దీపావళి శుభాకాంక్షలతో .. ప్రస్తుతానికి ఇక్కడ బ్లాగిల్లు

మొదటిగా తెలుగు బ్లాగర్లందరికీ వెండివెలుగుల దివ్య దీపావళి శుభాకాంక్షలు .
బ్లాగిల్లు కి బై బై చెప్పినప్పటినుంచి  నేను బ్లాగులు చూడడానికి కూడలి, మాలికలపై ఆధారపడ్డాను . వ్యాఖ్యలకోసం మాలికను చూసేవాడ్ని . ఏమనుకోనంటే నాకైతే పెద్ద సంతృప్తిగా అనిపించలేదు . కారణం మాలికలో అన్ని బ్లాగుల వ్యాఖ్యలూ  కనిపించకపోవడం .
అలాగే నాకు చాలా మెయిల్స్ వచ్చాయి . బ్లాగిల్లును పునః ప్రారంభించమని . కానీ వారితో ఇక కుదరదు అని చెప్పేసాను .
బ్లాగిల్లు మూసేయదానికి ప్రధాన కారణం ఆర్ధిక కారణం కాదు . ఎందుకంటే దాని హోస్టింగ్ ఉండనే ఉంది . అలాగే డొమైన్ కూడా రిన్యువల్ చేయడం కష్టం కాదు . కానీ తెలుగు బ్లాగులోకం స్థబ్దుగా ఉన్నప్పుడు ఇక కొనసాగించడం దండగ అనిపించింది . ఆదరణ లేకపోవడం అంటే ఒక్క బ్లాగిల్లుకే కాదు బ్లాగులకు కూడానూ ..
అయితే కనీసం కొంతలో కొంత బ్లాగు వీక్షకులకు సాయపడుదామని బ్లాగిల్లును బ్లాగర్ లో ఉంచాను . వ్యాఖ్యల విభాగం కూడా ఉంది . ప్రస్తుతానికి ఇక్కడ మీరు బ్లాగిల్లును చూడొచ్చు .


కాకపొతే ఇక బ్లాగిల్లు డొమైన్ అయితే మీకు కనపడదు . కనుక బ్లాగిల్లు widgets  తొలగించుకోవాలని మరో విజ్ఞప్తి .

మరి భవిష్యత్ ప్రణాళిక అయితే ఒకటి ఉంది . అదేమిటంటే ఇండియాలోని బ్లాగర్ల కోసం ఇంగ్లీషులో ఒక ఆగ్రిగేటర్  ప్రారంభించాలని . దానిలోనే హిందీ, తమిళ్, తెలుగు మొదలైన భాషా విభాగాలు ఉంచాలని . అది త్వరలోనే కార్యరూపం దాల్చవచ్చు. దానికి మీ అందరి ఆశీస్సులూ కోరుతూ ...

13 comments:

  1. శ్రీనివాస్ జీ,
    పునః స్వాగతం. ఇదొక వ్యసనం. నిజానికి డబ్బు అనేది ఇందులో రెండవ స్థాయి మాటే. ఇక్కడ ముఖ్యంగా కోరేది మాట, అందునా ఉత్సాహం కలిగించే మాట. ఎందుకో ఏమోగాని ఉత్సాహాన్ని చంపెయ్యాలనే కంకణం కట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నవారిని చూస్తే బాధ కలుగుతున్న మాట వాస్తవం. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి మాటాడిన వాడిగా నా అనుభవమిది. మీ ప్రయత్నం లో విజయం పొదాలని ఆశిర్వదించడం తప్పించి మరేమీ చేయలేని అశక్తుడను. విజయోస్తు.దిగ్విజయమస్తు.

    ReplyDelete
    Replies
    1. శర్మ గార్కి , దీపావళి శుభాకాంక్షలు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఉంటె చాలు .. అవే రధ సారధి శ్రీకృష్ణుని లాంటి బలం నాకు

      Delete
  2. విషయం చెప్పాలనే తొందరలో శుభకామనలు మరచాను.
    మీ కుటుంబానికి మీకు మా కుటుంబం తర్ఫున దీపావళి సుఖ సంతోషాలనివ్వాలని ఆశిస్తూ శుభకామనలు.

    ReplyDelete
  3. బ్లాగిల్లు" శ్రీనివాస్ గారూ, మీరు మనసు మార్చుకుని తిరిగి వచ్చినందుకు సంతోషం. దీపావళి బహుమతి ఇచ్చారు మీరు. మీకు, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. విజయోస్త్తు సర్

    ReplyDelete
  5. దీపావళి శుభాకాంక్షలు!! శ్రీనివాస్ గారు... గూగుల్ వారి భాషలలో తెలుగును కూడా త్వరలో జత చేస్తారు.. అప్పుడు.. గూగుల్ యాడ్-సెన్స్ ఉచితంగా అప్రూవ్ కావచ్చు.. డబ్బు ఒక్కటే పరమావధి కాదు కానీ.. బ్లాగిల్లు లాంటి మంచి అగ్రిగేటర్ల వలన.. తెలుగు భాషకు ఎనలేని సేవ కలుగుతోంది.. ప్రస్తుతం అంతర్జాల శోధనలో తెలుగులో దొరకని విషయం లేదు.. మన ఈ అగ్రిగేటర్ల వలననే ఇంత అభివృద్ధి సాధ్యమయింది.. ఏ ఇతర భాషలలో ఇంత సౌలభ్యం లేదు.. అందుకే ముందు నుండే సిద్ధంగా ఉంటేనే అవకాశాన్ని అంది పుచ్చుకోవచ్చు.. అయితే ఈ గూగుల్ అప్రూవల్స్ వలన రీచింగ్ పెరిగి కొత్త ఉత్సాహం ఇనుమడించ వచ్చు.. !!!

    ReplyDelete
  6. శ్రీనివాస్ గారూ, "బ్లాగిల్లు" సంకలిని మళ్ళీ ఆగినట్లుందే!

    ReplyDelete
  7. @విన్నకోట నరసింహా రావు గారూ ! తప్పయితే క్షమించాలి .. ఇక కుళ్ళిపోయిన ఈ బ్లాగులోకంలో ఇమడలేను.

    ReplyDelete
  8. నిజం! బొడ్డుతాడు తెంచుకుని సుఖపడ్డారు, మరి నన్ను అభిమానులు వదలటం లేదు. నాబతుకే........

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పే విలువైన విషయాలు తెలుసుకోవాలని ఉండేవాళ్లు ఉంటారు . అయినా మీ బ్లాగులో అనవసర వ్యక్తుల కామెంట్లను అనుమతించకండి .. వారితోపాటు కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి .

      Delete
  9. "బ్లాగిల్లు" కు మళ్ళీ విరామమా? శ్రీనివాస్ గారు మళ్ళీ మనసు మార్చుకున్నారా ??????

    ReplyDelete

hit counter