే తప్ప వ్యక్తిగతంగా నాకు ద్వేషం ఏమీ లేదు.గెలవాల్సిన శత్రువుని గెలవడం కోసం అన్ని పాట్లు పడి అంత భీబత్సం చేసి below the belT కూడా కొట్టి గెలిచిన నేను గెలిచాక ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉందగలుగుతున్నాను?అదే ధార్మికక్షాత్రం అంటే - శత్రువుని కొట్టాల్సిన దెబ్బలకి కూడా లెక్కలు వేసుకోవాలి,ఒక్క దెబ్బ కూడా ఎదటివాడి మీద వక్తిగతమైన ద్వేషంతో కొట్టకూడదు అన్న లెక్క నాది.

   రాముడిని ధర్మానికి కట్టుబడమని ఎవరు బలవంతం చేశారు?కృష్ణుడికి కురుక్షేత్ర సమరం తప్పనిసరి అని లెక్కలు వేసి చెప్పి అతన్ని శాసించినది ఎవరు?నేనూ అంతే!త్రేతాయుగానికి రాముడు,ద్వాపరయుగానికి కృష్ణుడు,కలియుగానికి హరిబాబు - ఎవడో ఒకడు నిలబెట్టకపోతే ధర్మం ఎట్లా నిలబడుతుంది?

   P.Sఅలనాడు డైరెక్ట్ యాక్ష డే అని మనం ఇప్పుడు పిలుచుకుంటున్న రోజున పోయిన కొన్ని వందల/వేల మంది ప్రాణాలకి ఏ విలువా ఇవ్వలేదు - హిందువులే!వెంటనే హిందువులు అధిక సంఖ్యలో ఉన్న అని ప్రముఖ నగరాలలో హిందువులు కూడా లెక్క పెట్టి నగరానికి అంతమంది చొప్పున ముస్లిములకీ అదే పని చేసి ఉంటే తొక్కలో ద్విజాతి సిద్ధాంతాన్ని మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుని తన లండను ఇంటికి పారిపోయేవాడు జిన్నా!అప్పటివరకు ఉపఖండం హోదాలో ఉన్న అఖండభారతం విడిపోయి ఉండేది కాదు,1947 ఆగష్టు నుంచి లెక్కిస్తే ఇవ్వాళ ఇన్ని దశాబ్దాల మతకలహాల నెత్తుటి మరకలు ఉండేవి కావు.మిజోరాం వెబ్ పేజిలో దిక్కుమాలిన హెడ్డింగు చూడాల్సిన దౌర్భాగ్యం నాకు దాపరించేది కాదు!ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడా ఖలేజా చూపించలేని హిందువులు ఒక్క నీహారిక మీద ఎంత ప్రతాపం చూపిస్తున్నారు?

   Delete

  4. అదురహో హరిబాబు !

   జిలేబి

   Delete


 7. కలియుగమునకు జిలేబీ
  విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
  బలహీనుడు కాడోయీ
  కలకాలపు ధార్మికుండు కడవన్నె భళా !

  జిలేబి
  ఓ మై గాడ్ లో విలాగ్ - బహుత్ సమయ్ బీత్ గయా నయా భగవాన్ ఆకే :) ఇస్కో హమ్ భగ్వాన్ బనా దేంగే :)

  కలియుగమునకు జిలేబీ
  విలువల జేర్చ హరిబాబు విదురుండాయెన్ !
  బలహీనుడు కాడోయీ
  కలకాలపు ధార్మికుండు "కడవుళ్" మనకున్ :)

  జిలేబి

  ReplyDelete
 8. ఆహా హరిబాబు గారు !! _/\_ !! జిలేబి గారు చెప్పినట్లు విదురుడి లా ధర్మం చెప్పారు :) బ్లాగరు స్వేచ్ఛ హరించడం గురించి అడిగితే హిందువులు, మిజోరాం ఎన్ని ధర్మాలు బోధించారండీ నాకు :) జిలేబి గారిలాగా కందాలు వ్రాయడం రాదు. లేకపోతే శతకం వ్రాద్దునేమో !!

  ReplyDelete
  Replies
  1. I am not interested too much on this topic!I am not limited myself as only a blogger forever.I have my own goal and I am going in my own way!I need not to ask freedom anybody!I would achieve it in the most right way by hook or crook,if anybody take it from me - why can;'t you do the same?

   Delete
 9. @Chandrika Chandrika
  "బ్లాగరు స్వేచ్ఛ హరించడం గురించి అడిగితే.."

  hari.S.babu
  బ్లాగరు స్వేచ్చని ఎవరు హరించగలరు?అలా హరించే అధికారం యాగ్రిగేటరుకి మాత్రమే ఉంది!మీరు పోరాడుతున్నది ఎవరి మీద?ఒక బ్లాగరు ఇంకొక బ్లాగరు స్వేచ్చని హరించగలడా - విడ్డూరంగా ఉంది!ఒక బ్లాగరు ఏమి వ్రాయాలి,ఏమి వ్రాయకూడదు అనే కంటెంటు విషయంలో యాగ్రిగేటరు కానీ మరెవరు కానీ జోక్యం చేసుకోవచ్చా!దేని కోసం ఎవరి మీద పోరాడుతున్నారు మీరు?

  ReplyDelete
 10. అలా హరించే అధికారం యాగ్రిగేటరుకి మాత్రమే ఉంది!
  __________________________________________________

  Not really. Bloggers can exist without aggregators but no aggregator can exist without the blogs. Of course, aggregators have their freedom too :)

  ReplyDelete
  Replies
  1. True!but I said it according to the relevant discussion.

   Delete

hit counter