క్రొత్త సర్వర్ లోనికి శోధిని మారింది - త్వరలో ఉగాది బ్లాగుల పోటీ !

నిన్నటి నుండి శోధిని మొరాయించడానికి కారణం సర్వర్ మార్చే ప్రయత్నంలో ఉండడం. శోధిని ని ఇప్పుడు వేగంగా లోడ్ అయ్యే మా స్వంత సర్వర్ లోనికి మార్చడం పూర్తయింది . name server  రికార్డ్స్ కూడా  పూర్తిగా మారినట్లుగా అనిపిస్తుంది . మీరు కూడా గమనించి ఏవైనా లోపాలు ఉంటే తెలియపరచగలరు. ఒకవేళ ఒక్కోసారి పనిచేయకపోయినా మరో 24 గంటల్లో పూర్తిగా పనిచేస్తుంది. 
వచ్ఛే ఉగాదికి బ్లాగిల్లు శోధినిగా మారి సంవత్సరం అవుతుంది. ఇంతకాలం మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఒకవైపు ప్రభుత్వాలు కూడా తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎటువంటి తరుణంలో తెలుగు భాష మనగలాలి అంటే తెలుగు బ్లాగర్ల ద్వారా కూడా సాధ్యమే . ఎన్ని ఇతర భాషా బ్లాగులు ఉన్నా కనీసం ఒక్క తెలుగు బ్లాగునైనా నడుపుతూ ఉండమని నా మనవి .
ఇందుకు "శోధిని" ద్వారా ప్రోత్సాహాన్ని అందించేందుకు నేను రెడీ ! తెలుగులో టైపు చే యడం రాని  వాళ్లు లేదా తెలుగు వచ్చి బ్లాగు ఎలా ప్రారంభించాలో తెలియని వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేను వారికి సహాయం పడగలను . క్రిమ్ద ఉన్న లింకులో మీ సహాయం కోసం అడిగితె నేను మీకు ఉచితంగా ( ఫోన్ బిల్లుతో పాటూ ) ఆన్ లైన్ సహాయం/శిక్షణ ఇచ్చేందుకు  సంసిద్ధం. 

మీ ఫోన్ నంబర్ ఇవ్వడం మర్చిపోకండి.


మరో శుభవార్త ! 

ఈ ఉగాదికి తెలుగు బ్లాగుల పోటీ జరగనుంది .. ఇది వినూత్నంగా ఉండబోతొంది పూర్తి వివరాలు త్వరలో  

8 comments:

  1. కొత్త సర్వర్ లోకి వెళ్తున్న సందర్భంగా శుభాభినందనలు. వర్డ్ ప్రెస్ బ్లాగుల కామెంట్లు శోదినిలో కనపడటం లేదు. ఒక సారి చెప్పాను,సరి చేశారు, రెవ్ండు రోజులకే మళ్ళీ గాయబ్, ఇక చెప్పి మిమ్మల్ని విసిగించలేక మానేశాను.

    బ్లాగర్లందరికి నీరసాలే వచ్చి ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు శర్మగారూ.. వర్డ్ ప్రెస్ కామెంట్లు శోధినిలో వస్తూనే ఉన్నాయి. మీరు కొన్ని బ్లాగుల కామెంట్లు రాకపోవడం గమనించి ఉంటే తెలుపగలరు.

      Delete
    2. https://kastephale.wordpress.com/
      https://kastephali.wordpress.com/
      నా రెండు బ్లాగుల కామెంట్లు చాలా కాలం నుంచి శోధినిలో కనపడటం లేదండి

      Delete

  2. బ్లాగర్లందరికిన్నూ
    బాగౌ నీరసము గదవె ! ప్లాట్ఫారమ్లన్
    పైగా సర్వర్లన్ మే
    లై గావింపను జిలేబి లాభము గలదే ? :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అర్ధం కాలేదు :(

      Delete


    2. సర్వర్లను మార్చెన్ శ్రీ
      పర్వంబు యుగాదినాడు పట్టము గట్టున్
      సర్వాంగ సుందరముగన్
      కర్వలి బోయిన జిలేబి కాయమునకటన్ :)

      జిలేబి

      Delete
  3. ప్రస్తుతం‌ కనబడుతూ ఉన్న తెలుగు బ్లాగులే చాలా తక్కువ.
    వాటిలో విషయం ఉన్నవి బాగా తక్కువ.
    తెలుగు బ్లాగులను చదివేవారి సంఖ్య తక్కువ.
    కాస్త విషయం ఉన్న బ్లాగులైతే వాటి జోలికి పోయే వారి సంఖ్య దాదాపు శూన్యం.
    తెలుగుబ్లాగులను చదివే వారిలో బ్లాగర్లను మినహాయించిటే కేవలం బ్లాగులను చదివే వారి సంఖ్య నిజంగా శూన్యం.
    గిల్లికజ్జాలకోసమో భళీభళీలకోసమో వ్యాఖ్యలను ప్రకటించే వారిని మినహాయిస్తే తెలుగుబ్లాగులకు వచ్చే ఆలోచనీయమైన వ్యాఖ్యలు స్వల్పం.
    కొన్ని వ్యాఖ్యలైతే కసరుకాయల వంటివో‌ చెట్టుచెడేకాలపు పిందెలవంటివో వంటి పద్యానర్థప్రయత్నాలదుర్గంధంతో వెగటు పుట్టిస్తూ వ్యాఖ్యల పుట అంటేనే భయం వేసేలే చేస్తున్నాయి.
    ఇంతదుర్గతిలో ఉన్న తెలుగుబ్లాగులమధ్య పోటీ పెట్టే ప్రయత్నం ఒకటా అని నా అనుమానం.
    ఏమో అదేమన్నా సత్ఫలితాలనిస్తే సంతోషమే.
    చూదాం. చూదాం.

    ReplyDelete
  4. శోధినిలో వ్యాఖ్యల విభాగం ఏప్రిల్ 21 తరువాత అప్డేట్ అవడంలేదు శ్రీనివాస్ గారు.

    ReplyDelete

hit counter