నాకిష్టమైన తెలుగు నవలలు

చిన్నతనంలో  అనేక సాహిత్య నవలలు, పుస్తకాలు చదివేవాడిని . అయితే అన్నింటిలో నాకు నచ్చినవి మూడు ఉన్నాయి. అవి ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. అవి గురజాడ వారు రచించిన కన్యాశుల్కం నాటకం, గోపీచంద్ వ్రాసిన అసమర్ధుని జీవయాత్ర మరోటి మొక్కపాటి వారు వ్రాసిన బారిష్టర్ పార్వతీశం నవల. ఈ నవలలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి.
ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అంటే  రెండు రోజుల క్రితం మై ఇండ్ మీడియా అనే తెలుగు ఆన్లైన్ రేడియో స్టేషన్ లో బారిష్టర్ పార్వతీశం నవల వచ్చింది . అసలు ఈ నవల ఇష్టం కలగడానికి రెండుకారణాల్లో ఒకటి దానిలోని హాస్యం కాగా మరోటి అది నా చిన్నతనంలో హైదరాబాద్ ఆకాశవాణీ ద్వారా ఆడియో సీరియల్ గా ప్రసారం అవడం. అది చదివింది ఎవరో గుర్తులేదు గానీ ఆ చదివిన విధానం నాకు నవలలు ఎలా ఆస్వాదిస్తూ చదవాలో నేర్పింది .
ఈ నవలను (మొదటి భాగం) మళ్లీ నాకు వినే భాగ్యం ప్రసాదించిన ఆ రేడియో వారికి కృతజ్ఞతలు. దీని లింక్ క్రింద ఇస్తున్నాను. మీరూ వినొచ్చు.
 

ఈ రేడియో స్టేషన్ ఇక్కడ లైవ్ లో వినొచ్చు
http://myindmedia.com/

ఇంకా  సంగతులు ఇక్కడ ఉన్నాయి https://soundcloud.com/myindmedia

1 comment:

  1. అయ్యేయ్యో చక్కటి నవల ఇలాగా చదివేది. చదవటం మీద, భాష మీద పట్టు ఉన్న వారెవరన్నా చదివితే ఎంతైనా బాగుండేది.

    ReplyDelete

hit counter