అనామకుల కామెంట్లలో తిట్లకు బాధ్యులు ఎవరు?

తెలుగు బ్లాగుల్లో ఉండకపోయినా అప్పుడప్పుడూ శోధిని పనిచేస్తుందా లేదా అని టపాలు, కామెంట్ల విభాగాలు తొంగి చూస్తుండడం నాకు అలవాటు. అలాగే బ్లాగుల్లో ఉండగా పరిచయం అయిన అహ్మద్ చౌదరిని ఫోన్ లో తరచూ పలకరిస్తూ ఉండడం మామూలే! ఆయనాతొ ముఖపరిచయం లేకపోయినా ఫోన్ల ద్వారానే కష్ట సుఖాలు పంచుకోవడం .. వాదనలూ .. జోకులూ.. రోజూ జరిగే సంఘటనలు మాట్లాడుకోవడం చేస్తుంటాను.
అయితే అహ్మద్ చౌదరి తన కుటుంబ వ్యవహారాలవల్ల ఇంటర్ నెట్ కు ఎక్కువగా అందుబాటులో ఉండడు. ఒక్కోసారి వారం పాటు నెట్ కు దూరంగా ఉంటాడు. అటువంటి సమయాల్లో వివిధ బ్లాగుల్లో అతనిపై వచ్ఛే వ్యాఖ్యలు పోస్టులు తనకు చెపుతూ ప్రతిస్పందించేలా గుర్తుచేస్తుంటాను.
ఇంతవరకూ బాగానే ఉంది .. నా మటుకు !
అయితే మొన్న  హారికాలం బ్లాగులో క్రింది కామెంట్ చూడడం జరిగింది. అప్పటికే రెండురోజులనుంచి చౌదరి నెట్ కు దూరంగా ఉన్నాడు .
పై కామెంట్ చూసిన నేను ఈయనకు ఒకసారి చూడమని చెప్పాను . 
ఆరోజు సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది. 

చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అన్నాడు . 
లేదు నేను పెట్టలేదు అన్నాను . నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు .. 
లేదు సార్ అన్నా !
అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .."  అన్నాడు .. 
నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను .. 
అయితే ఈరోజు ఆకామెంట్ క్రింద మరో అనామక కామెంట్ దర్శనం ఇచ్చింది .. 

చదవగానే ఇది ఎవరు పెట్టి ఉంటారని మీరు భావిస్తున్నారు ? 

కరెక్ట్ ... నేనూ అలాగే అనుకోని అహ్మద్ చౌదరికి ఫోన్ చేసాను .. 

ఆయన కనీసం నాలుగు సార్లు ( దాదాపు 5 నిమిషాలు) ప్రయత్నించిన తర్వాత ఫోన్ ఎత్తారు 
"మీరు నాగురించి పెట్టారు కదా .. అందుకే మీ గురించి అలా వ్రాసాను" అన్నాడు 
నాకు బాధ , కోపం రెండూ ఒకేసారి వచ్ఛేయి 

ఇంతకాలం ( దాదాపు నాలుగు సంవత్సరాలు) స్నేహితుడు అనుకొని అన్ని రకాలుగా (సారీ .. కొన్ని రకాలుగా) ఆదుకున్న నాపై ఇలా ఎలా వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది .. 
ఇంతకీ ఈ బ్లాగు నిర్వహించే హరిబాబు గారు ఈ అనామక కామెంట్లలో వేరే వారిని తిడుతూ ఉంటె వాటిని అనుమతిస్తూ ఉంటె దీనికి బాధ్యులుగా ఎవరిని చేయాలి .. అనామకులు ఎలాగూ దొరకరు .. మరి అటువంటి కామెంట్లను అనుమతించే హరిబాబు గారు లాంటి బ్లాగు నిర్వాహకులే దీనికి బాధ్యత వహించాలి అని నా నమ్మకం .. 
ఒకవేళ వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉండి పోలీసులకు పిర్యాదు చేస్తే ఎవరిపై చేయాలి ??? 
అలాగే ఈ వ్యాఖ్యలను తమ ఆగ్రిగేటర్ లలో చూపుతున్న మాలిక , శోధిని కూడా తప్పక నిందితులే ! 
కనుక ఇకపై శోదినిలో Anomynous కామెంట్లను అనుమతించే బ్లాగులను తొలగించాలని నిర్ణయించాను .. 
ఈ పని ఇప్పటికే మొదలైంది రెండు రోజుల్లో పరిశీలన జరిపి అలాంటి బ్లాగులను కామెంట్ల సెక్షన్ నుండి తొలగిస్తాను .. 
చివరిగా మరో ట్విస్ట్ ఏమిటంటే మొదట చెప్పిన కామెంటును సమర్ధిస్తూ దానిక్రిందే హరిబాబు గారు తనదైన తిట్లతో కామెంట్ పెట్టడం 

అయితే మరి హరిబాబు గారి బ్లాగులో క్రింది విధంగా ఉన్న ఈ సందేశం ఎందుకో మరి 

 సభ్యతాయుతం అంటే ఏమిటో వారే సెలవీయాలి 

ఇదే విషయంపై ఒకప్పటి టపా :

Tuesday, 18 November 2014: బ్లాగులూ - కామెంట్లూ - ఆగ్రిగేటర్లూ


53 comments:

  1. ఇంతకాలం ( దాదాపు నాలుగు సంవత్సరాలు) స్నేహితుడు అనుకొని అన్ని రకాలుగా (సారీ .. కొన్ని రకాలుగా) ఆదుకున్న నాపై ఇలా ఎలా వ్రాయగలిగాడో అర్ధంకాక పిచ్చ్చేక్కింది .. ఫోన్లో తప్ప ముఖ పరిచయం లేని తమరు నన్ను అన్ని విధాల ఎలా ఆదుకున్నారు? ఏ విషయాలలో ఆదుకున్నారు? మీ పోస్ట్ చాలా విచిత్రంగా ఉంది.ఇక ముగించివేయండి.గతంలోనూ ఇటువంటి చెత్త వేషాలు చాలా మంది కూడా వేసారు. మీరు కానప్పుడు విషయాన్ని పక్కన పడేయండి.దాన్ని ఇంత పోస్టు వ్రాసి లాగడం అనవసరం.

    ReplyDelete


  2. ఆ అనానిమస్సు కా మంటలు హరిబాబు దే యెందుకు‌ కాదయ్యుండ వచ్చు ?

    ఏమంటారు ?


    బ్రేవ్ :)

    జిలేబి

    ReplyDelete


  3. అహ్మద్ చౌదరి- ఇంటర్ నెట్ కు ఎక్కువగా అందుబాటులో ఉండడు

    ప్రతి రోజూ కనబడే చౌదరి ఇంటరునెట్టుకు దూరమా ?

    ఔరా !

    జిలేబి

    ReplyDelete
  4. అలాగే ఈ వ్యాఖ్యలను తమ ఆగ్రిగేటర్ లలో చూపుతున్న మాలిక , శోధిని కూడా తప్పక నిందితులే !
    ----------------------------------------------------

    Not really saaru! Maalika just indexes and points to the blog content. It NEVER stores any blog content on its own website.. so, legally it has no binding. Not sure how Sodhini does it.

    ReplyDelete
    Replies
    1. As i have seen, Maalika stores full content of comments for more than 12 hours.

      Delete
  5. @శ్రీనివాస్ గారు,

    >>>ఇంతకీ ఈ బ్లాగు నిర్వహించే హరిబాబు గారు ఈ అనామక కామెంట్లలో వేరే వారిని తిడుతూ ఉంటె వాటిని అనుమతిస్తూ ఉంటె దీనికి బాధ్యులుగా ఎవరిని చేయాలి .. అనామకులు ఎలాగూ దొరకరు .. మరి అటువంటి కామెంట్లను అనుమతించే హరిబాబు గారు లాంటి బ్లాగు నిర్వాహకులే దీనికి బాధ్యత వహించాలి అని నా నమ్మకం .. >>>
    ఖచ్చితంగా... బ్లాగ్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సిందే ! నా బ్లాగ్ లో జిలేబీ గారిని తిడుతూ కామెంట్స్ వ్రాస్తుంటారు నేను ప్రచురించను. వేరే బ్లాగర్ ని తిడుతూ వ్రాసే అజ్ఞాతలు బాధ్యత వహించకపోయినా ప్రచురించేవారు తప్పక బాధ్యత వహించవలసిందే ! తమ బ్లాగులో ఎవరిని కించపరుస్తూ వ్రాసినా వారు బాధ్యత వహించవలసిందే ! నేను ముందుగా ఎవరినీ తిట్టను వాళ్ళు తిట్టిన తరువాత నేను ఆగను. బ్లాగుల్లో క్రమశిక్షణ అంటూ ఉంటే అందరికీ బాగుంటుంది. ప్రజాస్వామ్య రాజ్యం కదా ! ఎవరూ స్వేచ్చని వదులుకోవడానికి ఒప్పుకోరు. ఉన్నంతలో ఎవరి స్వేచ్చను వారు కాపాడుకుంటారు. అజ్ఞాతల వ్యాక్యలు అన్నీ అలా ఉండవు. కొంతమంది ధైర్యం లేక అజ్ఞాతలు గా వ్రాస్తారు. కొంతమంది అజ్ఞాతలు బాగా వ్రాస్తారు. వాళ్ళనుండి ఎంతో నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. కొన్నిసార్లు అజ్ఞాత వ్యాఖ్యలు అనుమతించాల్సి వస్తుంది. మీరు అందరినీ ఒకే గాటన కట్టేయకండి. బూతులు వ్రాసే అజ్ఞాతలను మాత్రం శిక్షిస్తే సరిపోతుంది. ఆ పని చేయని బ్లాగర్లను మీ శోధిని నుండి తీసివేయగలరా ? మీరు ముందుకు వచ్చారు కాబట్టి అడుగుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. @నీహారిక గారు

      తప్పకుండా ఆయా బ్లాగర్లు బాధ్యత వహించాలి. కనుక అజ్నాతల కామెంట్లను అనుమతిస్తున్న బ్లాగులను వ్యాఖ్యల విభాగం నుండి తీసే పని మొదలైంది. ఇప్పటికే 10 బ్లాగులు తొలగించడం జరిగింది.
      త్వరలోనే ఆ తొలగించిన బ్లాగుల లిస్టు బహిరంగ పరుస్తాను. ఒకవేళ ఆయా బ్లాగుల నిర్వాహకులు మార్పులు చేసినట్లయితే తిరిగి కలిపే విషయం ఆలోచించాలి

      Delete
    2. >> కొన్నిసార్లు అజ్ఞాత వ్యాఖ్యలు అనుమతించాల్సి వస్తుంది. మీరు అందరినీ ఒకే గాటన కట్టేయకండి. <<

      టెక్నికల్ గా అలా సాధ్యం కాదు. బూతులను అనుమతించే బ్లాగర్లను గుర్తించడం ఎలా?

      Delete
  6. >>>అలాగే ఈ వ్యాఖ్యలను తమ ఆగ్రిగేటర్ లలో చూపుతున్న మాలిక , శోధిని కూడా తప్పక నిందితులే ! >>>

    ఈనాడులో వచ్చే వార్తలకి ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదా ?
    ఎవడో విలేఖరి వ్రాసిన దానికి నేను బాధ్యత వహించాలా అని అంటారా ?

    ఔట్ లుక్ పత్రిక పై స్మితా సబర్వాల్ దావా ఎందుకు వేసినట్లు ?
    కోర్టు ఖర్చులకు కే సీ ఆర్ "స్మితా సబర్వాల్" కి 15 లక్షలు పబ్లిక్ గా ఎందుకిచ్చినట్లు ?

    ReplyDelete
  7. Very simple. Eenadu and Outlook own that content. Maalika and Sodhini do not. They only provide links.

    For example of some magazine X says "Eenadu wrote such and such news" - it is not responsible for the original content.

    ReplyDelete
    Replies
    1. If a person with name blames other and Eenadu shows as it is , is not a crime.
      But if Eenadu writes the Bad words of some unknown person is absolutely illegal.

      Delete
  8. Maalika is responsible for every letter that appears on Maalika Patrika, not Maalika aggregator.

    ReplyDelete
    Replies
    1. @Malakpet Rowdy గారూ
      నేను కొద్ది సేపటి క్రితం నాకు తెలిసిన ఓ లాయర్ తో మాట్లాడాను.
      (పేరు తెలియని) ఎవరో మిమ్మల్ని తిడుతున్నారు అని బహిరంగ పరిచే వ్యక్తీ ... దాన్ని పబ్లిసిటీ చేసే వ్యక్తీ ఇద్దరూ నిందితులుగా (ప్రతివాదులుగా) చేయవచ్చు అని ఆయన చెప్పారు.

      మాలిక, శోదినిలలో కామెంటుకు లింక్ మాత్రమె ఇస్తున్నాము అని ఎలా చెపుతాము, స్టోర్ చేయట్లేదని ఎలా చెపుతాము..అలా అని Disclaimer ఉందా? ఎక్కడెక్కడో ఉన్న తిట్లన్నీ ఒకే చోట చూపుతున్నాం కదా?
      మాలిక, శోధిని లలో టపాలు కేవలం హెడ్డింగ్ చూపుతున్నాం కానీ వ్యాఖ్యలు పూర్తిగా చూపుతున్నాం కదా ? !

      Delete
    2. Storage refers to specific storage on the disk. Maalika aggregator does not store a single character on the disk. Whatever people see, its fed from the blogs and the content is owned by the blogs.

      Yes, the aggregator could be in trouble id a blogger says that the aggregator is showing the content of the blog without his permission, but again its on the rthical grounds.

      Aggregators are more like reporters, they dont publicize. For example, if you publish an article on the aggregator showing something abusive, then you are responsible. But in case of Maalika, the only content we own is the Maalika logo, footnotes and terms&conditions.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  9. One morre thing - We are bound by the laws of the State of Ohio, federal laws of the USA, and the federal laws of the United Kingdom (Sreenu Vattipalli lives there). The sever runs from Houston in Texas.

    We cant hold the web hosting company responsible for this :)

    ReplyDelete
  10. ఆగ్రిగేటర్ అంటే కేవలం లింక్ లు ఇచ్చే వ్యవహారమే నడుస్తుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆగ్రిగేటర్ ముసుగులో వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం కలుగుతుంటే ఓర్పుగా ఉండడం మానవమాత్రులకు సాధ్యం కాదు.అగ్రిగేటర్ లో కేవలం లింక్ లు మాత్రమే ఇవ్వడం లేదు వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అవి బ్లాగర్ల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయి. పత్రికకో నీతి .. అగ్రిగేటర్ కు ఒక నీతా ? ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలున్నాయి కాబట్టే శ్యామలీయం గారు తట్టుకోలేక నిష్క్రమించారు. శోధిని వారు కనీసం బ్లాగర్ల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  11. ఇండియాలో చేసే తప్పులకు ట్రంప్ ని న్యాయం అడగాలా ? ఖర్మరా ద్యావుడా ?

    ReplyDelete
  12. Its the responsibility of the respective blogger. The aggregators, the hosting companies and Google (that hosts the blog) are in no way related, at least as per the laws over here.

    Any decision on comments would be strictly taken on the moral grounds, not legal. We have blicked many abusive blogs in the past and will continue to do that in the future as well but the primary fight is between the blogger and the victim.

    ReplyDelete
  13. Maalika is not an Indian website. It is purely American and British.

    ReplyDelete
  14. అమెరికా చట్టాలను చూపించి మీరు బయటపడగలరేమో గానీ "శోధిని" జాగర్త పడాల్సిన సమయం వచ్చింది .
    :)

    తనదాకా వస్తే గానీ తెలీదన్నట్లు ఇప్పుడు నాకు తెలిసొచ్చింది

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. And the other issue is - NOBODY has complained to us about any abusive comments over emails or the phones. So, we dont even know what the problem is as we have been away from the blogs. (Well actually we did receive one complaint about the foul language used on Ramyamgaa Kuteerana blog but we asked that person to wait for a few days and see if the abuse continued. As the abuse seemed to have stopped, everyone took it easy)

    Do let us know what the problem is and provide us the URLs - We may ignore one or two comments/posts that cross the line but if the abuse is consistent, we will definitely take appropriate action on moral grounds, even though we are legally not bound to do it.

    ReplyDelete
  17. పది బ్లాగులు కాదు ఇరవై,ముప్పై,యాబహి ఈన్నైన అనిర్వహించుకోవచ్చును.కానీబ్లాగులో ఎక్కడ క్లిక్ చేసినా అంటే కామెంటు పెట్తాలని కామెంట్ బాక్సుని క్లిక్ చెసినా కామెంటు వెయ్యనివ్వటానికి బదులు ఒక యాద్ పేజి ఓపెన్ అవుతున్నది - దాని అర్ధం ఏమిటి?సనదర్సకులు అక్కడ చర్చలో పాల్గొనదం వల్ల వారికి డబ్బ్బు వస్తుంది.

    అలా విజిటర్లని పెంచుకుని తనకి ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే వారు హిందూమతాన్ని విమర్శిస్తూ పొష్టులు పెడుతున్నారన్నది నాకు అర్ధమయ్యింది.లేదంటే వారి వయస్సుకీ,చదువుకీ,అనుభవానికీ ఆయన చేస్తున్నది తప్పని ఆయనకు తెలియదు అంతే నమ్మడం కష్తం!నేను ఆయన బ్లాగు గురించి చెప్పిన అభిప్రాయానికి నూటికి నూరుపాళ్ళు కట్టుబడి ఉంటాను.మాతాల్ కోసం తడుముకోవతం,నస్గడం,గొణూక్కోవదం నాకు నచ్చదు - నేను ఏది మాట్లాడినా అంతా తెలుసుకునే మాట్లాడతాను!వూరూ పేరూ అన్నీ ఉండి ఆయన చేస్తున్న పని కన్నా ఆనామకులు ఏమి దుర్మార్గం చేస్తున్నారు?

    దీనికి అరైన జవాబు చెప్తే నేను కూడా నామక వ్యాఖ్యలని పూర్తిగా నిషేధించగలను.

    ReplyDelete
    Replies
    1. @Haribabu Suranenii

      ఇక్కడ ప్రశ్న అనామక వ్యాఖ్యాతలు అనేదానికన్నా ఆ అంశంతో సంబంధంలేని వారిపై విమర్శలకు మీ బ్లాగులో స్థానం ఎలా కల్పిస్తున్నారు. అనేదే..

      మీ బ్లాగులో అనామకంగా వచ్చిన ప్రతీ కామెంట్ మీరు నమ్ముతున్నట్లు, సమర్ధిస్తున్నట్లు భావించాలి.

      Delete
    2. అది సరికాదండీ శ్రీనివాస్ గారూ!

      Publishing a comment doesn't mean endorsement. కానీ ఆ వ్యాఖ్య పైన బాధ్యత బ్లాగరుదే. నా బ్లాగులో కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. కత్తి మహేష్తో కొంతమంది ఫైటింగ్, మార్తాండ/ప్రవీణ్ తొ మరికొంతమంది. వాటికిందనే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్న కామెంట్లు కూడా కొన్నిచోట్ల ఉంటాయి. అప్పుడు బ్లాగర్ సమర్ధకుడా లేక వ్యతిరేకా?

      Delete
  18. అసలు నాకర్ధం కాని విషయం - అనామక వ్యాఖ్యలను నిషేధిస్తే ఎవరికేం ఒరుగుతుందీ? ఈ ప్రయత్నం జనాలు 2009లోనే చేసారు. అజ్ఞాత అనే బదులు ఎల్లయ్య, పుల్లయ్య లేక సోమయ్య అనే పేరుతో కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు కన్నయ్య, ఐలయ్య పేర్లతో వస్తాయి, అంతేగా! ఇక్కడ ఇబ్బంది అసభ్యకామెంట్లతో Especially the ones leading to libel and character assassination.

    ReplyDelete
    Replies
    1. @Malakpet Rowdy గారూ

      ఆ 2009 తర్వాతనే బ్లాగులు తిరోగమనం బాట పట్టాయి .. ఆ తిట్లను తట్టుకోలేక బాగా వ్రాసేవారు కూడా బయటికి పోయారు

      ఆరోజులు గుర్తు చేయకపోవడమే బెటర్

      Delete
    2. లేదులెండి ... 2008 నుండీ 2013 దాకా తెలుగు బ్లాగులు ఒక వెలుగు వెలిగాయి. ఆ తరవాత వివాదాస్పద బ్లాగర్లు ఫేస్ నుక్కుకూ, గూగుల్ ప్లస్సుకూ పోవడం వలన పండు మిరప కారం కాస్తా కందాబచ్చలి అయిపోయి ఉన్నవాళ్లకు బోర్ కొట్టింది. పైగా ఫేస్ బుక్ ఉన్నంత సౌకర్యంగా బ్లాగర్ లేకపోవడంవల్ల జనాలు టాటా చెప్పేసారు.

      Delete
  19. Best solution for this - Request the blogger to delete the offensive comments. 99% of the times, the bloggers obey the requests - after all they want to be friendly with their readers :)

    ReplyDelete
  20. అయినా అప్పట్లాగ ఇప్పుడు వందలకొద్దీ బ్లాగర్లు లేరు .. వ్రాసేవారూ చదివేవారూ కూడా

    ఉన్న నలుగురూ తిట్టుకుంటుటున్నారు.. (నలభై పేర్లతో)

    ReplyDelete
  21. అనామక వ్యాఖ్యలని అనుమతించాలా లేదా అనేది ఆ బ్లాగరు యొక్క ఛాయిస్. కానీ విషయానికి దూరం గా వ్యక్తిగత దూషణలు, కించ పరిచే వ్యాఖ్యలు చేసే వారు అనామకులైనా, కాకున్నా అలాంటి వ్యాఖ్యలని నిరోధించాల్సిన బాధ్యత ఖచ్చితం గా ఆ బ్లాగరుదే.

    ReplyDelete
    Replies
    1. @Madhav Kandalie

      మీరన్నది కరెక్ట్.. ఒక్కోసారి కొన్ని అనామక కామెంట్లు నిజాయితీగా ఉంటూ ఏంతో ఆలోచింపజేస్తాయి.
      కాకపొతే తిట్లతో కూడిన అనామక వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఆ బ్లాగరే బాధ్యుడు.

      Delete
  22. @blogWriter
    చౌదరి ఫోన్ చేసి ఆ కామంట్ మీరే పెట్టారు కదా అన్నాడు .
    లేదు నేను పెట్టలేదు అన్నాను . నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు ..
    లేదు సార్ అన్నా !
    అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు ..
    నాకు తెలీదు నేనైతే కాదు అన్నాను
    hari.S.babu
    fact1:నా బ్లాగుల గురించి తెలిసింది మీకే మీరే పెట్టి ఉంటారు అన్నాడు ..
    myPoint1:By this personal and deliberate statement He accepted at last He is working like an under cover spy/enemy against hinduism.
    fact2:అప్పుడు "నేను పల్లా కొండలరావుగారిని , హరిబాబుని , శ్యామలీయం ను అడిగాను.. వారు కూడా మీ పైనే అనుమానం చెప్పారు .." అన్నాడు ..
    mypoint2:I even don't know exactly about you before,how could I tell your name?I am not having any personal contact with him - If he contacted me,It would appear as a comment!upto now I am confused you about B.SrininvasuDu as the similarity.HE IS A LIAR, LIAR AND LIAR!!!

    P.S:The suspecting statement from me about you never done by me.Do you think this fellow with an iD is respectable and moral and anonymaous comm enters are mean and vulgar?

    ReplyDelete
    Replies
    1. @Haribabu Suranenii

      What I have written in this post is exactly happened during conversation. And I have voice proof also.

      And he agreed that the second Anonymous comment was wrote by him.

      I request you not to allow the abusive language that comes from Anonymous whether it is on me or on Chowdary

      Delete
    2. So, I accept to block anonymous anyway!But One Lucky thing about all this affair is Mr.Chameleon showed his real colors:-)

      I am waiting for this from the first encounter with him - actually i am playing a mental chess with him through my comments to make him reveal about himself, and that was came to climax like this:-)

      Delete
    3. You dont need to block anonymous commentators. If you could edit/remove the filthy comments, you must be fine.

      Delete

  23. హమ్మయ్య

    నిశాచరవుడి డ్యూటీ దిగిపోయినట్టున్నారు :)


    జిలేబి

    ReplyDelete
  24. అసలు ఏ వ్యాఖ్యలనైనా అనుమతించాలా లేదా అనేది బ్లాగరుదే పూర్తి బాధ్యత అంటానండీ. వ్యాఖ్యలు అనామకంగా పెట్టచ్చు. పైన భరద్వాజ్ గారు చెప్పినట్లు, వ్యాఖ్య పెట్టాలి అనుకునేవారు అనామకంగా కాకపోతే రామయ్య, సోమయ్య లాంటి పేర్లతో రావడం మొదలు పెడతారు. బ్లాగులకి మోడరేషన్ ఖచ్చితంగా ఉండాలి అనే అంటాను. ఒక్కొక్కసారి బ్లాగరు ఇంటర్నెట్ కి అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఈ అనామకుల ప్రేలాపనలు ఇతర బ్లాగరులు భరించలేరు. వ్యాఖ్య బ్లాగరు పోస్టుకి అనుకూలంగా ఉండనక్కరలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి !! అవి దూషణగా, అభ్యంతరకరమైన భాష లో లేకపోతే చాలు.

    ReplyDelete
  25. ఏది ఏమయినా శ్రీనివాస్ గారు & ‘మా లాక్కుపేట రౌడీ ‘ గారు!! బ్లాగర్లందరినీ ఒక్కచోట చేర్చి ప్రతి రోజూ తెలుగుని ఒక చోట కనిపించేలా చేస్తున్నారు. మీ శతకోటి వందనాలు _/\_. ఫేస్బుక్ చూసినా చూడకపోయినా రోజులో ఒకసారి మాలిక, శోధిని ని చూసి పలకరించడం నాలాంటి ఎంతోమంది బ్లాగరులకి అలవాటుగా మారిపోయి ఉండవచ్చు. ఒక పద్యం వ్రాయడం చేయలేనేమో కానీ, సమస్యా పూరణం చూసి ఆనందిస్తాను. మరొక్కసారి ధన్యవాదాలు !!

    ReplyDelete
  26. @neeharika
    "సామాజిక కోమటోళ్ళు స్మగ్లర్లు" అని వ్రాయవచ్చు. "సామాజిక వ్యభిచారులు కోమటోళ్ళు" అని వ్రాయకూడదు.

    hari.S.babu
    why?smuggling and prostitution - both are same!Then why this discrimination?
    In colloquial slang "కోమటోళ్ళు " is acceptable,but he is using it in a defamatory tone,and you are pardoning defamation.It is strange that you permit unethical defamation and not reject vulgarity even though they both are sub-standard!

    hari.S.babu
    ఆర్యా,

    ఇవి నా బ్లాగులో నీహారిక వెలిబుచ్చిన అభిప్రాయం మీద నేను వేసిన ప్రశ్నలు!ఇక్కడ శ్రీనివాస్ గారు కూడా బూతులూ తిట్ల విషయంలో ఒక చర్చని లేవదీశారు గాబట్టి ఇక్కడ జవాబు చెబుతున్నాను.

    తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్ఠులైనవారే చాలా గంభీరమైన వాతావరణంలో తిట్లూ బూతులూ వాడారు.ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యంలో ఉన్న తిట్టు కవిత్వాన్నీ బూతుల్ని ఎక్కడో అకక్ద ఇరికించిన సాహితీ రూపాల్నీ తీసేస్తే మనకి ఇంత విస్తారమైన సాహిత్యం అనేది మిగుల్తుందా?

    ఒకానొక పురాణకధలో దేవలోకం మీద దండెత్తి గెల్చిన రాక్షస చక్రవర్తి రంభను తనముందు నాట్యం చెయ్యమని అడిగితే తిరస్కరించినప్పుడు "లంజియవు గావదేమి?" అని గద్దిస్తాడు.దానికి రంభ "లంజియ నౌదు నేను!" అని ఒప్పుకుని దానినే అవతలి వ్యక్తి అహం మీద దెబ్బతీసేలా "నేను హవిర్భాగాలు స్వీకరించే సురలోకాధిపతి ముందర మాత్రమే నర్తిస్తాను,నీ పేరున ఇప్పటికెవరూ హవిర్భాగాలు ఇవ్వడం లేదు..ఆ అర్హత లేకుండా నన్ను నర్తించమని అడుగుతున్న నువ్వు నాకన్నా ఎందులో అధికుడివి?" అని దెప్పి పొడుస్తుంది.దానితో అతబు తబకె హవిర్భాగాలని సమర్పించమని ఋషుల్ని పీడించటం,వాళ్ళకి తిక్కరేగి శాపం ఇవ్వడంతో ఇంద్రపదవి పోవడమూ జరుగుతుంది.రంభ ఆ రిటార్టు ఇచ్చింది కూడా అందుకే - అక్కడి సంవిధానం నుంచి ఆ మాటని తీసేస్తే ఇంక మిల్గిలేది శూన్యం!

    "పది బూతులు పది నీతులు కలిపి చెప్పవలె" నని లక్షాన్ని నిర్దేశించుకుని "బూతాడక దొరకు నవు పుట్టదు" అని బల్లగుద్ది చెప్పిన కవి చౌడప్ప తన పద్యాలలఓ ఒక్క అశ్లీలమైన పదాన్ని కూడా వాడలేదు.లోభిని గాడిద కొడకా అని తిడితే గాడిద వీడా నా కొడుకని ఏడుస్తుంది అని సరదా కవిత్వమే.అయినా అప్పటి కాలానికి అవి వాడకూడని మాటలు అయినప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని ఎక్కించాల్సిన వాళ్లకి ఎక్కించటానికి వాటినే వాడి తీరాల్సిన తన అవసరం కొద్దీ వాడుకున్నాడు.

    ఇవ్వాళ గద్ద ముక్కు పంతులు వేషం వేశాకనే అందరికీ తెలిసిన గొల్లపూడి మారుతీరావు గారు పాతకాలం పెద్దమనిషి - చాలా కాలం నుంచీ సినిమాఫీల్డులో ఉండి ఎన్నో సినిమాల్లో డైలాగులు రాసినా తోటివాళ్ళలో చాలామంది కట్టుతప్పి రాసినా తను మాత్రం ఒక్క బూతుమాట కూడా రాయలేదు.అంతటి పెద్దమనిషి కూడా తన కౌముది వ్యాసాల్లో అక్కడక్కడా "ఇక్కడొక బూతుమాట వాడకుండా ఉండలేకపోతున్నాను!" అని చెప్పి వాడిన వ్యాసాలు నేను చదివాను.నేను ప్రతి పోష్టునీ ఎంతో రీసెర్చి చేసి రాస్తాను,నీహారిక "అంత సుదీర్ఘమయిన సుత్తి దేనికి?చదవడం బోరు!" అంటుంది = కానీ పరమ మూర్ఖుడికి కూడా పాయింటు అర్ధం కావడంకోసమే అలా రాస్తున్నాను.అయినా అవి చదివాక కూడా కొందరు ఇంకా పిచ్చెక్కి పోయి మూర్ఖత్వాన్ని పెంచుకోవడం చూస్తుంటే ఒక్కోసారి నామీద నాకే జాలి వేస్తున్నది!అలాంటి సన్నివేశంలో కూడా మీరు సమ్యమనంగా ఉండగలరా!నేను బ్రాహ్మణ్ణనుకుని ఆయిల్ పుల్లింగ్ లాంటి మాటలతో మీలాంటి సుకుమారులు చదవడానికే భయపడిపోయే భాష రాసి "నువ్వు ఇది పబ్లిష్ చెయ్యకపోయినా చదివి ఏడుస్తావని తెలుసు - అందుకే వేస్తునా:-)" అని తన సంస్కారాన్ని బయటపెట్టుకున్నాడు.అతను ఆ కామెంటు ఐడీతోనే వేశాడు!

    TO BE CONTINUED

    ReplyDelete
  27. CONTINUEING FROM ABOVE
    పైన k.s.chaudari మీతో ఫొనులో మాట్లాడేటప్పుడూ ఇక్కడ కామెంట్లలోనూ ఎంత అహంభావం చూపించాడు?పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు తను వేస్తున వెధవేషాలు ఇంకెవరికీ తెలియదని తనకి తనే చెప్పేసుకుని అది మీరే అయి ఉంటారని వూహించేసుకుని మిమల్ని గురించి అంత బేవార్సు కామెంటు వేశాడు.పైన మీరు పోష్టులో "ఇంత స్నేహంగా ఉనవాడు ఇట్లా చేశాడేమిటా అని ఫీలయ్యాను" అని మీరు బాధని వ్యక్తం చేస్తే తన కామెంటులో"ఫోన్లో తప్ప ముఖ పరిచయం లేని తమరు నన్ను అన్ని విధాల ఎలా ఆదుకున్నారు? ఏ విషయాలలో ఆదుకున్నారు? " అని మిమ్మల్ని గద్దిస్తు గదిస్తున్నాడు!మీరు ఏమి సహాయాలు చేశారో అతను దేన్ని మర్చిపోయాడో మీరు తేల్చుకోవలసిన విషయం.కానీ మీతో ఫోను కాంటాక్టు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే పాటి సమ్యమనం కూడా లేకుండా ముందుకు ముందే మీ గురించి ఏవేవో వూహించేసుకుని మీకు ఫోను చేసి తేల్చుకోవడం మానేసి మిమ్మల్ని బద్నాం చెయయ్డమూ మీ పేరు గానీ మీరు శోధిని నడుతుతున్నారని గానీ తెలియని నేను మీ పేరు చెప్పానని చెప్పడం సభ్యతాయుతమైన పనులేనా?

    నీహారిక "కోమటోళ్ళు" అని వాడటాన్ని సమర్ధించి "వ్యభిచారులు" అని వాడకూడదని చెప్పడంలో అర్ధం ఏమిటి?నైతికత=అనైతికత విషయంలో ఉన్న సార్వకాలికత గురించి కొంత అర్దం అయ్యేటట్టు చెబుతాను వినండి!వ్యాపారంలో కస్టమరుకి అన్యాయం చెయ్యడం ఎంత తప్పో దాంపత్యంలో భాగస్వామిని మోసం చెయ్యడం కూడా అంతే తప్పు!రాజు ప్రజలని పీడించి పన్నులు వసూలు చెయ్యడం ఎంత తప్పో ప్రజలు కట్టాల్సిన పన్నుల్ని ఎగ్గొట్టటం కూడా అంతే తప్పు!కోమట్లు వ్యాపారంలో చేసే మోసాన్ని మాత్రమే ఎత్తి చూపిన కంచె ఐలయ్య గొల్ల కులస్థులు పాలల్లో నీళ్ళు కలిపి అమ్మటాన్ని ఎందుకు విమర్శించలేదు?అది ఆధ్యాత్మికమైన అవినీతి కిందకి వస్తుంది!ఒక అవునీతిని సహించి మరొక అవినీతిని సమర్ధించడం నిష్పక్షపాతం ఎట్లా అవుతుంది?

    జకీర్ నాయ్క్,ఆంధ్రా జకీర్ నాయక్ ముష్టాఖ్ అహ్మద్,కంచె ఐలయ్య వాళ్ళ ప్రసంగాల్లో బూతులు వాడరు,మాట్లాడేది సభ్యతాయుతమైన భాషే!కానీ విషయం మాత్రం సభ్యాతాయుతమినది కాదు,పని గటుకుని ఇతరుల్ని రెచ్చగొట్టడానికే అలా మట్లాడుతున్నవాళ్ళు తమ రచనలను చదివి రెచ్చిపోయినవాళ్ళు తమతో మర్యాదగా ఉండాలని ఆశించడం దేనికి?ఎవరి ఆవేశాన్ని బట్టి వారి భాష ఉంటుంది - మంచిమాటలతో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా బరితెగించినవాడితో కూడా కడుచక్కని భాషతో ప్రసంగించడం మీలాంటివాళ్ళకు సాధ్యమవుతుందేమో గానీ మాలాంటివాళ్ళకు సాధ్యపడదు.

    స్వస్తి!

    ReplyDelete
    Replies
    1. @Haribabu Suranenii

      మీ రచనా శైలి చూసి మీరు ప్రతీ అంశం వ్రాసే ముందు ఎంతగా విశ్లేషిస్తారో అర్ధమవుతుంది ( అఫ్కోర్స్ ఒక్కోసారి మన అభిప్రాయాలు అందరికీ నచ్చాలని లేదు కదా)
      రాత్రి కంచే ఐలయ్య చర్చ చూసాను టీవీ9 లో... కొన్ని విషయాల్లో తను కూడా పరిశోధన సరిగా చేయలేదు అని నా అభిప్రాయం.
      ఐతే రాజకీయ, సామాజిక చర్చలకు ఈ బ్లాగు వేదిక కాదు గాబట్టి ... ఒకవేళ నేను మీతో చర్చలలో పాలు పంచుకోవాలన్నా సదరు విషయాలపై పూర్తీ అవగాహన కలిగి ఉండాలి .. దానికి తగిన సమయం దొరకాలి కనుక అది ప్రస్తుతానికి సాధ్యం కాదేమో!

      సింపుల్ గా గమనించిన విషయాలు ఏమిటంటే -- మీరు మీ బ్లాగుల్లో అర్ధంవంతమైన చర్చలే జరుపుతున్నారు ... నిహారికా గారు , ఇంకా కొందరు సబ్జెక్ట్ పై పూర్తీ అవగాహనతో మాట్లాడుతున్నారు ...

      ఒక్కోసారి కొన్ని కొన్ని పరుష పదజాలాలు వాడినా అవి సబ్జెక్ట్ కు సంబంధించినవై ఉంటె ఫర్వాలేదు .. అంతేగానీ వ్యక్తిగత దూషణలు ఒక వ్యక్తిపై వ్యతిరేక భావనకు తద్వారా చర్చల్లో వ్యతిరేక ఆలోచనలకూ దారితీస్తాయని నా అభిప్రాయం.

      చివరిగా నేను చెప్పవచ్చేది ఏమిటంటే -- చర్చల్లో పాల్గొనని నాలాంటి వ్యక్తులపై మీ బ్లాగుల్లో దూషణలు వస్తే అవి ఎత్తి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు. అయితే చర్చలో పాల్గొనేవారు తమలో తాము పోట్లాడుకోవడం కొంతవరకూ తప్పదేమో నని నా అభిప్రాయం ! ఏమంటారు?

      Delete
    2. @Haribabu Suranenii

      "స్నేహం" ... కాలంతో పాటూ అన్నింటిలాగే ఇదీ కలుషితం ఐపోయింది. ఎక్కడైనా మిగిలిఉందేమో అని ఇంకా అన్వేషించాలి...

      Delete
  28. @KSC WRITES

    తమరు మామీద పోస్టు పెట్టి కామెంట్లను వదలకుండా ఉంటె ఎలా సార్?

    ReplyDelete
  29. మీరు ఆపనేదో మీ శోధినిలో టపా పెట్టకుండా చేయాల్సింది.

    -----------------------------------------------

    శోధినిలో టపా పెట్టకముందు మీకు ఫోన్ చెయ్యలేదా ? అప్పుడు మీరు ఏం అన్నారు (నిజం చెప్పండి ఫోన్లకు స్టోరేజ్ లు ఉంటాయ్)

    ReplyDelete
  30. శ్రీనివాస్ గారూ!
    మీరు ఇక్కడ ప్రచురించిన K.S.chaudari అభిప్రాయంలో మీ గురించి అతని అభిప్రాయం ఇది:"ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే."మీరు ఈ పోష్టులో రాసినదాన్ని కామన్సెన్సుతో చదివిన నాకే ఇదివరకటినుంచి ఇప్పటివరకు మీరే అతనిపైన ఇతర్ల విమర్శల్ని చూపించి ప్రతిస్పందించమని చెబుతున్నట్టు అర్ధం అవుతుంది.ఆ అలవాటు ప్రకారమే మొదట మీరే అతనికి చెప్పినా అతను మిమ్మల్నే బ్లేం చెసినట్టు కూడా మీరే చెప్పుకున్నారు.ఇది ఏ రకమైన స్నేహం?మీరూ అతనూ జోకులు వేసుకుంటూ ఉన్నప్పుడే తను మీమీద ఇలాంటి అభిప్రాయంతో ఉన్నట్టు అతని కామెంటుని బట్టే తెలుస్తున్నది,ఇవ్వాళ మీరేమో స్నేహంలో మోసపోవడం గురించి సెంటిమెంటు కురిపిస్తున్నారు!ఇవన్నీ మీ వ్యక్తిగతమైన విషయాలు,నాకు సంబంధం లేనివి.నేను పట్టించుకుని మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక విషయం ఉంది,జవాబు చెప్తారా?

    మీ సొంత విషయాలు నాకు అనవసరం గానీ అతను మీ గురించి నేను కొటేషన్లలో పెట్టి చెప్పినది నిజమేనా?అతను చెప్పింది నిజమయితే మీరు ఇంత ధైర్యంగా నా బ్లాగులోని విషయాన్ని మీ పోష్టులో పెట్టి నన్ను నిదియ్యటం గురివింద సామెతని నిజం చెయ్యటం అవుతుంది - సూటిగా చెప్ప్పాలంటే నన్ను అవమానించడమే అవుతుంది!మీరు అలా చెయ్యలేదని నిరూపించుకుంటే బాగుంటుంది,ప్రస్తుతానికి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ తన కామెంటులో ఇచ్చిన అతన్ని నిలదీస్తారో కలబదతారో వెలివేస్తారో మీ ఇష్టం,తన చేత అది అబద్ధం అని చెప్పించి క్షమాపణ చెప్పించుకోవటం మీ కనీస బాధ్యత.లేని పక్షంలో మిమ్మల్ని బండబూతులు తిడుతూ వరస పోస్టులు వేస్తాను - బస్తీ మే సవాల్!

    P.S:నాకు స్వాభిమానం చాలా ఎక్కువ - అతను మీ గతచరితర్ గురించి చెప్పినది నిజం అని తెలిస్తే మాత్రం ఇక మీరు జన్మలో తల ఎత్తుకు తిరగడానికి వీల్లేనంత అవమానం నానుంచి ఎదుర్కొంటారు - ఖబడ్దార్!

    ReplyDelete
  31. @Haribabu Suranenii

    "మీరు ఈ పోష్టులో రాసినదాన్ని కామన్సెన్సుతో చదివిన నాకే ఇదివరకటినుంచి ఇప్పటివరకు మీరే అతనిపైన ఇతర్ల విమర్శల్ని చూపించి ప్రతిస్పందించమని చెబుతున్నట్టు అర్ధం అవుతుంది"

    ఈ వాక్యానికి అర్ధం నాకు తెలియట్లేదు ... సరిగా చెపితే నేను అర్ధం అయ్యేలా చెపుతాను.

    ఇంకో విషయం
    >> మిమ్మల్ని బండబూతులు తిడుతూ వరస పోస్టులు వేస్తాను - బస్తీ మే సవాల్! <<

    బండ బూతులు తిట్టడం మీకు అంత అలవాటా ? సభ్యత ఉండదా?

    >>అతను మీ గతచరితర్ గురించి చెప్పినది నిజం అని తెలిస్తే మాత్రం ఇక మీరు జన్మలో తల ఎత్తుకు తిరగడానికి వీల్లేనంత అవమానం నానుంచి ఎదుర్కొంటారు - ఖబడ్దార్!<<

    నా గత చరిత్ర అతను ఏమి చెప్పాడు ? ఆకాలంలో బ్లాగుల్లో ఉన్నవారిని అడగండి.. నాకైతే మీరు ఉన్నారో లేదో గుర్తులేదు . లేదా నా పాత బ్లాగు టపాలు చదవండి

    ReplyDelete
  32. గతంలో ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం ఎలా సృష్టించానో అతనికే తెలియాలి..

    ఇకపోతే మీ పాయింట్ ఒకటి నచ్చింది .. మీ బ్లాగులో కామెంట్ తీయమని చెప్పి నా బ్లాగులో ఎందుకు ఉంచాను అనేది ..

    అవును నేను ఈ విషయంలో చేసింది తప్పే ...

    ఇప్పుడే తీసేస్తాను ...

    ReplyDelete
  33. ఒక విషయం .. ఈ పోస్టు మిమ్మల్ని Anonymous కామెంట్ని ను ఏ విషయం తెలీకున్నా అనుమతించినందుకు వ్రాసానే గానీ అతడిని క్షమాపణ కోరదామని కాదు. అతను అప్పటికే ఫోన్లో క్షమాపణ చెప్పాడు,. ఆ కామెంట్ తీస్తానని నాకు చెప్పినా అజ్ఞాత కామెంట్ కాబట్టి తొలగించలేక పోయాడు

    ReplyDelete
  34. ఈ అంశానికి సంబంధించని కామెంట్లను తొలగించాను ... కామెంట్ల మోడరేషన్ ఉంచకపోవడానికి కారణం నేను ఎక్కువగా బ్లాగు చూడను ...

    హరిబాబు గారు సకాలంలో స్పందించి ఈ చర్చకు ముగింపు పలికారని ఆశిస్తున్నాను.

    @Haribabu Suranenii

    ఈ టపాకు ఇక కామెంట్లు ముగిస్తున్నాను. మీరు నాగురించి వ్రాయదల్చుకుంటే వేరే టపాలో లేదా మీ బ్లాగులో కామెంట్ గా వ్రాయగలరు.

    ReplyDelete
hit counter