'బ్లాగిల్లు' వ్యాఖ్యల విభాగంలో చేయబోతున్న మార్పులు - సలహాలకు ఆహ్వానం

        


        వ్యాఖ్యల విషయంలో వివాదాలు వస్తున్నాయని కాదు గానీ ఈమధ్య చాలామంది ఈ విషయంపై అనేక టపాలు, కామెంట్లు చేస్తుండడం నేను చూస్తున్నాను . సాధారణంగా నేను బ్లాగుల్లో టపాలను, వ్యాఖ్యలను  రాత్రి 10 దాటాక మాత్రమే కాసేపు వీక్షిస్తూ ఉంటాను. నేనే కాదు పగలంతా జాబ్ లోనో, పనిలోనో ఉండే వాళ్ళంలో చాలామంది మధ్యలో సమయం దొరికితే తప్పించి ఉదయం 10 లోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమె ఎక్కువగా సంకలినులను వీక్షిస్తూ ఉంటారని నా విశ్లేషణ. ఈ మధ్య మొబైల్స్ వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింది. దీనితో వీలున్నప్పుడల్లా మొబైల్ లో కూడా వీక్షిస్తున్నారనుకోండీ ..కొన్ని బ్లాగుల్లో వ్యాఖ్యలు  ఎక్కువగా వస్తే అవి ఉదయం పోస్టుచేసిన వ్యాఖ్యలను రాత్రికల్లా ఆ పేజీ నుండి తప్పిస్తాయి.
       ఇంతకుముందు బ్లాగిల్లులో వ్యాఖ్యలను, టపాలను బ్లాగులను బట్టి, రచయితలను బట్టి చూసుకునే వీలుండేది .కానీ ప్రస్తుతం అలా సాధ్యంకాదు . ఇక ప్రస్తుత స్క్రిప్టుతో మాలికలో అలా చేయగలిగే వీలు ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాకపొతే డేటాబేస్ సైజును పెంచడం ద్వారా మాలికలో ఈ సదుపాయం కల్పించే అవకాశం  అయితే ఉంది .
 ఇక బ్లాగిల్లు గురించి ...
వీక్షకులకు బ్లాగర్లకు సదుపాయాలు కల్పించడంలో అడుగు ముందుకేసే వారిలో ముందుగా నేను ఉంటాను. అందుకే ఈ రోజు ఈ విషయమై కాస్త తీరిక చేసుకొని వ్రాయాలనిపించింది. వ్యాఖ్యలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ విభాగాన్ని మార్పు చేయాలని అనుకుంటున్నాను . నాకున్న పరిమితుల దృష్ట్యా క్రింది మార్పులు సూచిస్తున్నాను ... దీనిపై మీ సలహాలు ఆహ్వానిస్తున్నాను
  1. రెండు కాలమ్ లలో ఒక్కో కాలమ్ కి దాదాపు 50-100 వరకూ వ్యాఖ్యలు
  2. కొన్ని బ్లాగుల్లో కామెంట్లకి ప్రత్యెక విభాగాలు  ( ఆ కొన్ని ఏవి ? రాజకీయ బ్లాగులా ? సాహితీ బ్లాగులా ? ) 
  3. రెండు పేజీల్లో వ్యాఖ్యలు. 
పై విషయాలలో మీ అందరి సలహాలూ కోరుతున్నాను . అందరికీ సంబంధించిన విషయం కనుక సాధ్యమైనన్ని ఎక్కువ, నిర్మాణాత్మక సూచనలు చేయగలరు .

9 comments:

  1. ప్రస్తుతం మాలిక మోడల్ తో పాటు వివిధ బ్లాగులను విడిగా కూడా చూసుకునేలా అవకాశం ఉండాలి. కొన్ని బ్లాగులు ఏవి అనేది మీరు ఆలోచించాలి. నేనైతే చర్చావేదికల బ్లాగులకి అవకాశం ఇవ్వాలి అంటాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు కొండలరావుగారూ !

      Delete
    2. హారం లాగ చెయ్యలేము అని కాదు . దానికి అయ్యే ఖర్చు చాలా ఉంటుంది . ప్రతీ సంవత్సరం కొన్ని వేలు వెచ్చించి చేసినా 'ఆదాయం' రాదు కదా !

      Delete
    3. మన బ్లాగర్లు ఖర్చు భరించలేరు, అందుకే నేను Advertisements లు తీసుకోండి బాబూ అంటున్నది.

      Delete
  2. మీ పట్టుదలకి జోహారు. నేను చాలా కాలంగా చెబుతున్నమాట. రాజకీయ,సాహిత్యబ్లాగులకు రెండు కాలంలుగా ఒక పేజీ వ్యాఖ్యలకు కేటాయించేస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ ఒక చోట రెండు కాలమ్స్ గా ప్రచురిస్తే బాగుంటుందనుకుంటా.

    హారం లో లాగా చేయగలిగితే సమస్యలేదు.

    ReplyDelete
  3. కృతజ్ఞతలు శర్మాజీ ! ప్రస్తుతం ఇచ్చిన మార్పు చూడండి

    ReplyDelete
  4. ఆ( బాగుంది. దీనికి మరొకపేజీ జోడింపు. ఆ తరవాత రాజకీయ, సారస్వత బ్లాగు ల కామెంట్లు విడతీత మిగిలింది :)

    ReplyDelete
  5. మీరు సూచించిన విధానం బాగుంది సర్!

    ReplyDelete

hit counter