కామెంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి

      కొద్ది రోజుల క్రితం అత్యధిక వృద్దిరేటు కలిగిన ఇంటర్నెట్ మాధ్యమంగా బ్లాగులు : ఇండీబ్లాగర్ రిపోర్ట్ 2014  అనే పేరుతో ఒక టపా వ్రాసాను . ప్రపంచవ్యాప్తంగా బ్లాగులు అంతలా  వృద్ది చెందుతుంటే తెలుగులో బ్లాగులు ఆదరణ కోల్పోతున్నాయా ?
     ఈ విషయం ఈ మధ్య చాలా మంది బ్లాగర్ల మాటల్లో తెలుస్తూ ఉంది . ఆ మధ్య భరద్వాజ్ వెలమకన్నిగారు " I think the Telugu blogs are almost dead now. Jai Facebook :) " అన్నా మరొకరు నేను బ్లాగింగ్ మానేసి గూగుల్ ప్లస్ వాడుతున్నాను అన్నా బ్లాగులపై వారి నిర్లిప్తత అర్ధమవుతూ ఉంది . నిజమే ఒకప్పుడు ఓ వేలుగువేలిగిన బ్లాగులు ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయాయి ?
    శర్మగారైతే తన బ్లాగు చౌర్యానికి గురి అవుతున్నదని బ్లాగింగే మానుకోదలచుకున్నారు .  శ్యామలీయంగారు  బ్లాగర్లను సంఘటితం చేయడానికి ఓ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నారు . ఆయన చొరవకు అభినందనలు తెలపాలి . అయితే దీనికి కామంట్ల రూపంలో అంగీకారం తెలిపింది ఎందరు ? మహా అయితే ముగ్గురు . ఒకరైతే ఆయన్ను విమర్శ  కూడా చేసారు . ఇది మంచి పరిణామమా ?
నాకు తెలిసి శ్యామలీయం గారి టపాను 200 మందికి పైగా చదివి ఉంటారని అనుకుంటున్నాను . మరి ఎందుకు స్పందనలు కరువవుతున్నాయి ?
      ఒక్క ఆ టపానే కాదు తెలుగు బ్లాగు లోకంలోని ఎన్నో టపాలు కనీసం 100 కు తగ్గని వీక్షకులను పొందుతున్నాయి కానీ ఎంతో మంచి .టపాలకు కూడా మహా అయితే ఓ పది వ్యాఖ్యలు మాత్రం వస్తున్నాయి. సాయికుమార్ గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు .
      అందుకే వీక్షకుల్లారా మీరు టపా చదివి కనీసం బాగుంది అని సింపుల్ గా ఓ కామెంట్ పెట్టండి. అదే బ్లాగర్ కు ఇంధనం. ఎందుకంటే మిగతా భాషల్లో ( ముఖ్యంగా ఇంగ్లీష్ బ్లాగులు ) మన బ్లాగులు కాసులు కురిపించవు . గూగుల్ ఏడ్ సెన్స్ ( google adsense ) తెలుగు భాషను అనుమతించదు .
ప్రస్తుతం అత్యధికంగా వ్యాఖ్యాతలు దాదాపు ఓ వంద మంది ఉన్నారు . వారిలో రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు చేసేవారే అధికం .
     ఇక బ్లాగిల్లు సంగతి - వ్యాఖ్యలకు ప్రత్యెక విభాగం ఎప్పుడూ ఉంది . ప్రతీరోజూ అత్యధిక వ్యాఖ్యలు చేసే వారి పేర్లు , అత్యధిక వ్యాఖ్యలు పొందే బ్లాగుల లిస్టు ఎప్పట్నుంచో  ఉంది .
     నిన్న నేను ఓ వ్యాఖ్య వ్రాసి సగంలో ఆపానని శర్మగారు దానిపై ఏంతో మంచి విషయాలతో కూడిన టపా వ్రాసారు .నేను నిన్న వ్యాఖ్య వ్రాస్తూ మధ్యలో అనుకోకుండా ప్రచురించు నొక్కాను . నేను ఎందుకు సగంలో ఆపానో అనుకున్న శర్మగారు విషయాన్ని ఎంతో చక్కగా వర్ణించారు . ఆయన జీవన అనుభవాన్ని మనం కామెంట్ల రూపంలో ఏదోరకంగా టపాలద్వారా బయట పెట్టించవచ్చు అనే విషయం బోధపడింది . ఇదే విషయం జిలేబిగారు చెప్పారు .
      ఆయనే కాదు టపాలు వ్రాసే ప్రతీ బ్లాగర్ కోరుకునేది ప్రశంసలు . వాటిని కామెంట్ల రూపంలో మనం ఇస్తే వారు మరింత ఉత్సాహంతో రచనలు చేస్తారు . మరిన్ని మంచి టపాలు వస్తే తెలుగు బ్లాగులు వృద్ది చెంది ప్రభుత్వం బ్లాగులను అధికార మాధ్యమంగా గుర్తించే  రోజులు వస్తాయి . అప్పుడు బ్లాగుల్లో వ్రాసే టపాలకూ గుర్తింపు , గౌరవం వచ్చి పత్రికలలోని రాతలను మరో పత్రిక ఎలా కాపీ కొట్టలేదో బ్లాగుల్లో కూడా టపాల  దొంగతనాలు ఆగుతాయి .
ఒక్క టపాలు మాత్రమె కాదు అనేక విషయాల్లో వేరే బ్లాగులాగే ఉండాలని కోరుకోవడం ఎందుకు ? మనకంటూ ఓ ప్రత్యేకత ఉండొద్దా ? అది సాధిద్దాం !
     అందుకే వ్యాఖ్యతలారా విరుచుకుపడండి .. మరిన్ని మంచి టపాలు వచ్చేలా రచయితలను ప్రోత్సహించండి
జై తెలుగు బ్లాగులు .. !!

23 comments:

  1. agreed...so commenting (starting with this)

    ReplyDelete
  2. బలవంతపు బ్రాహ్మణార్థం లా ఉందే మీ మాట :)

    ReplyDelete
  3. ఒకప్పుడు ఓ వేలుగువేలిగిన బ్లాగులు ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయాయి ?"

    సమాధానం మీకు తెలియదా? బ్లాగులు చూడాలంటే నే అవి విద్వేషపు రాతలు, నానా ఎత్తిపోతల చెత్త మాత్రమే కనిపిస్తున్నప్పుడు ఎవరు వాటిని వాడటానికి ఇస్టపడుతున్నారు. తా మునిగినది గంగ అన్నట్లు అవి వ్రాసే వాళ్లకు అవి గొప్పే కావచ్చు, కాని ఉన్న కాస్త టైం లో ఈ చెత్త లో కాస్త మనసుకు ఆహ్లాదం కలిగించే వాటిని వెతుక్కోవటం కంటే, చక్కగా ముఖ పుస్తకం లోనో, గూగులు ప్లస్ లోనో, మన లాంటి like minded వాళ్ల అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకుంటూ సరదాగా గడపటానికే Quality bloggers (ఒకప్పటి) వాళ్లు ఇష్టపడుతున్నారు అన్నది నిజం.

    ఇందులో చెత్త అని తెలిసినా, ఎత్తిపోతల వీరులను (వారు ఎవరయినా) ప్రోత్సహిస్తూన aggregators ది కూడా నా దృష్టిలో తప్పే!!

    my 2 cents

    ఇక శ్యామలీయం గారికి కామెంట్స్, అసలౌ బ్లాగులు అంటేనే విరక్తి కలుగుతుంటే, ఇక సమావేశాలు అంటే ఎవరు respond అవుతారు ఇష్టం గా, కాకపోతే ఇంకా అలవాటు ప్రకారం కొద్ది మంది అయినా రోజుకు ఒకసారో, రెండు సార్లొ aggregators ను ఒక look వేస్తున్నారు, అంతే!!

    ReplyDelete
  4. శ్రీనివాస్ గారూ,

    మీరు తీసుకుంటున్న చొరవకు అభినందనలు. సమావేశం టపాకు ఒక 300దాకా హిట్లు వచ్చాయి. ఈ సమావేశం కార్యరూపం దాలిస్తే మంచిదే. చూదాం.

    వ్యాఖ్యలు ప్రోత్సాహకరమే. సందేహం లేదు. కాని అవే సర్వస్వం కాదు. ఐనా చదివిస్పందించే వారి కోసం కాక వ్రాయటం ఎందుకు అనక పోయినా స్పందించే వారిని బట్టి తప్పులు దిద్దుకునే అవకాశమూ దొరుకుతుంది కదా.

    ReplyDelete
  5. ఇదివరకు తెలుగులో మంచి విషయ విశ్లేషణా, సమాచారమూ, పరిశోధనాదృష్టి గల స్టార్ బ్లాగర్లు కొందరు ఉండేవారు. వాళ్ళల్లో కొందరు మహాపండితులు కూడాను. I personally miss them a lot. వ్యక్తిగత బ్లాగులు కనక వాళ్ళల్లోనూ ప్రిజుడీసులూ, బయాసులు ఉండేవి. కానీ అవి చదవ బుద్ధేసేవి. అయితే నానా కారణాల చేత 2012 తరవాత - వాళ్ళంతా బ్లాగింగులోంచి విరమించుకున్నారు. అప్పట్నుంచీ మన బ్లాగులకి శని పట్టింది. పాత స్టార్ బ్లాగర్లు మళ్ళీ రంగంలోకి దిగాలని కోరడం తప్ప దీనికి వేరే పరిష్కారం లేదు.

    ఇహపోతే ఫేస్ బుక్కేదో అద్భుతంగా వెలిగిపోతోందనే అభిప్రాయం కూడా నిజం కాదు. ఈ రోజుల్లో ఫేస్ బుక్ లో ఏం పోస్ట్ చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న రోజులివి. అందుకని చాలామంది దానిక్కూడా దూరంగానే ఉంటున్నారు. ఫేస్ బుక్ ప్రస్తుతం ఒక ఫేక్ బుక్. అది వ్యాపార సంస్థలకీ, రాజకీయ గ్రూపులకీ అడ్డా గా మారిపోయింది.

    ReplyDelete
  6. పై అగ్నాతతో ఏకీభవిస్తున్నా. ఒకప్పటి సీరియస్ బ్లాగర్‌లందరూ విరమించుకున్నాకే ఇలా తయారయ్యింది. పైన చెప్పినట్టు వాళ్ళ ప్రిజుడీసులు వాళ్ళకి ఉన్నా, మన వ్యక్తిగత అభిప్రాయాలకి భిన్నంగా ఉన్నాకూడా చదవబుద్దేసేవి, ఆలోచింపచేసేవి వారి రాతలు. వాళ్ళు మళ్ళీ దిగితేనే కానీ మళ్ళీ బ్లాగులు చదవబుద్దేయదనేది నిజమే కానీ ఇప్పుడు ఇన్ని విద్వేషాలు పడుతున్న బ్లాగుల్లోకి వాళ్ళని మళ్ళీ రమ్మని ఏ మొహం పెట్టుకుని ఆడుగుతాం.

    సహజంగా ఆలోచనాపరులు సున్నితమనస్కులై ఉంటారు. తెలుగు బ్లాగుల్లో పిడివాదాల మధ్యా, సిద్దాంతాల రాద్ధాంతాల మధ్యా నిలబడాలంటే కాస్త తోలుమందం తప్పనిసరి. తెలుగుయోగి బ్లాగు శర్మగారిలా కామెంట్స్ డిసేబుల్ చేసేసి జనాల్ని పట్టించుకోకుండా తనమానానతాను నచ్చినవి చెపాలనుకున్నవి రాసుకుంటూ పోతున్నట్టు, ఈ సీరియస్ రైటర్స్ కూడా తమలాంటి కొద్దిమందితో టచ్‌లో ఉంటూ వాళ్ళకోసమే అన్నట్టు మిగతావాళ్ళని పట్టించుకోకుండా రాసుకుపోతే కాస్తో కూస్తో కళ వస్తుంది తెలుగు బ్లాగు లోకంలో.

    ReplyDelete
  7. అవును బ్లాగులు చాలా నిస్సారంగా , చప్పగా సాగుతున్నాయి .
    ఒకప్పుడు మంచి మంచి చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. ఇప్పుడు అంతా ఒక వర్గం భావజాలం తప్ప ఏమి లేదు .
    కొన్ని మంచి బ్లాగ్ లు restrict చేసి వాళ్ళ స్నేహితులు కోసమే రాస్తున్నారు .
    ఆశ్చర్యం ఏంటంటే, బ్లాగ్ లోకం లో డేరింగ్ అండ్ డాషింగ్ అనబడే శరత్ గారు కూడా బ్లాగ్ ను కొంతమందికే పరిమితం చేయడం ఏంటో అర్ధం కావడం లేదు .
    ఆధ్యాత్మిక, చరిత్ర రంగాలాలో లబ్ధప్రతిష్టులు అయిన బ్లాగ్లు ఇప్పుడు ఎక్కడ కనపడటం లేదు. కనీసం ఆరు నెలలకి ఒక టపా కూడా వేయని బ్లాగ్ లు చాలా ఉన్నాయి .

    ReplyDelete
  8. అన్ని రకాల సోషల్ మీడియా వాటి విలువలు కోల్పోయాయి, ఇది వ్యక్తుల మూలంగానే జరిగింది. ఇంక బాగుపడే సూచనలు లేవు. ఈ మీడియాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

    ReplyDelete
  9. @ Anonymous10 September 2014 16:05
    "ఆశ్చర్యం ఏంటంటే, బ్లాగ్ లోకం లో డేరింగ్ అండ్ డాషింగ్ అనబడే శరత్ గారు కూడా బ్లాగ్ ను కొంతమందికే పరిమితం చేయడం ఏంటో అర్ధం కావడం లేదు . "

    ధన్యవాదాలు. నా బ్లాగు సెట్టింగ్ ని కొంతమందికే పరిమితం చేసినట్లు పెట్టాను కానీ అసలు బ్లాగు వ్రాయడమే మానివేసాను. అందుకు ఎన్నో కారణాలు. మీరు అన్నట్లు గానీ బ్లాగులు నిస్సారంగా, చప్పగా సాగుతున్నాయి. హారం మూతబడ్డ తరువాత బ్లాగుల మీద, వ్రాయడం మీద ఆసక్తి తగ్గి కూడలి ఒక్కటి మాత్రం చూస్తున్నాను. అందులో సినిమా, రాజకీయ వార్తల బ్లాగులూ, కాపీ పేస్టు బ్లాగులూ ఎందుకో అర్ధం కాదు. కొన్ని కారణాల వల్ల ఇదివరకులా వ్రాయదలుచుకోలేదు. అలాంటప్పుడు ఇక వ్రాయడం ఎందుకులే అనే నిర్లిప్తత కూడా ఒక కారణం.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. People would consider two things while they publish their stuff:

    1. Quantity of readers
    2. Ease of publishing

    #1 is not a big problem as far as blogs are considered. In fact we now have more blog readers than some 3-4 years ago.

    But as far as #2 is concerned, it is much easier to publish on FB or G+. A couple of clicks and boom, your post is visible .. But for blogger or wordpress sites, it takes a lot more effort and one has to wait until it appears on the aggregators.

    ReplyDelete

  12. ధర్మం చెయ్ బాబు, ధర్మం చెయ్ బాబు, అరణా ఒరణా కాలణా !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  13. అయ్యా రమణయ్యా, మీరు పనిలేక కాదు, పని గట్టు కొనే బ్లాగులు రాస్తున్నారు. వినేవారు ఉంటే చెవులో పువ్వు పెట్టే రకం. మీరెందు కు బ్లాగులో క్వాలిటి పడిపోయిందను కొంట్టున్నారు. అంతర్జాతీయ తెలుగు వార్తల బ్లాగు పట్టువదలని విక్రమార్కుడివలే రాస్తున్నాడు గదా! తాళం వేస్తూ వ్యాఖ్యలు రాసే చందుతులసి, ప్రవీణ్ వైజాగ్, తిరుపాలు వారు రాసిన దానికి తందానా తానా అని వ్యాఖ్యలు రాస్తూన్నారు కదా!

    ReplyDelete
  14. మార్క్సిస్ట్ భావజాలం బ్లాగులు రాసే వారికి పైకి ప్రేమ, మానవత్వం, మనిషిగా జీవించటం అని నంగనాచి మాటలు చెపుతూ రోజు భారతసంస్కృతిని, బిజెపి పార్టి ని అడ్డుపెట్టుకొని హిందువులను ద్వేషించటం వారి నైజం. ఈ మహా మేధావుల దగ్గర సమస్యలకి ఎమైనా పరిష్కారం ఉందా అంటే అది లేదు. హిందూవు సంస్కృతిని, బాపనోళ్ళను తిట్టటమే వారికి తెలిసిన సాహిత్యం.

    ReplyDelete
  15. నేను తెలుగు బ్లాగులు..ఇంగ్లీష్ బ్లాగులు రెండూ చదువుతుంటా..! ఇంగ్లీష్ బ్లాగుల్లో కామెంట్లు ప్రొత్సాహకరంగా చేస్తారు చదివేవాళ్ళు.ఇష్టం లేక పోతే పెద్దగా స్పందించరు.కాని మన తెలుగు బ్లాగు ల్లో చూస్తే..ఎక్కువమంది..బ్లాగరుని దెప్పిపొడవడానికో లేదా స్వంత విజ్ఞానం వెల్లడించడానికో చేస్తుంటారు. తెలుగు అగ్రిగేటర్లు నిజంగా దేవతలే..వాళ్ళు చేస్తున్న సర్వీసు కి అభినందించాలి.పైసా ఖర్చు లేకుండా జనానికి చేరువచేస్తున్నారని అలోచించకుండా..ఆ బ్లాగులెందుకు..ఈ బ్లాగులెందుకు అంటూ షంటింగులొకటి.ఇష్టం లేకపోతే ఒక బ్లాగు ని చూడడం మానేస్తే పోద్దిగా ..ఏంటో కొంతమంది బాధ.తమిళ అగ్రిగేటర్లు టాప్ లో ఉన్నవి అన్నీ బ్లాగరులనుంచి డబ్బులు వసూలుచేస్తాయి.ఆ ట్రెండ్ మన దగ్గర వస్తే కాని తిక్క కుదరదు.

    ReplyDelete
  16. మీ ఆలోచన బాగుంది శ్రీనివాస్ గారు.నిజానికి తెలుగు బ్లాగులు తమ స్థానం కోల్పోలేదనే అనుకుంటున్నాను.

    ReplyDelete
  17. శ్రీనివాస్ గారు సమావేశం పెడితే సమస్యలు ఏమిటో అన్న విషయాలు, పైన ఉన్న వ్యాఖ్యలు చదివిన తరవాత తేట తెల్లం అవుతున్నాయి. చాలా మంది చిన్న చిన్న విషయాలకి కూడా Anonymous పేరుతొ వ్యాఖ్యలు చెయ్యవలసి వచ్చిన దుర్గతి మన బ్లాగుల్లో పట్టింది... కారణం...ఏదైనా బ్లాగులో పైన వ్రాసిన విషయం మీద విమర్శ పెడితే... ఆ బ్లాగర్ కన్నా ముందర వేరెవరో వచ్చి...ఆ వ్యాఖాతని చీల్చి చెండాడేస్తున్నారు...అలాంటి సందర్భాలలో సదరు బ్లాగరు నిమ్మకు నీరేత్తినట్టుగా ఊరకుంటున్నారే గాని వ్యాఖ్యాతల మానాన్ని కాపాడటం లేదు.... అందువల్లనే చాలా మంది దూరంగా ఉండటమో లేక Anonymous వ్యాఖ్యాతలుగా మిగిలిపోవటమో జరుగుతోంది.... విచిత్రం ఏమంటే Anonymous వ్యాఖ్యాతల వల్లనే ఈ డేమేజ్ జరుగుతోంది...అందువల్ల వ్యాఖ్యాలలో Anonymous ఆప్షన్ ని తొలగిస్తే ఈ ఇబ్బంది ఉండదు... ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిని గుర్తించటం తేలిక... అనుచిత వ్యాఖ్యలు కూడా రావు....ఎవరి ఉద్దేశ్యం వారు మర్యాదగా ప్రకటించుకోటానికి అవకాశం ఉన్నప్పుడు వ్యాఖ్యాతలు పెరుగుతారు....అలాగే, బ్లాగర్లు తమ సిద్ధాంతాలని సహేతుకంగా మర్యాదకరంగా వ్యక్తపరచాలి....అప్పుడు అన్ని విధాలా అందరికి బ్లాగుల పట్ల ఆదరణ ఉంటుంది....

    ReplyDelete
  18. అనానిమస్ గారికి,మరికొందరికి అభిమానులైన సదరు స్టార్ బ్లాగరులు , సీనియర్ బ్లాగరులు , గొప్ప బ్లాగరులు ఏవో కొంపలు మునిగే సమస్యలు వచ్చినాయని, బ్లాగ్లోకం పాడయ్యింది కాబట్టి బ్లాగులు రాయటం ఆపలేదని నా అభిప్రాయం.. వారందరూ ఇప్ప్పుడు రాస్తున్న బ్లాగర్లతొపాటూ రాస్తే తమ స్థాయి?? ఎక్కడ తగ్గిపోతుందో అని ... అలాగే కొన్ని "ఇ" పత్రికల్లోనూ .. అదపదడపా కొన్ని దిన,వార , మాస పత్రికల్లోవ్యాసాలు,రకరకాల కధనాలు రాస్తూ తద్వారా పలుకుబడిని , రాబడిని సంపాదించే దిశగా ప్రయత్నిస్తున్నారని చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటాను ,,
    కనుక స్టారుల ( బ్లాగరుల )కోసం మరీ ఎక్కువగా బాధపడవద్దని మనవి

    ReplyDelete
  19. బ్లాగంటే కొన్ని అభిప్రాయలు, భావనలను అందరితో పంచుకునే వేదిక.ఇందులో వర్షం గురించి ఒకరు ముందు రోజు పోస్ట్ పెడితే రెండొ రోజు మరొకరు పోస్ట్ పెట్టొచ్చు అంతమాత్రాన అది కాపీ చేసినట్లు అవుతుందా .. మన ముందు వెళ్ళేవాడు రెండు కాళ్ళతో నడిచాడు మనం కూడా అలాగే నడిస్తే కాపీ కొట్టాము అంటారని ఒక్క కాలుతో నడిస్తే కింద పడి మొహం పగిలిపోగలదు ..

    ఒకప్పటి బ్లాగరులే గొప్పవారు,స్టార్లు, సూపర్ స్టార్లు అంటే ఇప్పుడు రాసే వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళని మీ అభిప్రాయమా ..సూపర్ స్టార్లు.. స్టార్లు అని సినిమా రంగం ఎంతోమంది కళాకారుల జీవితాలతో ఆడుకుంది . అలాంటి సినిమా రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోదు ఈ బ్లాగ్ మాఫియా కూడా .. వాళ్ళకిష్టమైన వాళ్ళను సపోర్ట్ చేస్తూ కొత్త వాళ్ళని, అందరితో ఆన్ లైన్ లో , ఫోనుల్లో చాటింగ్ చేయని వాళ్ళని వేధించటం లో సదరు సూపర్ స్టార్ బ్లాగరులు కొందరు మాఫియాకి ఎంతమాత్రం తీసిపోరు

    ReplyDelete
  20. మిత్రులు శ్యామలరావు గారు,(ఓ మంచి కాపీ కాట్ )
    I apologize at the outset.

    What do u say
    “My post dated 24.03.2014 under link

    http://kasthephali.blogspot.in/2014/03/blog-post_24.html

    appeared in ur post dated 15.09.2014 under link
    http://syamaliyam.blogspot.in/”
    I am extremely sorry to show u this practically. I will remove it soon u acknowledged.

    ReplyDelete
  21. శ్రీనివాస్ గారూ, "శోధిని" సంకలినిలో "వ్యాఖ్యల" విభాగం ఈ నెల 4 వ తేదీ తరువాత update అవడం లేదండి.

    ReplyDelete
    Replies
    1. సరిజేసినట్లున్నారు, థాంక్స్ శ్రీనివాస్ గారూ.

      Delete

hit counter